కన్నులవిందు చేసే కేరళ సొగసులు
కేశవ శంకర పిళ్ళై 1902 జూలై 31న కేరళలోని కాయంకులంలో జన్మించాడు. ఆయన చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్నాడు. తల్లి తిరిగి పెళ్లి చేసుకొని తన దారిన తాను వెళ్లిపోయింది. అతనిని మేనమామ తండ్రి, మేనమామ, అమ్మమ్మ పెంచి పెద్దచేశారు. మనం పైన చెప్పుకున్నట్లు తాత చండశాసనుడైనా, అమ్మమ్మ అతనిపై అవ్యాజమైనప్రేమ కురిపించేది. ఆమె ప్రేమలో ఆయన ఒక తల్లి అమృతమయమైన ఆప్యాయతను, అనురాగాన్ని చవిచూశాడు. అందుచేతనే ఆయన తనకు తల్లిదండ్రుల ప్రేమ కరువైందని ఎన్నడూ కలతచెందలేదు. తాత సూర్యుడైతే ఆమె చంద్రుడు. ఇద్దరూ ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దారు. ఆయనపై ఆమె ప్రభావమే ఎక్కువ.
ఆయన పుట్టిన కేరళ ప్రకృతి అందాలకు, నందనవనాల్లాంటి పూలతోటలకు ప్రసిద్ధి. పచ్చ పచ్చని చేలతో, భూమికి ఆకుపచ్చని రంగు అద్దినట్లు అలరారే చెట్లతో వింతసోయగాలు అద్దుకొని యాత్రికులను ఎల్లవేళలా ఆహ్వానిస్తూ ఉంటుంది కేరళ. గలగల పారే సెలయేళ్లు, బిరబిరా పరుగిడే నదులు, చక్కనిచుక్కల చిక్కిన నడుములా ఉండే సన్నని కాలువలు, పిల్లగాలులతో చూపరులను ఆహ్లాదపరచే చెరువులు ఎంత అందమైన దృశ్యమాలిక? ఇవేకాదు, దేవతలే దివినుండి భువికి దిగివచ్చి కట్టారా అనిపించే దేవాలయాలు, నాటి రాచరికపు తీపిగుర్తులుగా నిలిచే అంతఃపురాలు - కన్నుల విందుచేసే కేరళ సరళాంతరంగ. ఇప్పుడే కొబ్బరిచెట్లతో శోభిల్లుతున్న భూమి ఒక శతాబ్దం కిందట మరెంత సొబగుగా ఉండేదో ఊహించుకుంటే చాలు శరీరం పులకరించిపోతుంది. ఊహాలోకపు ఊరించే అందాలన్నీ కేరళ సొంతం. అందుకే కాబోలు దీనిని 'God's own country' (దేవుని స్వంత దేశం) అని పిలుస్తారు.....................
కన్నులవిందు చేసే కేరళ సొగసులు కేశవ శంకర పిళ్ళై 1902 జూలై 31న కేరళలోని కాయంకులంలో జన్మించాడు. ఆయన చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్నాడు. తల్లి తిరిగి పెళ్లి చేసుకొని తన దారిన తాను వెళ్లిపోయింది. అతనిని మేనమామ తండ్రి, మేనమామ, అమ్మమ్మ పెంచి పెద్దచేశారు. మనం పైన చెప్పుకున్నట్లు తాత చండశాసనుడైనా, అమ్మమ్మ అతనిపై అవ్యాజమైనప్రేమ కురిపించేది. ఆమె ప్రేమలో ఆయన ఒక తల్లి అమృతమయమైన ఆప్యాయతను, అనురాగాన్ని చవిచూశాడు. అందుచేతనే ఆయన తనకు తల్లిదండ్రుల ప్రేమ కరువైందని ఎన్నడూ కలతచెందలేదు. తాత సూర్యుడైతే ఆమె చంద్రుడు. ఇద్దరూ ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దారు. ఆయనపై ఆమె ప్రభావమే ఎక్కువ. ఆయన పుట్టిన కేరళ ప్రకృతి అందాలకు, నందనవనాల్లాంటి పూలతోటలకు ప్రసిద్ధి. పచ్చ పచ్చని చేలతో, భూమికి ఆకుపచ్చని రంగు అద్దినట్లు అలరారే చెట్లతో వింతసోయగాలు అద్దుకొని యాత్రికులను ఎల్లవేళలా ఆహ్వానిస్తూ ఉంటుంది కేరళ. గలగల పారే సెలయేళ్లు, బిరబిరా పరుగిడే నదులు, చక్కనిచుక్కల చిక్కిన నడుములా ఉండే సన్నని కాలువలు, పిల్లగాలులతో చూపరులను ఆహ్లాదపరచే చెరువులు ఎంత అందమైన దృశ్యమాలిక? ఇవేకాదు, దేవతలే దివినుండి భువికి దిగివచ్చి కట్టారా అనిపించే దేవాలయాలు, నాటి రాచరికపు తీపిగుర్తులుగా నిలిచే అంతఃపురాలు - కన్నుల విందుచేసే కేరళ సరళాంతరంగ. ఇప్పుడే కొబ్బరిచెట్లతో శోభిల్లుతున్న భూమి ఒక శతాబ్దం కిందట మరెంత సొబగుగా ఉండేదో ఊహించుకుంటే చాలు శరీరం పులకరించిపోతుంది. ఊహాలోకపు ఊరించే అందాలన్నీ కేరళ సొంతం. అందుకే కాబోలు దీనిని 'God's own country' (దేవుని స్వంత దేశం) అని పిలుస్తారు.....................© 2017,www.logili.com All Rights Reserved.