సి వి రామన్ ప్రపంచంలో అత్యుత్తమ శాస్త్రవేత్తల్లో ఒకరు. ఇతర దేశాల్లో మిగతా శాస్త్రవేత్తలకున్న వెసులుబాటు పరిస్థితులు ఆయనకు ఆనాడు లేవు. అరకొర వనరులతోనే, హేమాహేమీలైన విదేశీ సైంటిస్టులకు సమ ఉజ్జీ కాగలిగిన ధీశాలి ఆయన. ఆయన నోబెల్ బహుమతి గ్రహీత.
ఆయన సంగీతాన్ని శాస్త్రాన్నీ మేళవించిన ప్రజ్ఞాశాలి. ఆయన నిరాడంబరత్వం తెచ్చిపెట్టుకొన్నది కాదు. అది ప్రదర్శన కోసమూ కాదు. నెహ్రూ ప్రభుత్వం ఆయనకు దేశ ఉపాధ్యక్ష పదవి (viceprsident ship')ని ఇవ్వచూపితే, ఆ 'షిప్పు'ని నేనేం చేసుకోను అని అడిగిన నిరాడంబరత్వం అది. ఆయన యూరపు, అమెరికాలు తిరిగి వచ్చాక, అక్కడి వర్ణ వివక్ష గురించి అడిగితే, భారతదేశంలో లాగానే అక్కడా కొంతమంది మూర్ఖులు ఉన్నారు అనగలిగిన సత్యవాది ఆయన.
అనేక అంశాల్లో గాంధి, నెహ్రూలతో విభేదించినప్పటికీ వారి గౌరవాన్ని చూరగొన్న వ్యక్తి ఆయన. ఆయన జిజ్ఞాస ప్రచండం. దానిలో పదోవంతైనా దేశాన్ని ఆవహిస్తే, దేశం ఎంతగానో వెలిగిపోతుంది. అందులో సందేహం లేదు.
సి వి రామన్ ప్రపంచంలో అత్యుత్తమ శాస్త్రవేత్తల్లో ఒకరు. ఇతర దేశాల్లో మిగతా శాస్త్రవేత్తలకున్న వెసులుబాటు పరిస్థితులు ఆయనకు ఆనాడు లేవు. అరకొర వనరులతోనే, హేమాహేమీలైన విదేశీ సైంటిస్టులకు సమ ఉజ్జీ కాగలిగిన ధీశాలి ఆయన. ఆయన నోబెల్ బహుమతి గ్రహీత. ఆయన సంగీతాన్ని శాస్త్రాన్నీ మేళవించిన ప్రజ్ఞాశాలి. ఆయన నిరాడంబరత్వం తెచ్చిపెట్టుకొన్నది కాదు. అది ప్రదర్శన కోసమూ కాదు. నెహ్రూ ప్రభుత్వం ఆయనకు దేశ ఉపాధ్యక్ష పదవి (viceprsident ship')ని ఇవ్వచూపితే, ఆ 'షిప్పు'ని నేనేం చేసుకోను అని అడిగిన నిరాడంబరత్వం అది. ఆయన యూరపు, అమెరికాలు తిరిగి వచ్చాక, అక్కడి వర్ణ వివక్ష గురించి అడిగితే, భారతదేశంలో లాగానే అక్కడా కొంతమంది మూర్ఖులు ఉన్నారు అనగలిగిన సత్యవాది ఆయన. అనేక అంశాల్లో గాంధి, నెహ్రూలతో విభేదించినప్పటికీ వారి గౌరవాన్ని చూరగొన్న వ్యక్తి ఆయన. ఆయన జిజ్ఞాస ప్రచండం. దానిలో పదోవంతైనా దేశాన్ని ఆవహిస్తే, దేశం ఎంతగానో వెలిగిపోతుంది. అందులో సందేహం లేదు.© 2017,www.logili.com All Rights Reserved.