పురాణ మునులైన నరనారాయణులకు, సరస్వతీదేవికి, వేదవ్యాస మునీంద్రునికి నమస్కరించి ఇతిహాస పురాణములను చదువవలెను. వామన రూపమున బలిచక్రవర్తిని వంచించి స్వర్లోక, భువర్లోక, భూలోక రాజ్యములను హరించి ఇంద్రునికిచ్చిన శ్రీ మహావిష్ణువునకు నమస్కరింపవలెను. తన ఆశ్రమమునందున్న జ్ఞానవంతులలో శ్రేష్ఠుడు, వాగ్విశారదుడు అయిన పులస్త్య మహామునికి నమస్కరించి నారదమహాముని వామన పురాణమును వినిపింపుడని కోరెను. ఆయన నారదునికి ఇట్లు చెప్పెను. పూర్వము మందర పర్వతముపై పరమ శివుని చూచి పార్వతీదేవి "స్వామీ! వేసవికాలము వచ్చినది. నివాస గృహములేని మనము తీవ్రమైన వడగాల్పులకు, ఎండలకు గాసిల్లవలసినదేనా? అని ప్రశ్నించినది. శంకరుడు ఆమెతో దేవీ! నేను నిరాశ్రయుడను, గిరిశిఖరమే నా నివాసము అని పలికెను. వారు ఆ వేసవిని వృక్ష చ్ఛాయలతో గడిపిరి. పిమ్మట వర్షాకాలము వచ్చినది. ఆకాశమంతయు మేఘములు క్రమ్మి చిమ్మచీకట్లు ఆవరించినవి. కళ్ళు మిరుమిట్లు గొలుపునట్లు మెరుపులు మెరిసినవి. కుండలతో క్రుమ్మరించినట్లు జలధారలు కురిసినవి. చెవులు చెవుడు పడునట్లు ఉరుములు ఉరిమినవి. గుండెలు గుభిల్లుమనునట్లు పిడుగులు పడినవి. నదులు తీవ్రవేగముతో ప్రవహించుచున్నవి. ఇటువంటి వర్ష............
సంపూర్ణశ్రీ వామన మహాపురాణము
శివుడు జీమూతకేతువగుట
పురాణ మునులైన నరనారాయణులకు, సరస్వతీదేవికి, వేదవ్యాస మునీంద్రునికి నమస్కరించి ఇతిహాస పురాణములను చదువవలెను. వామన రూపమున బలిచక్రవర్తిని వంచించి స్వర్లోక, భువర్లోక, భూలోక రాజ్యములను హరించి ఇంద్రునికిచ్చిన శ్రీ మహావిష్ణువునకు నమస్కరింపవలెను.తన ఆశ్రమమునందున్న జ్ఞానవంతులలో శ్రేష్ఠుడు, వాగ్విశారదుడు అయిన పులస్త్య మహామునికి నమస్కరించి నారదమహాముని వామన పురాణమును వినిపింపుడని కోరెను. ఆయన నారదునికి ఇట్లు చెప్పెను.పూర్వము మందర పర్వతముపై పరమ శివుని చూచి పార్వతీదేవి "స్వామీ! వేసవికాలము వచ్చినది. నివాస గృహములేని మనము తీవ్రమైన వడగాల్పులకు, ఎండలకు గాసిల్లవలసినదేనా? అని ప్రశ్నించినది. శంకరుడు ఆమెతో దేవీ! నేను నిరాశ్రయుడను, గిరిశిఖరమే నా నివాసము అని పలికెను. వారు ఆ వేసవిని వృక్ష చ్ఛాయలతో గడిపిరి. పిమ్మట వర్షాకాలము వచ్చినది. ఆకాశమంతయు మేఘములు క్రమ్మి చిమ్మచీకట్లు ఆవరించినవి. కళ్ళు మిరుమిట్లు గొలుపునట్లు మెరుపులు మెరిసినవి. కుండలతో క్రుమ్మరించినట్లు జలధారలు కురిసినవి. చెవులు చెవుడు పడునట్లు ఉరుములు ఉరిమినవి. గుండెలు గుభిల్లుమనునట్లు పిడుగులు పడినవి. నదులు తీవ్రవేగముతో ప్రవహించుచున్నవి. ఇటువంటి వర్ష............