ఇద్దరు మహాకవుల సంగమం
బాంగ్లాదేశ్లో నిరంకుశ షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండో స్వాతంత్ర్యోద్యమంగా ప్రఖ్యాతమైన ఉద్యమంలో రాజ్యపు పోలీసు బలగాలు విద్యార్థుల మీదికి తుపాకులు ఎక్కుపెట్టి ఉండగా, విద్యార్థులు మాత్రం తమను తాము ఛేదించలేని గోడగా నిలుపుకుని, పోలీసులకు నేరుగా గురిపెట్టి,
"బందిఖానా ఇనుప ద్వారాలు
బద్దలు కొట్టండి
సంకెళ్లను పూజించే
రక్తసిక్త మందిరాల
బలిపీఠాలను ధ్వంసం చేయండి"
అని నజ్రుల్ ఇస్లాం గీతాలు పాడుతుంటే, స్వేచ్ఛా స్వప్నాలు కనే వారందరికీ రోమాంచితమైన సందర్భం అది.
బాంగ్లాదేశ్ సరిహద్దు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ నిర్వహణలోని ఒక మదరసాలో ఉపాధ్యాయినిగా, స్వయంగా బాంగ్లా వ్యక్తిగా, ఆ సంఘటన నన్ను లోలోపలి నుంచి కదిలించింది. యాదృచ్ఛికంగా ఆ రోజే నేను ఐదో తరగతి విద్యార్థులకు ఒక కొత్త అధ్యాయం మొదలు పెట్టబోతున్నాను. నేను విద్యార్థులకు వేసిన మొట్టమొదటి ప్రశ్న "కాజీ నజ్రుల్ ఇస్లాం పేరు విన్నారా” అని. విద్యార్థులు తమ మౌనంతో జవాబిచ్చారు. ఆ మౌనం చూసి నా గుండె జారిపోయింది. సరిహద్దుకు అవతలివైపు, బాంగ్లా ప్రజలే ఉత్సవాలు జరుపుకుంటూ, అందుకు నజ్రుల్ రాసిన పాటల నుంచీ కవితల నుంచీ శక్తిని పొందుతుంటే, సరిహద్దు ఇవతలివైపు నజ్రుల్ పేరయినా తెలియని స్థితి ఉంది. ఆ తరగతి అయిపోయి ఉపాధ్యాయుల గదిలోకి వచ్చాక, ఆ సంగతి నా సహ ఉపాధ్యాయులతో పంచుకున్నప్పుడు నా సహోద్యోగి కూడ ఆశ్చర్యపోలేదు సరిగదా, 'నజ్రులా, ఎవరు? బాంగ్లాదేశ్కు చెందినవారే కదా' అంటే నా గుండె మరొకసారి పగిలిపోయింది.
కవికి ఒక దేశం ఉంటుందా? కవిని ఒకానొక జాతిలో బంధించ వచ్చునా? తన జీవితమంతా పీడితుల కోసం, అణగారిన ప్రజల కోసం పోరాడిన నిజమైన.....................
ఇద్దరు మహాకవుల సంగమం బాంగ్లాదేశ్లో నిరంకుశ షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండో స్వాతంత్ర్యోద్యమంగా ప్రఖ్యాతమైన ఉద్యమంలో రాజ్యపు పోలీసు బలగాలు విద్యార్థుల మీదికి తుపాకులు ఎక్కుపెట్టి ఉండగా, విద్యార్థులు మాత్రం తమను తాము ఛేదించలేని గోడగా నిలుపుకుని, పోలీసులకు నేరుగా గురిపెట్టి, "బందిఖానా ఇనుప ద్వారాలు బద్దలు కొట్టండి సంకెళ్లను పూజించే రక్తసిక్త మందిరాల బలిపీఠాలను ధ్వంసం చేయండి" అని నజ్రుల్ ఇస్లాం గీతాలు పాడుతుంటే, స్వేచ్ఛా స్వప్నాలు కనే వారందరికీ రోమాంచితమైన సందర్భం అది. బాంగ్లాదేశ్ సరిహద్దు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ నిర్వహణలోని ఒక మదరసాలో ఉపాధ్యాయినిగా, స్వయంగా బాంగ్లా వ్యక్తిగా, ఆ సంఘటన నన్ను లోలోపలి నుంచి కదిలించింది. యాదృచ్ఛికంగా ఆ రోజే నేను ఐదో తరగతి విద్యార్థులకు ఒక కొత్త అధ్యాయం మొదలు పెట్టబోతున్నాను. నేను విద్యార్థులకు వేసిన మొట్టమొదటి ప్రశ్న "కాజీ నజ్రుల్ ఇస్లాం పేరు విన్నారా” అని. విద్యార్థులు తమ మౌనంతో జవాబిచ్చారు. ఆ మౌనం చూసి నా గుండె జారిపోయింది. సరిహద్దుకు అవతలివైపు, బాంగ్లా ప్రజలే ఉత్సవాలు జరుపుకుంటూ, అందుకు నజ్రుల్ రాసిన పాటల నుంచీ కవితల నుంచీ శక్తిని పొందుతుంటే, సరిహద్దు ఇవతలివైపు నజ్రుల్ పేరయినా తెలియని స్థితి ఉంది. ఆ తరగతి అయిపోయి ఉపాధ్యాయుల గదిలోకి వచ్చాక, ఆ సంగతి నా సహ ఉపాధ్యాయులతో పంచుకున్నప్పుడు నా సహోద్యోగి కూడ ఆశ్చర్యపోలేదు సరిగదా, 'నజ్రులా, ఎవరు? బాంగ్లాదేశ్కు చెందినవారే కదా' అంటే నా గుండె మరొకసారి పగిలిపోయింది. కవికి ఒక దేశం ఉంటుందా? కవిని ఒకానొక జాతిలో బంధించ వచ్చునా? తన జీవితమంతా పీడితుల కోసం, అణగారిన ప్రజల కోసం పోరాడిన నిజమైన.....................© 2017,www.logili.com All Rights Reserved.