శ్లోకపఠనం
చిన్నతనం నుంచీ కూడా నాకు భగవంతుడి పట్ల భక్తి భావం ఎక్కువ. అటువంటి గుణం నాకు జన్మతః వచ్చిందని భావిస్తాను. ముఖ్యంగా కృష్ణుడంటే నాకు అపరిమితమైన ఆరాధనా భావం! అది బాల్యం నుంచే నాలో వుందని నాకే తెలియజేసే సంఘటన నా చిన్నతనంలోనే జరిగింది.
1983వ సంవత్సరం. అవి నేను అనకాపల్లి వుడ్ పేట అప్పర్ ప్రైమరీ పాఠశాలలో 7వ తరగతి చదువుకునే రోజులు. ఒకసారి భగవద్గీత శ్లోక పఠన పోటీ పెట్టారు. అది ఇంటర్ స్కూల్ కాంపిటీషన్. అంటే అనకాపల్లిలో వుండే మొత్తం అన్ని పాఠశాలల నుండి విద్యార్థినీవిద్యార్థులు పాల్గొంటారు. ప్రతి పాఠశాల నుండి నలుగురు లేక ఐదుగురు పిల్లలకు అవకాశం ఇస్తారు. ఆ విధంగా అన్ని పాఠశాలలకు ఆహ్వానాలు వచ్చాయి. ఆ ప్రకారం మా స్కూల్లో కూడా ఆసక్తి కలిగినవారు పేర్లు ఇవ్వమని సూచించారు.
నేను కూడా శ్లోక పఠన పోటీకి నా పేరు ఇచ్చాను. అలా పేర్లు ఇచ్చిన అందర్నీ ఒకరోజు సాయంకాలం పాఠశాల సమయం ముగిసిన తర్వాత వుండమన్నారు. వారిని ఒక్కొక్కరుగా ఒక రూమ్ లోకి పిలిచి అక్కడ ఆడిషన్ లాంటిది నిర్వహిస్తున్నారు. వారి దగ్గర సిద్ధంగా వున్న శ్లోకాలను ఇచ్చి చదవమంటున్నారు. కొంచెం రాగయుక్తంగా చెప్పగలిగిన వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు. మిగిలినవాళ్ళని పంపించేస్తున్నారు. అలా నా వంతు కూడా వచ్చింది. నాకు ఇచ్చిన శ్లోకాలని మామూలుగా చదివాను. అయితే రాగయుక్తంగా చదవలేకపోయిన కారణంగా నన్ను ఎంపిక చెయ్యలేదు. నాకు చాలా దుఃఖం కలిగింది. ఆరోజు ఆ కార్యక్రమాన్నంతా నిర్వహిస్తున్నది మా సోషల్ టీచర్ దుర్గాంబ గారు. నన్ను సెలెక్ట్ చెయ్యమని మరొకసారి ఆవిడని అర్ధించాను. అయితే 'లేదు వినోద్.. నువ్వు మామూలుగా చదివినట్టుగా శ్లోకం చెప్తున్నావు. అది చాలదు. ఈ పోటీకి ఎంతోమంది పేర్లు ఇచ్చారు. మేము చివరిగా సెలెక్ట్ చెయ్యాల్సింది కేవలం నలుగురు లేదా ఐదుగురిని మాత్రమే! అవతల ఇంకా చాలామంది వున్నారు. అందువలన నిన్ను ఎంపిక చెయ్యడం కుదరదు' అని చెప్పారు. ఆవిడ ఆ మాట అనగానే నాకు కళ్ళనీళ్ళు ఆగలేదు. ఆ దుఃఖంతోనే ఇంటికి వెళ్ళిపోయాను...............
శ్లోకపఠనం చిన్నతనం నుంచీ కూడా నాకు భగవంతుడి పట్ల భక్తి భావం ఎక్కువ. అటువంటి గుణం నాకు జన్మతః వచ్చిందని భావిస్తాను. ముఖ్యంగా కృష్ణుడంటే నాకు అపరిమితమైన ఆరాధనా భావం! అది బాల్యం నుంచే నాలో వుందని నాకే తెలియజేసే సంఘటన నా చిన్నతనంలోనే జరిగింది. 1983వ సంవత్సరం. అవి నేను అనకాపల్లి వుడ్ పేట అప్పర్ ప్రైమరీ పాఠశాలలో 7వ తరగతి చదువుకునే రోజులు. ఒకసారి భగవద్గీత శ్లోక పఠన పోటీ పెట్టారు. అది ఇంటర్ స్కూల్ కాంపిటీషన్. అంటే అనకాపల్లిలో వుండే మొత్తం అన్ని పాఠశాలల నుండి విద్యార్థినీవిద్యార్థులు పాల్గొంటారు. ప్రతి పాఠశాల నుండి నలుగురు లేక ఐదుగురు పిల్లలకు అవకాశం ఇస్తారు. ఆ విధంగా అన్ని పాఠశాలలకు ఆహ్వానాలు వచ్చాయి. ఆ ప్రకారం మా స్కూల్లో కూడా ఆసక్తి కలిగినవారు పేర్లు ఇవ్వమని సూచించారు. నేను కూడా శ్లోక పఠన పోటీకి నా పేరు ఇచ్చాను. అలా పేర్లు ఇచ్చిన అందర్నీ ఒకరోజు సాయంకాలం పాఠశాల సమయం ముగిసిన తర్వాత వుండమన్నారు. వారిని ఒక్కొక్కరుగా ఒక రూమ్ లోకి పిలిచి అక్కడ ఆడిషన్ లాంటిది నిర్వహిస్తున్నారు. వారి దగ్గర సిద్ధంగా వున్న శ్లోకాలను ఇచ్చి చదవమంటున్నారు. కొంచెం రాగయుక్తంగా చెప్పగలిగిన వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు. మిగిలినవాళ్ళని పంపించేస్తున్నారు. అలా నా వంతు కూడా వచ్చింది. నాకు ఇచ్చిన శ్లోకాలని మామూలుగా చదివాను. అయితే రాగయుక్తంగా చదవలేకపోయిన కారణంగా నన్ను ఎంపిక చెయ్యలేదు. నాకు చాలా దుఃఖం కలిగింది. ఆరోజు ఆ కార్యక్రమాన్నంతా నిర్వహిస్తున్నది మా సోషల్ టీచర్ దుర్గాంబ గారు. నన్ను సెలెక్ట్ చెయ్యమని మరొకసారి ఆవిడని అర్ధించాను. అయితే 'లేదు వినోద్.. నువ్వు మామూలుగా చదివినట్టుగా శ్లోకం చెప్తున్నావు. అది చాలదు. ఈ పోటీకి ఎంతోమంది పేర్లు ఇచ్చారు. మేము చివరిగా సెలెక్ట్ చెయ్యాల్సింది కేవలం నలుగురు లేదా ఐదుగురిని మాత్రమే! అవతల ఇంకా చాలామంది వున్నారు. అందువలన నిన్ను ఎంపిక చెయ్యడం కుదరదు' అని చెప్పారు. ఆవిడ ఆ మాట అనగానే నాకు కళ్ళనీళ్ళు ఆగలేదు. ఆ దుఃఖంతోనే ఇంటికి వెళ్ళిపోయాను...............
© 2017,www.logili.com All Rights Reserved.