వజ్రాల దీవి
వింధ్యారణ్యాన్ని అనుకుని వున్న సౌమిత్రి రాజ్యంలో భద్రయ్య అనే ఒక సైనికుడు వుండేవాడు. రాజకోట రక్షణలో నమ్మకంగా పని చేస్తున్న అతన్ని రక్షణాధికారితో పాటు అందరూ గౌరవించేవారు. అలాంటి నిజాయితీపరుడికి ఓ విచిత్రమైన వ్యాధి సోకింది. దాంతో నవనాడులు కృంగిపోయి నాలుగేళ్లుగా మంచాన పడి వున్నాడు. మధ్యవయస్కుడైన భద్రయ్య భార్య మీనాక్షి సౌశీల్యంలో వనితారత్నమే. భర్తని అంటిపెట్టుకుని వుండి సేవలు చేస్తూ వుంది. ఒక వర్తకుడి ఇంట్లో వంటమనిషిగా పనిచేస్తూ కుటుంబ పోషణకు కావలసిన ధనాన్ని సంపాదిస్తున్నది. భర్త ఆరోగ్యంతో తిరుగుతున్న రోజుల్లో ఆమె ఎంత వైభవాన్ని చూసిందో, ఇప్పుడంత కష్టకాలాన్ని అనుభవిస్తున్నది. సుఖదుఃఖాల ప్రవాహంలో సాగిపోతున్న కాలమహిమను ఎవరూ ఊహించలేరు.
ఆ దంపతులకు జయశీలుడు అనే ఒక పుత్రుడున్నాడు. నవయవ్వనంతో మిసమిసలాడే జయశీలుడు వీరత్వంలో తండ్రికి తగ్గ తనయుడే. కానీ, చిన్నతనం నుంచి అదుపాజ్ఞలు లేక అల్లరి చిల్లరిగా పెరిగాడు. ఇంటి బాధ్యత పట్టించుకోకుండా స్నేహితులతో తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నాడు. ఆటలాడటమే జీవితం అనుకునే వయసు దాటినా ఆ గ్రహింపు లేదు. తల్లి చెప్పజూసినా వినిపించుకోలేదు. స్వతహాగా బుద్ధిమంతుడైన కొడుకుని సరైన దారిలో ఎవరు పెడతారా అని ఆ తల్లి బాధపడని రోజు లేదు.
ఇల్లు పట్టని జయశీలుడికి బయట మంచి పేరు వుంది. ఎవరైనా ఆపదలో వున్నారని తెలిస్తే చాలు, వారిని ఆదుకోవడానికి సాయశక్తులా ప్రయత్నిస్తాడు. అలాంటి సందర్భాలలో తను ఆపదలో పడినా లెక్క చేయడు.
ఒకనాడు జయశీలుడు ఇంటిపట్టున వున్న సమయంలో ఒక వైద్యుడు వచ్చి భద్రయ్యని పరీక్షించాడు. చివరికి పెదవి విరిచి "క్షమించమ్మా.. ఇలాంటి రోగిని చూడటం ఇదే ప్రథమం. ఈ వ్యాధి ఏమిటో నాకు అంతుబట్టడం లేదు" అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ వైద్యుడి మాటలకు మీనాక్షి కళ్లు తడి అయ్యాయి. తమకున్న స్థోమతని బట్టి కొంతమంది వైద్యులకు భర్తని చూపించింది. వాళ్ళందరూ ఔషధాలిచ్చారు గానీ అవేవీ పని చెయ్యలేదు. ఇప్పుడీ వైద్యుడు ఇలా చెప్పాడు..............................
వజ్రాల దీవి వింధ్యారణ్యాన్ని అనుకుని వున్న సౌమిత్రి రాజ్యంలో భద్రయ్య అనే ఒక సైనికుడు వుండేవాడు. రాజకోట రక్షణలో నమ్మకంగా పని చేస్తున్న అతన్ని రక్షణాధికారితో పాటు అందరూ గౌరవించేవారు. అలాంటి నిజాయితీపరుడికి ఓ విచిత్రమైన వ్యాధి సోకింది. దాంతో నవనాడులు కృంగిపోయి నాలుగేళ్లుగా మంచాన పడి వున్నాడు. మధ్యవయస్కుడైన భద్రయ్య భార్య మీనాక్షి సౌశీల్యంలో వనితారత్నమే. భర్తని అంటిపెట్టుకుని వుండి సేవలు చేస్తూ వుంది. ఒక వర్తకుడి ఇంట్లో వంటమనిషిగా పనిచేస్తూ కుటుంబ పోషణకు కావలసిన ధనాన్ని సంపాదిస్తున్నది. భర్త ఆరోగ్యంతో తిరుగుతున్న రోజుల్లో ఆమె ఎంత వైభవాన్ని చూసిందో, ఇప్పుడంత కష్టకాలాన్ని అనుభవిస్తున్నది. సుఖదుఃఖాల ప్రవాహంలో సాగిపోతున్న కాలమహిమను ఎవరూ ఊహించలేరు. ఆ దంపతులకు జయశీలుడు అనే ఒక పుత్రుడున్నాడు. నవయవ్వనంతో మిసమిసలాడే జయశీలుడు వీరత్వంలో తండ్రికి తగ్గ తనయుడే. కానీ, చిన్నతనం నుంచి అదుపాజ్ఞలు లేక అల్లరి చిల్లరిగా పెరిగాడు. ఇంటి బాధ్యత పట్టించుకోకుండా స్నేహితులతో తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నాడు. ఆటలాడటమే జీవితం అనుకునే వయసు దాటినా ఆ గ్రహింపు లేదు. తల్లి చెప్పజూసినా వినిపించుకోలేదు. స్వతహాగా బుద్ధిమంతుడైన కొడుకుని సరైన దారిలో ఎవరు పెడతారా అని ఆ తల్లి బాధపడని రోజు లేదు. ఇల్లు పట్టని జయశీలుడికి బయట మంచి పేరు వుంది. ఎవరైనా ఆపదలో వున్నారని తెలిస్తే చాలు, వారిని ఆదుకోవడానికి సాయశక్తులా ప్రయత్నిస్తాడు. అలాంటి సందర్భాలలో తను ఆపదలో పడినా లెక్క చేయడు. ఒకనాడు జయశీలుడు ఇంటిపట్టున వున్న సమయంలో ఒక వైద్యుడు వచ్చి భద్రయ్యని పరీక్షించాడు. చివరికి పెదవి విరిచి "క్షమించమ్మా.. ఇలాంటి రోగిని చూడటం ఇదే ప్రథమం. ఈ వ్యాధి ఏమిటో నాకు అంతుబట్టడం లేదు" అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ వైద్యుడి మాటలకు మీనాక్షి కళ్లు తడి అయ్యాయి. తమకున్న స్థోమతని బట్టి కొంతమంది వైద్యులకు భర్తని చూపించింది. వాళ్ళందరూ ఔషధాలిచ్చారు గానీ అవేవీ పని చెయ్యలేదు. ఇప్పుడీ వైద్యుడు ఇలా చెప్పాడు..............................© 2017,www.logili.com All Rights Reserved.