జనక మహారాజు మహాజ్ఞాని. గొప్ప కర్మిష్ఠి, స్వధర్మాన్ని చక్కగా పరిపాలించిన వాడు. ప్రజలకు ప్రభువుగా రాజధర్మాన్ని చక్కగా అవలంబించినవాడు. యజ్ఞములచేత సమస్త దేవతలను సంప్రీతులను చేయగలిగినవాడు, చేసినవాడు. యజ్ఞక్రతువులద్వారా ఏ ఊర్ధ్వలోకములు ఉన్నాయని శాస్త్రములు చెప్పుతున్నాయో, వాటినన్నిటినీ సంపాదించి పెట్టుకున్నాడు. దేహాంతరము తరువాత, స్వర్గాది లోకద్వారములు ఆయన కొరకు తెరచుకొని ఉన్నాయి. ఊర్ధ్వలోకములను కర్మ ద్వారా సాధించటమేకాక, ఉపాసనద్వారా సాధించటమన్న విషయాన్ని జనక మహారాజు తెలుసుకున్నాడు. ఆ మార్గములన్నీ ఈ ఉపనిషత్తు చెప్పినది. స్వర్గాది లోకములన్నీ కేవలం యజ్ఞాది కర్మలవల్లనే కాక, ఉపాసనా విధానంలో ఎలా సంపాదించుకోవలెనో చెప్పటమన్నది ఈ బృహదారణ్యక ఉపనిషత్తుకు, ఇతర ఉపనిషత్తులకూ ఉన్న ప్రధాన వ్యత్యాసము.
మానవుని శరీరము ఇంద్రియాత్మకము. ఇంద్రియములకన్నింటికీ వాటివాటి అధిష్టాన దేవతలున్నారు. ఈ దేవతలందరూ ఊర్థ్వలోకస్థులు, ఆయాలోకములకు అధిపతులు. భూలోకములో, ఇంద్రియాత్మకమైన శరీరములు కలిగిన మానవుల ఇంద్రియములలో ప్రవేశించి, ఆయాకర్మలను చేస్తూ ఉంటారు. వారి స్వస్థానములు ఊర్ధ్వలోకములు. ఆయాదేవతలను, ఆయా ఇంద్రియముల అధిష్ఠాన దేవతలుగా, ఆయాకార్యములు ఎట్లా నిర్వహిస్తున్నారో తెలుసుకొని, తద్వారా ఆ దేవత ఏ ఊర్ధ్వలోకమునకు చెందినవాడో, దేనికి అధిపతో, అట్లాగే వారి స్వస్థానమును తాను సాధించుకోవటంచేత, ఆ లోకములందుండే ఉత్తమస్థితిని, ఆ జీవుడు ఇక్కడే పొందుతాడని చెప్పటానికి, ఎన్నో విధానములను, ఎంతో చమత్కారంగా, ఈ ఉపనిషత్తు చెప్పింది. ఇతర ఉపనిషత్తులకూ దీనికీ, ఇదే ప్రధానమైన భేదము.
జనక మహారాజునకు ఇదంతా ఒక్కరు చెప్పలేదు. ఒక్కొక్క మహర్షి వచ్చి తాను..............................
మొదటి ప్రసంగము 5.11.1976 జనక మహారాజు మహాజ్ఞాని. గొప్ప కర్మిష్ఠి, స్వధర్మాన్ని చక్కగా పరిపాలించిన వాడు. ప్రజలకు ప్రభువుగా రాజధర్మాన్ని చక్కగా అవలంబించినవాడు. యజ్ఞములచేత సమస్త దేవతలను సంప్రీతులను చేయగలిగినవాడు, చేసినవాడు. యజ్ఞక్రతువులద్వారా ఏ ఊర్ధ్వలోకములు ఉన్నాయని శాస్త్రములు చెప్పుతున్నాయో, వాటినన్నిటినీ సంపాదించి పెట్టుకున్నాడు. దేహాంతరము తరువాత, స్వర్గాది లోకద్వారములు ఆయన కొరకు తెరచుకొని ఉన్నాయి. ఊర్ధ్వలోకములను కర్మ ద్వారా సాధించటమేకాక, ఉపాసనద్వారా సాధించటమన్న విషయాన్ని జనక మహారాజు తెలుసుకున్నాడు. ఆ మార్గములన్నీ ఈ ఉపనిషత్తు చెప్పినది. స్వర్గాది లోకములన్నీ కేవలం యజ్ఞాది కర్మలవల్లనే కాక, ఉపాసనా విధానంలో ఎలా సంపాదించుకోవలెనో చెప్పటమన్నది ఈ బృహదారణ్యక ఉపనిషత్తుకు, ఇతర ఉపనిషత్తులకూ ఉన్న ప్రధాన వ్యత్యాసము. మానవుని శరీరము ఇంద్రియాత్మకము. ఇంద్రియములకన్నింటికీ వాటివాటి అధిష్టాన దేవతలున్నారు. ఈ దేవతలందరూ ఊర్థ్వలోకస్థులు, ఆయాలోకములకు అధిపతులు. భూలోకములో, ఇంద్రియాత్మకమైన శరీరములు కలిగిన మానవుల ఇంద్రియములలో ప్రవేశించి, ఆయాకర్మలను చేస్తూ ఉంటారు. వారి స్వస్థానములు ఊర్ధ్వలోకములు. ఆయాదేవతలను, ఆయా ఇంద్రియముల అధిష్ఠాన దేవతలుగా, ఆయాకార్యములు ఎట్లా నిర్వహిస్తున్నారో తెలుసుకొని, తద్వారా ఆ దేవత ఏ ఊర్ధ్వలోకమునకు చెందినవాడో, దేనికి అధిపతో, అట్లాగే వారి స్వస్థానమును తాను సాధించుకోవటంచేత, ఆ లోకములందుండే ఉత్తమస్థితిని, ఆ జీవుడు ఇక్కడే పొందుతాడని చెప్పటానికి, ఎన్నో విధానములను, ఎంతో చమత్కారంగా, ఈ ఉపనిషత్తు చెప్పింది. ఇతర ఉపనిషత్తులకూ దీనికీ, ఇదే ప్రధానమైన భేదము. జనక మహారాజునకు ఇదంతా ఒక్కరు చెప్పలేదు. ఒక్కొక్క మహర్షి వచ్చి తాను..............................© 2017,www.logili.com All Rights Reserved.