Title | Price | |
Cheruvu Gandi | Rs.160 | In Stock |
విప్లవాన్ని గర్భంలో దాచుకున్న
పరివర్తనాత్మక నవల మీరనుభవిస్తున్న భూములు, ఆస్తులు మీవి కావు. చాలావరకు ఈ ఊరి వారివే. భయపెట్టి, అణచివేసి మీ కుటుంబం లాక్కున్నవి.
మీ కుటుంబ మోసాలపై పోరాడే శక్తిలేక వాళ్ళు వాటిని ధారాదత్తం చేశారు. అదంతా మీ కుటుంబ పాపమే. గుడిమెట్లపై విసిరేయబడ్డ మీ తాత అదేమెట్లపై భిక్షమెత్తుకుని బతకాల్సినవాడు. అలాంటి బికారి, ఊరితోపాటు గుడినీ, గుడిమాన్యాన్ని దోచుకున్నాడు.
మీ తాత దోపిడీని మొదలెట్టాడు. మీనాన్న ఆ దోపిడీని విస్తరించాడు. నీ తరంలో ఆ దోపిడీని రాష్ట్ర స్థాయికి చేర్చి వేలకోట్లకు ఎదిగావు. (చెరువు గండి పు. 164)
ఈ దుర్మార్గుల మీద దళిత మహిళ ఎర్రమ్మ చేసిన పోరాటం ఈ నవల. ఈ నవల దగ్గరికి మళ్ళీ వద్దాం.
తెలుగు నవలకు నూటయాభయేళ్ళ చరిత్ర పూర్తి కావస్తున్నది (1872-2022) ఈ చరిత్రాత్మక శిఖరారోహణ దశలో రాయలసీమ, అనంతపురం జిల్లానుండి ఆచార్య వంకిరెడ్డి రెడ్డెప్పరెడ్డిగారి ఈ “చెరువు గండి” నవల వచ్చింది. రెడ్డెప్పరెడ్డిగారు ఆర్థికశాస్త్రం అధ్యయనం చేసి శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో గ్రామీణాభివృద్ధిశాఖలో ఆచార్యుడుగా పదవీ విరమణ చేశారు. గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అనేక ప్రాజెక్టులలో పనిచేశారు. చాలా గ్రామాలు తిరిగారు. వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన రెడ్డెప్పరెడ్డిగారు
గ్రామీణ భారతానికున్న ఆర్థిక, రాజకీయ, సాంఘిక పార్శ్వాలు, మానవ సంబంధాలు, వాటిని నిర్ణయిస్తున్న గతితార్కిక సూత్రాలను సహజంగానే అవగాహన చేసుకుని ఈ నవల...........
విప్లవాన్ని గర్భంలో దాచుకున్న పరివర్తనాత్మక నవల మీరనుభవిస్తున్న భూములు, ఆస్తులు మీవి కావు. చాలావరకు ఈ ఊరి వారివే. భయపెట్టి, అణచివేసి మీ కుటుంబం లాక్కున్నవి. మీ కుటుంబ మోసాలపై పోరాడే శక్తిలేక వాళ్ళు వాటిని ధారాదత్తం చేశారు. అదంతా మీ కుటుంబ పాపమే. గుడిమెట్లపై విసిరేయబడ్డ మీ తాత అదేమెట్లపై భిక్షమెత్తుకుని బతకాల్సినవాడు. అలాంటి బికారి, ఊరితోపాటు గుడినీ, గుడిమాన్యాన్ని దోచుకున్నాడు. మీ తాత దోపిడీని మొదలెట్టాడు. మీనాన్న ఆ దోపిడీని విస్తరించాడు. నీ తరంలో ఆ దోపిడీని రాష్ట్ర స్థాయికి చేర్చి వేలకోట్లకు ఎదిగావు. (చెరువు గండి పు. 164) ఈ దుర్మార్గుల మీద దళిత మహిళ ఎర్రమ్మ చేసిన పోరాటం ఈ నవల. ఈ నవల దగ్గరికి మళ్ళీ వద్దాం. తెలుగు నవలకు నూటయాభయేళ్ళ చరిత్ర పూర్తి కావస్తున్నది (1872-2022) ఈ చరిత్రాత్మక శిఖరారోహణ దశలో రాయలసీమ, అనంతపురం జిల్లానుండి ఆచార్య వంకిరెడ్డి రెడ్డెప్పరెడ్డిగారి ఈ “చెరువు గండి” నవల వచ్చింది. రెడ్డెప్పరెడ్డిగారు ఆర్థికశాస్త్రం అధ్యయనం చేసి శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో గ్రామీణాభివృద్ధిశాఖలో ఆచార్యుడుగా పదవీ విరమణ చేశారు. గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అనేక ప్రాజెక్టులలో పనిచేశారు. చాలా గ్రామాలు తిరిగారు. వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన రెడ్డెప్పరెడ్డిగారు గ్రామీణ భారతానికున్న ఆర్థిక, రాజకీయ, సాంఘిక పార్శ్వాలు, మానవ సంబంధాలు, వాటిని నిర్ణయిస్తున్న గతితార్కిక సూత్రాలను సహజంగానే అవగాహన చేసుకుని ఈ నవల...........© 2017,www.logili.com All Rights Reserved.