వృద్ధుడు అనే మాటకు కేవలం ముసలివాడనే అర్థం కాదు. వృద్ధి చెందినవాడు అని అర్థం. క్షీణదశకు చేరుకున్నవాడు, శారీరకంగా శిథిలమైనవాడు మాత్రమే వృద్ధుడు అని లోకంలో ఒక అనాలోచితమైన వాడుక ఏర్పడింది. వృద్ధి చెందినవాడు అంటే వయస్సు పెరగడం మాత్రమే కాదు దానితో పాటు లోకానుభవంపట్ల పెరిగిన పరిణితీ, పిల్లలకోసం ఏర్పడిన త్యాగగుణం, కుటుంబ మమకారం నుండి విస్తృతమైన విశ్వానురాగం - ఇవి వృద్ధి అంటే! ఇవన్నీ మరిచిపోయి వృద్ధుల కీళ్ళు సడలగానే యవ్వనంలో ఉన్నవాళ్ళు తామే ఏదో ఉద్ధరిస్తున్నామని భావిస్తే అదే నిజమైన క్షీణత.
వృద్ధాప్యం అంటే ముందుతరం మనకి ఎత్తిపట్టిన కరదీపం. కొత్త పాతల మేలి కలయిక అన్న గురజాడ వాక్యం అంతరార్థం ఇదే! జీవితాన్ని మన వర్తమానం నుండే కాక త్రికాల నేత్రంతో చూసినప్పుడే మనం వృద్ధుల్ని ప్రేమించగలం. సరిగ్గా ఇట్లాంటి వ్యక్తిత్వంతో జీవనయాగం సాగిస్తున్న విశిష్టవ్యక్తి శోభాపేరిందేవి. శోభ అనే పేరు ఎందుకు పెట్టారో కాని ఇప్పుడా పేరులో కరుణ, మానవత, ప్రేమ ప్రకాశిస్తున్నాయి. తాను వికలాంగుల కోసం, వృద్ధుల కోసం సామాజిక కార్యకలాపాల్లో నిమగ్నమై ఉండే ఒక నిరంతర సంఘసేవిక.
వృద్ధులపై తాను రాసిన సిద్ధాంత వ్యాసానికి రెండు వాక్యాలు రాయమంటే ఆమె గురించే రాస్తున్నానని అనుకోవద్దు. ఈ విషయాన్ని ఎన్నుకోవటంలో ఆమె వ్యక్తిత్వ నేపథ్యాన్ని గురించి చెప్పాలనుకోవడం నా ఉద్దేశం. ఆమెకి ఇష్టమైన విషయం, ఎంతో కష్టపడడానికి వెనుకాడని విషయాన్ని ఆమె ఎన్నుకుంది. సుమారు వెయ్యి కథలను పరిశీలించింది. దాదాపు రెండొందల కథలను ప్రస్తావించింది. ఒక ఇంటికి దూలం లాంటి వృద్ధాప్య భావనకు ఊయలలు కట్టుకుని ఊగింది. ఈ సిద్ధాంత వ్యాసం చదివినవారికి తమ స్వార్థం కొంత తగ్గి, వృద్ధుల లోకం పట్ల ఏ మాత్రం మమేకం కలిగినా ఈ పరిశోధకురాలి శ్రమ సార్థకమౌతుంది.
- డా ఎన్ గోపి
వృద్ధుడు అనే మాటకు కేవలం ముసలివాడనే అర్థం కాదు. వృద్ధి చెందినవాడు అని అర్థం. క్షీణదశకు చేరుకున్నవాడు, శారీరకంగా శిథిలమైనవాడు మాత్రమే వృద్ధుడు అని లోకంలో ఒక అనాలోచితమైన వాడుక ఏర్పడింది. వృద్ధి చెందినవాడు అంటే వయస్సు పెరగడం మాత్రమే కాదు దానితో పాటు లోకానుభవంపట్ల పెరిగిన పరిణితీ, పిల్లలకోసం ఏర్పడిన త్యాగగుణం, కుటుంబ మమకారం నుండి విస్తృతమైన విశ్వానురాగం - ఇవి వృద్ధి అంటే! ఇవన్నీ మరిచిపోయి వృద్ధుల కీళ్ళు సడలగానే యవ్వనంలో ఉన్నవాళ్ళు తామే ఏదో ఉద్ధరిస్తున్నామని భావిస్తే అదే నిజమైన క్షీణత. వృద్ధాప్యం అంటే ముందుతరం మనకి ఎత్తిపట్టిన కరదీపం. కొత్త పాతల మేలి కలయిక అన్న గురజాడ వాక్యం అంతరార్థం ఇదే! జీవితాన్ని మన వర్తమానం నుండే కాక త్రికాల నేత్రంతో చూసినప్పుడే మనం వృద్ధుల్ని ప్రేమించగలం. సరిగ్గా ఇట్లాంటి వ్యక్తిత్వంతో జీవనయాగం సాగిస్తున్న విశిష్టవ్యక్తి శోభాపేరిందేవి. శోభ అనే పేరు ఎందుకు పెట్టారో కాని ఇప్పుడా పేరులో కరుణ, మానవత, ప్రేమ ప్రకాశిస్తున్నాయి. తాను వికలాంగుల కోసం, వృద్ధుల కోసం సామాజిక కార్యకలాపాల్లో నిమగ్నమై ఉండే ఒక నిరంతర సంఘసేవిక. వృద్ధులపై తాను రాసిన సిద్ధాంత వ్యాసానికి రెండు వాక్యాలు రాయమంటే ఆమె గురించే రాస్తున్నానని అనుకోవద్దు. ఈ విషయాన్ని ఎన్నుకోవటంలో ఆమె వ్యక్తిత్వ నేపథ్యాన్ని గురించి చెప్పాలనుకోవడం నా ఉద్దేశం. ఆమెకి ఇష్టమైన విషయం, ఎంతో కష్టపడడానికి వెనుకాడని విషయాన్ని ఆమె ఎన్నుకుంది. సుమారు వెయ్యి కథలను పరిశీలించింది. దాదాపు రెండొందల కథలను ప్రస్తావించింది. ఒక ఇంటికి దూలం లాంటి వృద్ధాప్య భావనకు ఊయలలు కట్టుకుని ఊగింది. ఈ సిద్ధాంత వ్యాసం చదివినవారికి తమ స్వార్థం కొంత తగ్గి, వృద్ధుల లోకం పట్ల ఏ మాత్రం మమేకం కలిగినా ఈ పరిశోధకురాలి శ్రమ సార్థకమౌతుంది. - డా ఎన్ గోపి
© 2017,www.logili.com All Rights Reserved.