వొఖ్క భారతి.. అనేక ప్రశ్నలకు సమాధానం
"ఎంతమంది ఆడోల్లు ఆ రుతువు ఎరక్కుండా వుండారో
ఆడవాళ్ళ నోట్లో నువ్వుగింజ నానదు అని సామెత తయారుచేసి దానికి వుపపత్తిగా యెన్నో పౌరాణిక గాథల్ని కల్పించుకున్నాం. ఆడవాళ్ళ మాటలకు అర్ధాలు వేరులే అని పాటలు రాసుకున్నాం. మహిళల ముచ్చట్ల గురించి మగవాళ్ళు కట్టుకునే ట్యూన్లూ కార్టూన్లు అనేకం. కానీ ఏకాంత సమయాల్లో స్త్రీలు తోటి స్త్రీలతో చెప్పుకునే దేవ రహస్యాలు బయటి ప్రపంచానికి తెలీవు. ఇంటా బయటా వాళ్ళ ఆలోచనలపైన వాటి వ్యక్తీకరణలపైన ప్రకటిత అప్రకటిత ఆంక్షలమధ్య నిషేధాల మధ్య అణచిపెట్టుకున్న మాటలు లోలోపల పుగ్గబట్టుకున్న భావనలు చెప్పుకోడానికి అవకాశం వస్తే రాయడానికి ఇతిహాసాలు పురాణాలు చాలవు. యుగాలుగా దాచి వుంచిన గుట్టు మట్టులు రట్టు కాక మానవు. అయితే వాటిని యెవరు యెప్పుడు యెక్కడ బహిరంగపరుస్తారు అన్నదే పెద్ద సవాలు. రచయిత్రి ఎండపల్లి భారతి ఆ ఛాలెంజ్ స్వీకరించింది. సాహిత్యంలో పాతుకుపోయిన మౌన సమయాల్ని బద్దలుకొట్టింది................
వొఖ్క భారతి.. అనేక ప్రశ్నలకు సమాధానం "ఎంతమంది ఆడోల్లు ఆ రుతువు ఎరక్కుండా వుండారో ఆడవాళ్ళ నోట్లో నువ్వుగింజ నానదు అని సామెత తయారుచేసి దానికి వుపపత్తిగా యెన్నో పౌరాణిక గాథల్ని కల్పించుకున్నాం. ఆడవాళ్ళ మాటలకు అర్ధాలు వేరులే అని పాటలు రాసుకున్నాం. మహిళల ముచ్చట్ల గురించి మగవాళ్ళు కట్టుకునే ట్యూన్లూ కార్టూన్లు అనేకం. కానీ ఏకాంత సమయాల్లో స్త్రీలు తోటి స్త్రీలతో చెప్పుకునే దేవ రహస్యాలు బయటి ప్రపంచానికి తెలీవు. ఇంటా బయటా వాళ్ళ ఆలోచనలపైన వాటి వ్యక్తీకరణలపైన ప్రకటిత అప్రకటిత ఆంక్షలమధ్య నిషేధాల మధ్య అణచిపెట్టుకున్న మాటలు లోలోపల పుగ్గబట్టుకున్న భావనలు చెప్పుకోడానికి అవకాశం వస్తే రాయడానికి ఇతిహాసాలు పురాణాలు చాలవు. యుగాలుగా దాచి వుంచిన గుట్టు మట్టులు రట్టు కాక మానవు. అయితే వాటిని యెవరు యెప్పుడు యెక్కడ బహిరంగపరుస్తారు అన్నదే పెద్ద సవాలు. రచయిత్రి ఎండపల్లి భారతి ఆ ఛాలెంజ్ స్వీకరించింది. సాహిత్యంలో పాతుకుపోయిన మౌన సమయాల్ని బద్దలుకొట్టింది................© 2017,www.logili.com All Rights Reserved.