ఘట్టమరాజు అశ్వత్థ నారాయణ గారు తెలుగు సాహితీ ప్రపంచానికి సుపరిచితులు. వివిధ తెలుగు పత్రికలలో తమ వ్యాసాల రూపంలో ఆయన తరచుగా దర్శనమిస్తూ ఉంటారు. బహుగ్రంథ పఠనం వారి విశిష్టత. ఊరికే పుస్తకం చదవడం కాక దాని గుణగ్రహణ పారీణత ఆయనను విశిష్ట పాఠకునిగా చేస్తున్నది. తానొక గ్రంథం చదివి ఆనందించడంతో ఆయన తృప్తి చెందడు. రచయితకు దాని గుణదోషాలను వివరిస్తూ లేఖ రాయడమో, ఫోనులో మాట్లాడడమో చేస్తాడు. అంతేకాదు. దానిపై ఒక పరిచయ వ్యాసం రాసి ఏదో ఒక పత్రికలో ప్రచురణకోసం పంపిస్తాడు. ఆయన సాహితీప్రియులతోను, పరిశోధకులతోను, గ్రంథకర్తలతోను నిరంతరం సంభాషిస్తూ ఉంటాడు. తన హృదయానికి నచ్చినవారితో తరుచూ మాట్లాడి అభిప్రాయాలు పంచుకోవడం ఆయన అలవాటు. అందువల్ల సాహితీవేత్తలతో ఆయనకు పరిచయాలు మెండు. పేరుపొందిన రచయితలనే కాదు, వర్ధమాన రచయితలనూ, సాహిత్య రంగంలో తొలి అడుగు వేసిన వారిని కూడా ఒక్కలాగా చూడగలిగిన సమదృష్టి ఆయనకు పట్టువడింది. ఆయన అభిప్రాయాన్ని అభిలషించే రచయితల పట్టికలాగానే, తమ రచనలను సవరించమని కోరుకొనే రచయితల పట్టిక కూడా చాలా పొడవైనదే.
రచయితలు ప్రశంసలు వినడానికి చూపించినంత కుతూహలం విమర్శలు వినడానికి చూపించరు. కఠినమైన విమర్శ కాకపోయినా, కనీసం చిన్న చిన్న నెరసులనైనా చూపిస్తే తట్టుకోగల గుండె దిటవు మనవారికి తక్కువే. ఘట్టమరాజు గారు కేవల గుణగణనకు పరిమితం కారు. దోషముంటే చూపించక వదలరు. అది నచ్చని వారు దూరమవుతూ ఉంటారు. నచ్చిన వారు తమను సరిదిద్దుకొని బాగుపడుతుంటారు.............
అంతరంగాంతరంగం --- దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి ఘట్టమరాజు అశ్వత్థ నారాయణ గారు తెలుగు సాహితీ ప్రపంచానికి సుపరిచితులు. వివిధ తెలుగు పత్రికలలో తమ వ్యాసాల రూపంలో ఆయన తరచుగా దర్శనమిస్తూ ఉంటారు. బహుగ్రంథ పఠనం వారి విశిష్టత. ఊరికే పుస్తకం చదవడం కాక దాని గుణగ్రహణ పారీణత ఆయనను విశిష్ట పాఠకునిగా చేస్తున్నది. తానొక గ్రంథం చదివి ఆనందించడంతో ఆయన తృప్తి చెందడు. రచయితకు దాని గుణదోషాలను వివరిస్తూ లేఖ రాయడమో, ఫోనులో మాట్లాడడమో చేస్తాడు. అంతేకాదు. దానిపై ఒక పరిచయ వ్యాసం రాసి ఏదో ఒక పత్రికలో ప్రచురణకోసం పంపిస్తాడు. ఆయన సాహితీప్రియులతోను, పరిశోధకులతోను, గ్రంథకర్తలతోను నిరంతరం సంభాషిస్తూ ఉంటాడు. తన హృదయానికి నచ్చినవారితో తరుచూ మాట్లాడి అభిప్రాయాలు పంచుకోవడం ఆయన అలవాటు. అందువల్ల సాహితీవేత్తలతో ఆయనకు పరిచయాలు మెండు. పేరుపొందిన రచయితలనే కాదు, వర్ధమాన రచయితలనూ, సాహిత్య రంగంలో తొలి అడుగు వేసిన వారిని కూడా ఒక్కలాగా చూడగలిగిన సమదృష్టి ఆయనకు పట్టువడింది. ఆయన అభిప్రాయాన్ని అభిలషించే రచయితల పట్టికలాగానే, తమ రచనలను సవరించమని కోరుకొనే రచయితల పట్టిక కూడా చాలా పొడవైనదే. రచయితలు ప్రశంసలు వినడానికి చూపించినంత కుతూహలం విమర్శలు వినడానికి చూపించరు. కఠినమైన విమర్శ కాకపోయినా, కనీసం చిన్న చిన్న నెరసులనైనా చూపిస్తే తట్టుకోగల గుండె దిటవు మనవారికి తక్కువే. ఘట్టమరాజు గారు కేవల గుణగణనకు పరిమితం కారు. దోషముంటే చూపించక వదలరు. అది నచ్చని వారు దూరమవుతూ ఉంటారు. నచ్చిన వారు తమను సరిదిద్దుకొని బాగుపడుతుంటారు.............© 2017,www.logili.com All Rights Reserved.