మొదటి దెబ్బ రత్నం మెడమీద పడింది.
పద్దెనిమిది మెట్లు కలిగి ఎత్తుగా ఉన్న శూలకరుప్పస్వామి గుడి ముందరున్న సిమెంటు నేలమీద, పసుపు రంగు శాలువను పరిచి కూర్చుని నాదస్వరం వాయిస్తున్న రత్నం చప్పున తలపైకెత్తి చూసేసరికి, “రేయ్, ఆపరా. స్వామికి ఎవురు విల్లునివ్వాలన్న ఇసయమే ఇంకా తేల్లేదు. అంతట్లోనే నోట్లో పెట్టి ఊదటం మొదలు పెట్నావ్. రెంటిలో ఒకటి నిర్ణయించకుండా ఇయ్యాల స్వామి ఏటకు బయలుదేరడు సూసుకోండి.” అని అరుస్తున్నాడు చిన్ను.
ఎండ మాడ్చేస్తోంది. గుడికి పక్కనే ఎత్తుగా విస్తరించి ఉంది మర్రిచెట్టు. రథంలాగే తాడులాగా మెలి తిరిగిన ఊడల్ని పట్టుకుని పిల్లలు ఊగుతూ అరుస్తున్నారు. మర్రి ఊడలలో కొన్ని నేలను తాకలేక గాల్లోనే ఊగుతున్నాయి. మర్రి ఆకుల శబ్దం నీరు ప్రవహిస్తున్నట్టు స్పష్టంగా వినిపిస్తోంది. కొమ్మమీదున్న ఒక పక్షి అప్పుడప్పుడూ కూస్తోంది. ఎవరూ దాన్ని పట్టించుకోలేదు.
కొమ్ములకు పూలు చుట్టిన మేకలు నేలను వాసనచూస్తున్నాయి. రాళ్లపొయ్యిలో మండుతున్న మంట పాలుతాగే చిన్ని మేకలా పాత్రను కుమ్మటం, పొయ్యిని వదిలి తలను బయటపెట్టి తొంగిచూస్తున్నట్టుగా ఉంది. బిందె రాట్నానికి ఉన్నట్టుగానే ఒక పసిపిల్ల తన తల్లికోసం చేతిని కదిలించసాగింది. రాట్నం ఎత్తుకు పైకెళ్లేకొద్దీ ఆ పిల్ల భయం పెరుగుతూ పోసాగింది. రాట్నం తలక్రిందుగా తిరగటం మొదలు పెట్టేసరికి ఆ పిల్ల కెవ్వుమని గట్టిగా కేకపెట్టింది.
బెలూన్లు అమ్మేవాళ్లు, గాజుల అంగళ్లు, కాల్చిన మొక్కజొన్నలు అమ్మేవాడు, ప్లాస్టిక్ బంతులు అమ్మేవాళ్లు, టెంకాయలూ, పండ్లూ అంటూ గుడిచుట్టూ అంగళ్లు సందడి. అరుపులకు భయపడ్డ ఒక ముసలి కోతి మర్రిచెట్టును వదిలిపెట్టి కిందికి దిగిరాకుండా కొమ్మమీదనే ముడుచుకుని కూర్చుని, అటు వెళ్లే మనుషుల్ని నిరాశగా చూస్తోంది.
ఆ కోతి చాలాకాలంగా ఆ మర్రిచెట్టులోనే ఉంటోంది. ఎలా ఇక్కడికొచ్చి చేరిందో తెలియటం లేదు. కానీ, కరుప్పస్వామికి సమర్పించే అరటిపండ్లనూ, నేలకు కొట్టే కొబ్బరి చిప్పల్ని ఏరుకుని తింటూ పళ్లు చూపిస్తూ ఆ కోతి తిరుగుతుండేది.................
1. మూదూర్ మొదటి దెబ్బ రత్నం మెడమీద పడింది. పద్దెనిమిది మెట్లు కలిగి ఎత్తుగా ఉన్న శూలకరుప్పస్వామి గుడి ముందరున్న సిమెంటు నేలమీద, పసుపు రంగు శాలువను పరిచి కూర్చుని నాదస్వరం వాయిస్తున్న రత్నం చప్పున తలపైకెత్తి చూసేసరికి, “రేయ్, ఆపరా. స్వామికి ఎవురు విల్లునివ్వాలన్న ఇసయమే ఇంకా తేల్లేదు. అంతట్లోనే నోట్లో పెట్టి ఊదటం మొదలు పెట్నావ్. రెంటిలో ఒకటి నిర్ణయించకుండా ఇయ్యాల స్వామి ఏటకు బయలుదేరడు సూసుకోండి.” అని అరుస్తున్నాడు చిన్ను. ఎండ మాడ్చేస్తోంది. గుడికి పక్కనే ఎత్తుగా విస్తరించి ఉంది మర్రిచెట్టు. రథంలాగే తాడులాగా మెలి తిరిగిన ఊడల్ని పట్టుకుని పిల్లలు ఊగుతూ అరుస్తున్నారు. మర్రి ఊడలలో కొన్ని నేలను తాకలేక గాల్లోనే ఊగుతున్నాయి. మర్రి ఆకుల శబ్దం నీరు ప్రవహిస్తున్నట్టు స్పష్టంగా వినిపిస్తోంది. కొమ్మమీదున్న ఒక పక్షి అప్పుడప్పుడూ కూస్తోంది. ఎవరూ దాన్ని పట్టించుకోలేదు. కొమ్ములకు పూలు చుట్టిన మేకలు నేలను వాసనచూస్తున్నాయి. రాళ్లపొయ్యిలో మండుతున్న మంట పాలుతాగే చిన్ని మేకలా పాత్రను కుమ్మటం, పొయ్యిని వదిలి తలను బయటపెట్టి తొంగిచూస్తున్నట్టుగా ఉంది. బిందె రాట్నానికి ఉన్నట్టుగానే ఒక పసిపిల్ల తన తల్లికోసం చేతిని కదిలించసాగింది. రాట్నం ఎత్తుకు పైకెళ్లేకొద్దీ ఆ పిల్ల భయం పెరుగుతూ పోసాగింది. రాట్నం తలక్రిందుగా తిరగటం మొదలు పెట్టేసరికి ఆ పిల్ల కెవ్వుమని గట్టిగా కేకపెట్టింది. బెలూన్లు అమ్మేవాళ్లు, గాజుల అంగళ్లు, కాల్చిన మొక్కజొన్నలు అమ్మేవాడు, ప్లాస్టిక్ బంతులు అమ్మేవాళ్లు, టెంకాయలూ, పండ్లూ అంటూ గుడిచుట్టూ అంగళ్లు సందడి. అరుపులకు భయపడ్డ ఒక ముసలి కోతి మర్రిచెట్టును వదిలిపెట్టి కిందికి దిగిరాకుండా కొమ్మమీదనే ముడుచుకుని కూర్చుని, అటు వెళ్లే మనుషుల్ని నిరాశగా చూస్తోంది. ఆ కోతి చాలాకాలంగా ఆ మర్రిచెట్టులోనే ఉంటోంది. ఎలా ఇక్కడికొచ్చి చేరిందో తెలియటం లేదు. కానీ, కరుప్పస్వామికి సమర్పించే అరటిపండ్లనూ, నేలకు కొట్టే కొబ్బరి చిప్పల్ని ఏరుకుని తింటూ పళ్లు చూపిస్తూ ఆ కోతి తిరుగుతుండేది.................© 2017,www.logili.com All Rights Reserved.