ఈ కాలంలో హేతువాదం కూడా కొన్ని పరిమితులకు లోబడి ఒక మూడ విశ్వాసంగా జీవన పార్శ్వాలను అసత్యాలని తోసిరాజంటున్నది. ఈ సందర్బంలో ఈ పురాణ గాథలను చారిత్రక ఆధారాల మీదుగా పురాతన శిథిలాల మీదుగా సముద్ర గర్భాల్లో లభించిన అవశేషాల మీదుగా సత్యాలను నిరూపించే ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నం ఈనాటి పాటకుడిని, విశ్వాసం వైపు కొంతవరకు పయనింపజేస్తుంది. పురాణగాథల్ని చర్చించే సంధర్బంలో పేజర్ "ది గోల్డెన్ బో" అనే గ్రంథంలో ప్రపంచ వ్యాప్త పురాగాథలలోని సమానాంశాలు పేర్చి చూపెట్టడం జరిగింది. ఇక్కడ ఈ గ్రంధంలో రచయిత ఆధునిక శాస్త్రీయ అంశాల ఆధారంగా పురాగాథాంశాలను నిజాలుగా నిశ్చయించే ప్రయత్నం చేసాడు.
దేవ రహస్యం అనే ఈ గ్రంథం దృశ్యమాధ్యమానికి అనుకూలంగా నిర్మింపబడ్డది. దీని పాఠకులు తమకు తాము తెలియకుండానే వక్తవ్యాన్ని అంగీకరించే దశలోనికి చేరుకుంటారు. ఒక సమ్మోహన స్థితిలో సామాన్యులు ఇంద్రీయ ద్వారాల నుండి సాగిపోతూ అతీంద్రియ స్థాయికి చేరుకుంటారు.
- కోవెల సంతోష్ కుమార్
ఈ కాలంలో హేతువాదం కూడా కొన్ని పరిమితులకు లోబడి ఒక మూడ విశ్వాసంగా జీవన పార్శ్వాలను అసత్యాలని తోసిరాజంటున్నది. ఈ సందర్బంలో ఈ పురాణ గాథలను చారిత్రక ఆధారాల మీదుగా పురాతన శిథిలాల మీదుగా సముద్ర గర్భాల్లో లభించిన అవశేషాల మీదుగా సత్యాలను నిరూపించే ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నం ఈనాటి పాటకుడిని, విశ్వాసం వైపు కొంతవరకు పయనింపజేస్తుంది. పురాణగాథల్ని చర్చించే సంధర్బంలో పేజర్ "ది గోల్డెన్ బో" అనే గ్రంథంలో ప్రపంచ వ్యాప్త పురాగాథలలోని సమానాంశాలు పేర్చి చూపెట్టడం జరిగింది. ఇక్కడ ఈ గ్రంధంలో రచయిత ఆధునిక శాస్త్రీయ అంశాల ఆధారంగా పురాగాథాంశాలను నిజాలుగా నిశ్చయించే ప్రయత్నం చేసాడు. దేవ రహస్యం అనే ఈ గ్రంథం దృశ్యమాధ్యమానికి అనుకూలంగా నిర్మింపబడ్డది. దీని పాఠకులు తమకు తాము తెలియకుండానే వక్తవ్యాన్ని అంగీకరించే దశలోనికి చేరుకుంటారు. ఒక సమ్మోహన స్థితిలో సామాన్యులు ఇంద్రీయ ద్వారాల నుండి సాగిపోతూ అతీంద్రియ స్థాయికి చేరుకుంటారు. - కోవెల సంతోష్ కుమార్© 2017,www.logili.com All Rights Reserved.