భగవంతుని ఉనికి
సర్వాంతర్యామి ఉనికి ఒక శక్తివంతమైన సుగంధ పరిమళం..! దేవదేవుడి పట్ల విశ్వాసాన్ని కలిగి ఆయన్ని మదిలో నింపుకున్న రోజున ఆ పరిమళాన్ని మీరు ఆఘ్రాణించగలుగుతారు. సర్వేశ్వరుడి కరుణ అన్ని భయాలను పోగొట్టి సాంత్వన కలిగించే ఒక శీతల పవనం! ఆయన అనుగ్రహాన్ని పొందగలిగిన రోజున సేదతీర్చే ఆ శీతల పవనం మిమ్మల్ని ఆప్యాయంగా స్పర్శించడాన్ని గుర్తించగలుగుతారు.
భగవంతుణ్ణి నమ్ముతూ సదా ఆయన్ని మనసులో నిలుపుకునే భక్తులకు కూడా అప్పుడప్పుడూ కొన్ని సందేహాలు వస్తూంటాయి. దేవదేవుడు నిజంగా ఇంతమంది మానవుల నిత్యకర్మలను ఎలా గమనిస్తున్నాడు? అసలు ఆయన ఎక్కడ వున్నాడు? ఏమి చేస్తున్నాడు? ఇలాంటి సందేహాలు వస్తూంటాయి. వీటిని తీర్చుకోవడానికి ఆధ్యాత్మిక గురువులను ఆశ్రయించడమో లేదా దైవ సంబంధమైన గ్రంథాలను తిరగేయడమో చేస్తూంటారు. మరికొంతమంది ఈరకమైన సందేహాలు మనసులో అప్పుడప్పుడూ కదలాడినా వాటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా భగవంతుడి లీలలను మనం అర్థం చేసుకోలేము అన్న.....................
భగవంతుని ఉనికి సర్వాంతర్యామి ఉనికి ఒక శక్తివంతమైన సుగంధ పరిమళం..! దేవదేవుడి పట్ల విశ్వాసాన్ని కలిగి ఆయన్ని మదిలో నింపుకున్న రోజున ఆ పరిమళాన్ని మీరు ఆఘ్రాణించగలుగుతారు. సర్వేశ్వరుడి కరుణ అన్ని భయాలను పోగొట్టి సాంత్వన కలిగించే ఒక శీతల పవనం! ఆయన అనుగ్రహాన్ని పొందగలిగిన రోజున సేదతీర్చే ఆ శీతల పవనం మిమ్మల్ని ఆప్యాయంగా స్పర్శించడాన్ని గుర్తించగలుగుతారు. భగవంతుణ్ణి నమ్ముతూ సదా ఆయన్ని మనసులో నిలుపుకునే భక్తులకు కూడా అప్పుడప్పుడూ కొన్ని సందేహాలు వస్తూంటాయి. దేవదేవుడు నిజంగా ఇంతమంది మానవుల నిత్యకర్మలను ఎలా గమనిస్తున్నాడు? అసలు ఆయన ఎక్కడ వున్నాడు? ఏమి చేస్తున్నాడు? ఇలాంటి సందేహాలు వస్తూంటాయి. వీటిని తీర్చుకోవడానికి ఆధ్యాత్మిక గురువులను ఆశ్రయించడమో లేదా దైవ సంబంధమైన గ్రంథాలను తిరగేయడమో చేస్తూంటారు. మరికొంతమంది ఈరకమైన సందేహాలు మనసులో అప్పుడప్పుడూ కదలాడినా వాటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా భగవంతుడి లీలలను మనం అర్థం చేసుకోలేము అన్న.....................© 2017,www.logili.com All Rights Reserved.