జాగరణ
పడమట సూర్యుడు కొండల మాటుకి దిగిపోగానే తూర్పున పౌర్ణమి చంద్రుడు దిగంతం నుంచి పైకి లేచాడు. పగలంతా ఎండకు కాగిన చెట్లు సాయంత్రపు చల్లటి గాలికి తలలూపుతూ ఉన్నాయి. నల్లటి పిట్టలు రెక్కలు విప్పుకుని గిరికీలు కొడుతూ గూళ్ళకు చేరుకుంటున్నాయి.
చీకట్లు ముసురుకునే వేళ వరకు పగలంతా భిక్షాటనకు ఊరంతా తిరిగి జోలె నింపుకుని ఎప్పటిలానే తార్రోడ్డు నుంచి ఊరి చివరకు దారితీసే కాలిబాట పట్టాడు బైరాగి. అతడి ఒంటి మీద ఉన్న కాషాయవస్త్రాలు నలిగి, మాసి మట్టిరంగులోకి మారిపోయి ఉన్నాయి. నల్లగా, బక్కగా ఎండిపోయిన కొమ్మలా ఉన్నాడతను. చెమటకి నుదుటి మీది విభూతి, కుంకుమ చెరిగిపోయి ఉన్నాయి. నలుపు తెలుపు కలగలిసిన పొడవాటి గెడ్డం సాయంత్రపు ఎండలో అతడి నీడతో పాటు నడుస్తూ ఉంది.
పగలంతా మనుషులు ఒక ఊరి నుంచి మరొక ఊరికి నడుచుకుంటూ వెళ్ళే కాలిబాట పొద్దుగూకే కొద్దీ నిశ్శబ్దమవుతూ ఉంది. బైరాగి కాలిబాట దాటి ఊరి చివర గుబురు చెట్ల మధ్య సగానికి కూలిపోయి ఉన్న ఇంట్లోకి అడుగుపెట్టేసరికి పూర్తిగా చీకటి పడింది.
ఎప్పుడైనా కొత్తవాళ్ళు, పొరుగూరు వెళ్ళే బాటసారులు కాలిబాట నుంచి నడిచిపోతూ కూలిపోయిన ఆ ఇంటిని వింతగా చూసేవారు. ఒక్కోసారి పనీపాటాలేని సోమరులు మొండిగోడల నీడ పట్టున కూర్చుని పులిజూదం ఆడేవారు. కొత్తవారు ఎవరొచ్చినా బైరాగి పట్టించుకునేవాడు కాదు. వచ్చినవారు ఒకటి రెండు రోజులకే అక్కడి నిశ్శబ్దానికి విసుగొచ్చి వెళ్ళిపోయేవారు.
అతను ఆ పాడుబడ్డ ఇంట్లో ఎంతకాలం నుండి ఉంటున్నాడో ఎవరికీ తెలియదు. రోజుల తరబడి ఒంటరిగానే ఉంటాడు. వీపు గోడకు ఆనించి శూన్యంలోకి చూస్తూ.........................
జాగరణ పడమట సూర్యుడు కొండల మాటుకి దిగిపోగానే తూర్పున పౌర్ణమి చంద్రుడు దిగంతం నుంచి పైకి లేచాడు. పగలంతా ఎండకు కాగిన చెట్లు సాయంత్రపు చల్లటి గాలికి తలలూపుతూ ఉన్నాయి. నల్లటి పిట్టలు రెక్కలు విప్పుకుని గిరికీలు కొడుతూ గూళ్ళకు చేరుకుంటున్నాయి. చీకట్లు ముసురుకునే వేళ వరకు పగలంతా భిక్షాటనకు ఊరంతా తిరిగి జోలె నింపుకుని ఎప్పటిలానే తార్రోడ్డు నుంచి ఊరి చివరకు దారితీసే కాలిబాట పట్టాడు బైరాగి. అతడి ఒంటి మీద ఉన్న కాషాయవస్త్రాలు నలిగి, మాసి మట్టిరంగులోకి మారిపోయి ఉన్నాయి. నల్లగా, బక్కగా ఎండిపోయిన కొమ్మలా ఉన్నాడతను. చెమటకి నుదుటి మీది విభూతి, కుంకుమ చెరిగిపోయి ఉన్నాయి. నలుపు తెలుపు కలగలిసిన పొడవాటి గెడ్డం సాయంత్రపు ఎండలో అతడి నీడతో పాటు నడుస్తూ ఉంది. పగలంతా మనుషులు ఒక ఊరి నుంచి మరొక ఊరికి నడుచుకుంటూ వెళ్ళే కాలిబాట పొద్దుగూకే కొద్దీ నిశ్శబ్దమవుతూ ఉంది. బైరాగి కాలిబాట దాటి ఊరి చివర గుబురు చెట్ల మధ్య సగానికి కూలిపోయి ఉన్న ఇంట్లోకి అడుగుపెట్టేసరికి పూర్తిగా చీకటి పడింది. ఎప్పుడైనా కొత్తవాళ్ళు, పొరుగూరు వెళ్ళే బాటసారులు కాలిబాట నుంచి నడిచిపోతూ కూలిపోయిన ఆ ఇంటిని వింతగా చూసేవారు. ఒక్కోసారి పనీపాటాలేని సోమరులు మొండిగోడల నీడ పట్టున కూర్చుని పులిజూదం ఆడేవారు. కొత్తవారు ఎవరొచ్చినా బైరాగి పట్టించుకునేవాడు కాదు. వచ్చినవారు ఒకటి రెండు రోజులకే అక్కడి నిశ్శబ్దానికి విసుగొచ్చి వెళ్ళిపోయేవారు. అతను ఆ పాడుబడ్డ ఇంట్లో ఎంతకాలం నుండి ఉంటున్నాడో ఎవరికీ తెలియదు. రోజుల తరబడి ఒంటరిగానే ఉంటాడు. వీపు గోడకు ఆనించి శూన్యంలోకి చూస్తూ.........................© 2017,www.logili.com All Rights Reserved.