పులిచ్చినామె
- ఎం.గోపాలకృష్ణన్
- మయిలాడుదురై శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలు ఏ.సి. కంపార్టుమెంట్ తలుపు తీసుకుని లోపలికి అడుగు పెట్టగానే పూల వాసన గుప్పుమని నాసికను స్పృశించింది. కదంబం వాసన. పెట్టెను మోసుకుంటూ నడిచొచ్చిన ఆయాసాన్ని దూరం చేశాయి. చల్లని గాలులూ, హాయైన సువాసనా.
"ఎంతటి సువాసన? పూల మార్కెట్లోకి వచ్చినట్టుంది..." శారద భుజమ్మీది సంచిని గట్టిగా పట్టుకుంది. మా ఇద్దరి బెర్త్ నెంబర్లను వెతుక్కుంటూ నడిచాను. మాకు కేటాయించబడిన బెర్త్లను చూడగానే ఉత్సాహం పుట్టుకొచ్చింది. ఎప్పుడో ఒక్కసారే ఇలా కుదురుతాయి. ద్రువపరుచుకోవటానికి మళ్లీ సెల్ఫోన్లో ఉన్న సమాచారాన్ని సరిచూసు కున్నాను. పెట్టెకు మధ్యలో పొడవాటి మేజాతో ఎదురెదురు బెర్తులు రెండూ.
కిటికీ పక్కన శారద కూర్చోగానే పక్కనే కూర్చున్నాను. ముందరున్న మేజా మొత్తం పూలతో నిండిన వెదురు బుట్ట. కదంబం, సంపంగి, మల్లెలు, రోజాలు గుప్పు మన్నాయి. చివరన అరిటాకుతో మూసిన పూలమాలలు. పెట్టెను పైనపెట్టి కూర్చోగానే ఎదుటి బెర్త్లో ఉన్న ఆమె అంది: "తప్పుగా అనుకోకండి. మీకేమీ ఇబ్బంది లేకపోతే ఇవన్నీ ఇలాగే ఉంచెయ్యనా?"
"పర్వాలేదు. పువ్వులేగా?" నవ్వుతూ అన్నాను. ఆమె నవ్వుతూ తలూపింది. శారద చూపులు నన్ను తాకటం గ్రహించాను.
"మాలలన్నీ అమ్మవారికే. భుజాల మాలలు పూర్తయ్యాయి. రెండు వ్రేలాడే మాలలు. తర్వాత సరాలే. మీరు తిరుప్పూర్ కేనా?" నన్ను చూసే ఆమె మాట్లాడుతుంటే శారద ఆమెనే దీక్షగా చూడసాగింది.
వెడల్పైన ఎర్రటి బార్డర్ కలిగిన సంపంగి రంగు చీర. చక్కటి ఒంపు తిరిగిన శరీరం. కచ్చితమైన ముఖవర్చస్సు, మెడలోని బంగారు చైను మెరుస్తుంటే, కిటికీ ప్రసరిస్తున్న ఎదురెండలో ముక్కెర తళుక్కుమంది.
పొడవైన చేతివ్రేళ్లు పూలను తీసుకోవటమూ సరంలో నూలును చుట్టి కట్టటమూ..........
పులిచ్చినామె - ఎం.గోపాలకృష్ణన్ - మయిలాడుదురై శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలు ఏ.సి. కంపార్టుమెంట్ తలుపు తీసుకుని లోపలికి అడుగు పెట్టగానే పూల వాసన గుప్పుమని నాసికను స్పృశించింది. కదంబం వాసన. పెట్టెను మోసుకుంటూ నడిచొచ్చిన ఆయాసాన్ని దూరం చేశాయి. చల్లని గాలులూ, హాయైన సువాసనా. "ఎంతటి సువాసన? పూల మార్కెట్లోకి వచ్చినట్టుంది..." శారద భుజమ్మీది సంచిని గట్టిగా పట్టుకుంది. మా ఇద్దరి బెర్త్ నెంబర్లను వెతుక్కుంటూ నడిచాను. మాకు కేటాయించబడిన బెర్త్లను చూడగానే ఉత్సాహం పుట్టుకొచ్చింది. ఎప్పుడో ఒక్కసారే ఇలా కుదురుతాయి. ద్రువపరుచుకోవటానికి మళ్లీ సెల్ఫోన్లో ఉన్న సమాచారాన్ని సరిచూసు కున్నాను. పెట్టెకు మధ్యలో పొడవాటి మేజాతో ఎదురెదురు బెర్తులు రెండూ. కిటికీ పక్కన శారద కూర్చోగానే పక్కనే కూర్చున్నాను. ముందరున్న మేజా మొత్తం పూలతో నిండిన వెదురు బుట్ట. కదంబం, సంపంగి, మల్లెలు, రోజాలు గుప్పు మన్నాయి. చివరన అరిటాకుతో మూసిన పూలమాలలు. పెట్టెను పైనపెట్టి కూర్చోగానే ఎదుటి బెర్త్లో ఉన్న ఆమె అంది: "తప్పుగా అనుకోకండి. మీకేమీ ఇబ్బంది లేకపోతే ఇవన్నీ ఇలాగే ఉంచెయ్యనా?" "పర్వాలేదు. పువ్వులేగా?" నవ్వుతూ అన్నాను. ఆమె నవ్వుతూ తలూపింది. శారద చూపులు నన్ను తాకటం గ్రహించాను. "మాలలన్నీ అమ్మవారికే. భుజాల మాలలు పూర్తయ్యాయి. రెండు వ్రేలాడే మాలలు. తర్వాత సరాలే. మీరు తిరుప్పూర్ కేనా?" నన్ను చూసే ఆమె మాట్లాడుతుంటే శారద ఆమెనే దీక్షగా చూడసాగింది. వెడల్పైన ఎర్రటి బార్డర్ కలిగిన సంపంగి రంగు చీర. చక్కటి ఒంపు తిరిగిన శరీరం. కచ్చితమైన ముఖవర్చస్సు, మెడలోని బంగారు చైను మెరుస్తుంటే, కిటికీ ప్రసరిస్తున్న ఎదురెండలో ముక్కెర తళుక్కుమంది. పొడవైన చేతివ్రేళ్లు పూలను తీసుకోవటమూ సరంలో నూలును చుట్టి కట్టటమూ..........© 2017,www.logili.com All Rights Reserved.