ఏడుకొండలు - ఎలక్షన్ డ్యూటీ
- రాచపూటి రమేష్ కదుల్తున్న ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంటులోకి తన సూట్ కేసును విసిరి, స్పోర్ట్స్ మేన్లా బోగీలోకి జంప్చేశాడు ఏడుకొండలు. కానీ చూసుకోకుండా విసరడంతో ఆ సూట్కేసు డోర్ దగ్గర యూనిఫామ్ నిల్చునివున్న టీటీఈ కాళ్ళపైపడింది.
టికెట్ ఎగ్జామినరు లబలబలాడుతూ సూట్కేసు తీసి "బుద్ది లేదుటయ్యా, చూసుకొని ఎక్కరాదా! అయినా ఈ ఫస్ట్ క్లాసు పెట్టెలోకి అడ్డమైనవాళ్లు ఎక్కకూడదయ్యా, అసలు నీ దగ్గర టికెట్టుందా?” అన్నాడు.
"అయ్యా, ఈ క్యూరిలీజ్్చసి మరీ నాకు టికెటిచ్చారు మీ రైల్వేవాళ్ళు. ట్రైనుకు టైమయ్యిందని అదరాబాదరా స్టేషనుముందు దిగుతూంటే వాడెవడో పుండాకోరు వెధవ రోడ్డుకడ్డంగా పారుతున్న వాన నీళ్ళపై వేగంగా బైక్లో వెళ్ళిపోయాడు. బట్టలమీదికి బురదంతా చిమ్మింది" ముఖం చిన్నబుచ్చుకుని చెప్పి, బురద వాష్ చేసుకోవడానికి బాత్రూంలోకి దూరిపోయాడు ఏడుకొండలు.
ముఖం కడుక్కుని, టీ షర్టు, లుంగీలోకి మారి, ఫస్ట్ క్లాస్ కూపేలో తనతోబాటు వున్న ప్రయాణికుల వంక చూశాడు ఏడుకొండలు, ఎదురుగా'లారెల్ అండ్ హార్డీ'లా బక్కచిక్కిన పాడుగాటి ముసలాయన, కొబ్బరిబొండాం లాంటి మరో పాట్టి వ్యక్తి కూర్చుని వున్నారు. ఆ పొట్టిబుడంకాయనెక్కడో చూసినట్లనిపించిందతనికి.
హఠాత్తుగా ఆ పొట్టివాడు లేచి నిలబడి "ఒరే, ఏడు కొండలూ, ఇన్నాళ్ళూ ఎక్కడ చచ్చావురా” అని బలంగా ఏడుకొండల్ని వాటేసుకున్నాడు. భల్లూకపు పట్టులాంటి ఆ కౌగిలిలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరౌతూ ఏడుకొండలు, "ఒరే, నాయనా, చూపించిన ప్రేమ చాలు, ముందు నన్నొదులు" అని బలంగా గింజుకోసాగాడు.
ఆ బుడంకాయ ఏడుకొండలును వదలి "నన్నింకా గుర్తుపట్టినట్టులేవురా. మనిద్దరం కలసి పుల్ల ఐస్క్రీంని చెరోపక్క నాక్కుంటూ తిన్నరోజులు అంతీజీగా మర్చిపోయావా ఏందీ" అని బావురుమన్నాడు...................
ఏడుకొండలు - ఎలక్షన్ డ్యూటీ - రాచపూటి రమేష్ కదుల్తున్న ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంటులోకి తన సూట్ కేసును విసిరి, స్పోర్ట్స్ మేన్లా బోగీలోకి జంప్చేశాడు ఏడుకొండలు. కానీ చూసుకోకుండా విసరడంతో ఆ సూట్కేసు డోర్ దగ్గర యూనిఫామ్ నిల్చునివున్న టీటీఈ కాళ్ళపైపడింది. టికెట్ ఎగ్జామినరు లబలబలాడుతూ సూట్కేసు తీసి "బుద్ది లేదుటయ్యా, చూసుకొని ఎక్కరాదా! అయినా ఈ ఫస్ట్ క్లాసు పెట్టెలోకి అడ్డమైనవాళ్లు ఎక్కకూడదయ్యా, అసలు నీ దగ్గర టికెట్టుందా?” అన్నాడు. "అయ్యా, ఈ క్యూరిలీజ్్చసి మరీ నాకు టికెటిచ్చారు మీ రైల్వేవాళ్ళు. ట్రైనుకు టైమయ్యిందని అదరాబాదరా స్టేషనుముందు దిగుతూంటే వాడెవడో పుండాకోరు వెధవ రోడ్డుకడ్డంగా పారుతున్న వాన నీళ్ళపై వేగంగా బైక్లో వెళ్ళిపోయాడు. బట్టలమీదికి బురదంతా చిమ్మింది" ముఖం చిన్నబుచ్చుకుని చెప్పి, బురద వాష్ చేసుకోవడానికి బాత్రూంలోకి దూరిపోయాడు ఏడుకొండలు. ముఖం కడుక్కుని, టీ షర్టు, లుంగీలోకి మారి, ఫస్ట్ క్లాస్ కూపేలో తనతోబాటు వున్న ప్రయాణికుల వంక చూశాడు ఏడుకొండలు, ఎదురుగా'లారెల్ అండ్ హార్డీ'లా బక్కచిక్కిన పాడుగాటి ముసలాయన, కొబ్బరిబొండాం లాంటి మరో పాట్టి వ్యక్తి కూర్చుని వున్నారు. ఆ పొట్టిబుడంకాయనెక్కడో చూసినట్లనిపించిందతనికి. హఠాత్తుగా ఆ పొట్టివాడు లేచి నిలబడి "ఒరే, ఏడు కొండలూ, ఇన్నాళ్ళూ ఎక్కడ చచ్చావురా” అని బలంగా ఏడుకొండల్ని వాటేసుకున్నాడు. భల్లూకపు పట్టులాంటి ఆ కౌగిలిలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరౌతూ ఏడుకొండలు, "ఒరే, నాయనా, చూపించిన ప్రేమ చాలు, ముందు నన్నొదులు" అని బలంగా గింజుకోసాగాడు. ఆ బుడంకాయ ఏడుకొండలును వదలి "నన్నింకా గుర్తుపట్టినట్టులేవురా. మనిద్దరం కలసి పుల్ల ఐస్క్రీంని చెరోపక్క నాక్కుంటూ తిన్నరోజులు అంతీజీగా మర్చిపోయావా ఏందీ" అని బావురుమన్నాడు...................© 2017,www.logili.com All Rights Reserved.