ఇది వరకు కొంత ఉపనిషత్తు విచారము జరిగినది. సాధన ప్రధానముగా, భవిష్యత్తు కార్యక్రమాన్ని నిరూపించుకుని, ధ్యానమునకే ఎక్కువ ప్రాధాన్యము ఇవ్వవలెనని, ఆ ఉపనిషత్తులను గురించిన చర్చ కొంచెమే ఉండవలెననీ నిర్ణయము తీసుకున్నాము. కానీ వీలైనప్పుడల్లా మనము ప్రారంభించిన సాధనకు సంబంధించి నంతవరకు, ఇంకా మిగిలి పోయిన ఉపనిషత్తులు, ఇంతకు ముందు చెప్పుకున్న ఉపనిషత్తులకు సంబంధించినవి, ఉపాసనా విధానాన్ని ప్రతిపాదించేవి, బ్రహ్మ వస్తువు గురించి ప్రధానముగా చెబుతున్నవి. సంప్రదాయకముగా, ప్రముఖమైనవిగా చెప్పబడే వాటి చర్చ యథాశక్తిగా అప్పుడప్పుడు వీలైనంత మట్టుకు, కూలంకషముగా కాకున్నా స్థాలీపులాక న్యాయముగా చెప్పుకోవాలని అనిపించింది.
శంకర భగవత్పాదులు 108 ఉపనిషత్తులు ప్రధానమని చెప్పారు. అందులో 10 చాలా ప్రముఖమైనవి. ఈ పది ఉపనిషత్తులలోనే సమస్త బ్రహ్మవిద్య ఉన్నది. మహర్షులు చెప్పే తపస్సారమని చెప్పబడేది, వారు కనుక్కున్నదంతా, ఈ దశోపనిషత్తులలోనే చెప్పారు. ఇవి చదివితే చాలన్నారు. అవి, ఈశ, కేన, కఠ, ప్రశ్న, మండుక, మాండూక్య, తైత్తిరీయ, బృహదారణ్యక, క్షురిక, ఛాందోగ్యములు. ఇందులో కొన్ని ఇంతకు ముందు మనము చెప్పుకున్నాము. వీటిలో అన్నింటికన్నా పెద్దదై, అన్నింటికీ అగ్రస్థానము వహించిన దానిలో బృహదారణ్యకము మొదటిది, ఛాందోగ్యము రెండవది.
ఛాందోగ్య బ్రాహ్మణము అను పది అధ్యాయములు గల గ్రంథములో నుండి మొదటి రెండు అధ్యాయములు తీసివేసి, తరువాత ఎనిమిది అధ్యాయములను ప్రత్యేకించి ఛాందోగ్యోపనిషత్తుగా చెప్పుతున్నారు. ఇది ఆది బ్రాహ్మణమునకు సంబంధించిన గ్రంథము. చాలా భాష, పాండిత్యము, భాషలలో ఎన్ని బహు ముఖములైన అర్ధములు ప్రతిపాదింప బడుతూ ఉంటాయో ఆ భాషా రహస్యమును తెలుసుకుని, వేద భాషయందు సంస్కృతమును ఉపయోగించినప్పుడు ఏ యే పదములను ఎన్ని ముఖములయిన...................................
మొదటి ప్రసంగము పరిచయ ప్రసంగము - 15-5-1977 ఇది వరకు కొంత ఉపనిషత్తు విచారము జరిగినది. సాధన ప్రధానముగా, భవిష్యత్తు కార్యక్రమాన్ని నిరూపించుకుని, ధ్యానమునకే ఎక్కువ ప్రాధాన్యము ఇవ్వవలెనని, ఆ ఉపనిషత్తులను గురించిన చర్చ కొంచెమే ఉండవలెననీ నిర్ణయము తీసుకున్నాము. కానీ వీలైనప్పుడల్లా మనము ప్రారంభించిన సాధనకు సంబంధించి నంతవరకు, ఇంకా మిగిలి పోయిన ఉపనిషత్తులు, ఇంతకు ముందు చెప్పుకున్న ఉపనిషత్తులకు సంబంధించినవి, ఉపాసనా విధానాన్ని ప్రతిపాదించేవి, బ్రహ్మ వస్తువు గురించి ప్రధానముగా చెబుతున్నవి. సంప్రదాయకముగా, ప్రముఖమైనవిగా చెప్పబడే వాటి చర్చ యథాశక్తిగా అప్పుడప్పుడు వీలైనంత మట్టుకు, కూలంకషముగా కాకున్నా స్థాలీపులాక న్యాయముగా చెప్పుకోవాలని అనిపించింది. శంకర భగవత్పాదులు 108 ఉపనిషత్తులు ప్రధానమని చెప్పారు. అందులో 10 చాలా ప్రముఖమైనవి. ఈ పది ఉపనిషత్తులలోనే సమస్త బ్రహ్మవిద్య ఉన్నది. మహర్షులు చెప్పే తపస్సారమని చెప్పబడేది, వారు కనుక్కున్నదంతా, ఈ దశోపనిషత్తులలోనే చెప్పారు. ఇవి చదివితే చాలన్నారు. అవి, ఈశ, కేన, కఠ, ప్రశ్న, మండుక, మాండూక్య, తైత్తిరీయ, బృహదారణ్యక, క్షురిక, ఛాందోగ్యములు. ఇందులో కొన్ని ఇంతకు ముందు మనము చెప్పుకున్నాము. వీటిలో అన్నింటికన్నా పెద్దదై, అన్నింటికీ అగ్రస్థానము వహించిన దానిలో బృహదారణ్యకము మొదటిది, ఛాందోగ్యము రెండవది. ఛాందోగ్య బ్రాహ్మణము అను పది అధ్యాయములు గల గ్రంథములో నుండి మొదటి రెండు అధ్యాయములు తీసివేసి, తరువాత ఎనిమిది అధ్యాయములను ప్రత్యేకించి ఛాందోగ్యోపనిషత్తుగా చెప్పుతున్నారు. ఇది ఆది బ్రాహ్మణమునకు సంబంధించిన గ్రంథము. చాలా భాష, పాండిత్యము, భాషలలో ఎన్ని బహు ముఖములైన అర్ధములు ప్రతిపాదింప బడుతూ ఉంటాయో ఆ భాషా రహస్యమును తెలుసుకుని, వేద భాషయందు సంస్కృతమును ఉపయోగించినప్పుడు ఏ యే పదములను ఎన్ని ముఖములయిన...................................© 2017,www.logili.com All Rights Reserved.