ఉపోద్ఘాతం: కర్మ బంధాల చిక్కుముడులు
ఇలా జరిగింది.
ఒకరోజు శంకరన్ పిళ్ళై ఒక బోటు కొన్నాడు. అదొక పెద్ద నలభై అడుగుల విహార నౌక. కోటి డాలర్లకు కొన్నాడు. అతని భార్య పోర్టోరికా దేశానికి చెందిన మహిళ. ఆ నూతన వధువును ఆయన మహా సాగరం మీద శృంగార విహార యాత్రకు తీసుకువెళ్ళాలనుకొన్నాడు.
యాత్రలో ఉండగా ఓ దుర్ఘటన జరిగింది. విహార నౌక ఒక పెద్ద రాతిని ఢీకొని ముక్కలు ముక్కలైపోయింది.
సరికొత్త విహార నౌక సముద్రంలో మునిగిపోయింది. శంకరన్ పిళ్ళై, అతని భార్య మాత్రం ఎలాగోలా నౌకలో నుంచి బయటపడి ప్రమాదం తప్పించుకున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు చాలా దూరం ఈదుకుంటూ వెళ్ళి, చివరికెలాగో ఒక చిన్న ద్వీపం తీరానికి చేరుకున్నారు. అంతు తెలియని మహా సముద్రంలో చిన్న ఇసుకపర్ర లాగా తేలుతున్నది ఆ చిరుద్వీపం. దాని మీద చెట్టూ చేమాలాంటివేవీ మచ్చుకు కూడా లేవు.
శంకరన్ పిళ్ళై దగ్గిరా, అతని భార్య దగ్గరా కొన్ని డబ్బాలలో కొంత ఆహారం ఉంది. అది రెండు మూడు రోజులకు మించి సరిపోదని వాళ్ళకు తెలుసు. ఏం చేయాలో తోచలేదు.
శంకరన్ పిళ్ళై మాత్రం ఏమీ గాభరా పడలేదు. చక్కగా ఒక యోగాసనం వేసేసుకున్నాడు. అతని ముఖమంతా ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మికత ఆవరించింది. అతని భార్యది కొంచెం ఎక్కువగా కంగారు పడే చంచల స్వభావం.
'మనమిక్కడ చిక్కుకుపోయాం!' అని ఆమె ఏడుపు ఆరంభించింది. 'కనుచూపు మేరలో జనావాసమేదీ కనబడటం లేదు. పశు పక్షులూ, చెట్టు చేమలూ ఏవీ లేవు. మనం ఏమి తిని బతికేట్టు? ఇక్కడ నుంచి ఎలా బయటపడేటట్టు? సుఖమైన వైవాహిక జీవితం గురించి మనం కన్న కలలన్నీ కరిగిపోయాయి! మన జీవితాలు భయంకరంగా అంతమవబోతున్నాయి...............
ఉపోద్ఘాతం: కర్మ బంధాల చిక్కుముడులు ఇలా జరిగింది. ఒకరోజు శంకరన్ పిళ్ళై ఒక బోటు కొన్నాడు. అదొక పెద్ద నలభై అడుగుల విహార నౌక. కోటి డాలర్లకు కొన్నాడు. అతని భార్య పోర్టోరికా దేశానికి చెందిన మహిళ. ఆ నూతన వధువును ఆయన మహా సాగరం మీద శృంగార విహార యాత్రకు తీసుకువెళ్ళాలనుకొన్నాడు. యాత్రలో ఉండగా ఓ దుర్ఘటన జరిగింది. విహార నౌక ఒక పెద్ద రాతిని ఢీకొని ముక్కలు ముక్కలైపోయింది. సరికొత్త విహార నౌక సముద్రంలో మునిగిపోయింది. శంకరన్ పిళ్ళై, అతని భార్య మాత్రం ఎలాగోలా నౌకలో నుంచి బయటపడి ప్రమాదం తప్పించుకున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు చాలా దూరం ఈదుకుంటూ వెళ్ళి, చివరికెలాగో ఒక చిన్న ద్వీపం తీరానికి చేరుకున్నారు. అంతు తెలియని మహా సముద్రంలో చిన్న ఇసుకపర్ర లాగా తేలుతున్నది ఆ చిరుద్వీపం. దాని మీద చెట్టూ చేమాలాంటివేవీ మచ్చుకు కూడా లేవు. శంకరన్ పిళ్ళై దగ్గిరా, అతని భార్య దగ్గరా కొన్ని డబ్బాలలో కొంత ఆహారం ఉంది. అది రెండు మూడు రోజులకు మించి సరిపోదని వాళ్ళకు తెలుసు. ఏం చేయాలో తోచలేదు. శంకరన్ పిళ్ళై మాత్రం ఏమీ గాభరా పడలేదు. చక్కగా ఒక యోగాసనం వేసేసుకున్నాడు. అతని ముఖమంతా ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మికత ఆవరించింది. అతని భార్యది కొంచెం ఎక్కువగా కంగారు పడే చంచల స్వభావం. 'మనమిక్కడ చిక్కుకుపోయాం!' అని ఆమె ఏడుపు ఆరంభించింది. 'కనుచూపు మేరలో జనావాసమేదీ కనబడటం లేదు. పశు పక్షులూ, చెట్టు చేమలూ ఏవీ లేవు. మనం ఏమి తిని బతికేట్టు? ఇక్కడ నుంచి ఎలా బయటపడేటట్టు? సుఖమైన వైవాహిక జీవితం గురించి మనం కన్న కలలన్నీ కరిగిపోయాయి! మన జీవితాలు భయంకరంగా అంతమవబోతున్నాయి...............© 2017,www.logili.com All Rights Reserved.