శంకర్ అనే నేను....
ఎటువంటి భారీ ప్రణాళికలు, ముందస్తు నిర్ణయాలు లేకుండా, జీవన ప్రవాహంతో పాటు పరుగులు తీసి, అనువైనచోట తేరుకుని, అలసట తీర్చుకుని, ఆస్వాదిస్తూ మళ్ళీ ముందుకు సాగటం, ఆపై ఆ మెమరీస్ని నెమరేసుకోవటం ఒక మధురానుభవం.
కమెడియన్ అవ్వాలని సినిమా కంపెనీల మెట్లు ఎక్కిదిగడం మొదలుకొని, గంజాయి వ్యాపారం చేద్దామని ఆంధ్రా బోర్డర్కు వెళ్ళి రావడం వరకు ఎన్నో జ్ఞాపకాల అలలు గుండెల్లో మెదులుతున్నాయి.
ఆ మధ్య ఢిల్లీలో జరిగిన ప్రపంచ సినిమా ప్రదర్శనల్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ నన్ను చుట్టుముట్టారు. అందరి నుండి తలెత్తిన ప్రశ్న ఒక్కటే. 'ఇంతలా ఎలా సక్సస్ అయ్యారు?' అని. అప్పుడు సమయాభావం వలన టూకీగా చెప్పాను. ఇప్పుడు వివరంగా చెబుతాను.
ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని అమెరికాకు వెళ్ళిపోవాలనుకున్న నా కలలు కాస్తా చెదిరిపోయిన క్షణాలవి. పటాసుల వ్యాపారం, చీరల వ్యాపారం, రియల్ ఎస్టేట్ బిజినెస్ అని విసుగు చెందిన రోజులవి. అలా ఎటువైపు వెళుతున్నానో, ఎక్కడ ఆగుతానో తెలియని నేను ఈ ప్రపంచంలో నాదైన స్థానాన్ని ఎలా కనుగొన్నాను అనేది నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. గుర్తున్నంతవరకు చెబుతాను. ఫిలిం స్టూడెంట్స్కు నా జీవిత సంఘటనలు ఉపయోగపడచ్చు. నా జీవితం నుండి వారికి అడగని ప్రశ్నలకు కూడా సమాధానాలు దొరకవచ్చు.
నాకు ఊహ తెలిసి కళతో నా ప్రస్థానం మూడో తరగతి చదివేటప్పుడే మొదలైంది. అది కూడా స్కూలు మారువేషాల పోటీలో....................
శంకర్ అనే నేను.... ఎటువంటి భారీ ప్రణాళికలు, ముందస్తు నిర్ణయాలు లేకుండా, జీవన ప్రవాహంతో పాటు పరుగులు తీసి, అనువైనచోట తేరుకుని, అలసట తీర్చుకుని, ఆస్వాదిస్తూ మళ్ళీ ముందుకు సాగటం, ఆపై ఆ మెమరీస్ని నెమరేసుకోవటం ఒక మధురానుభవం. కమెడియన్ అవ్వాలని సినిమా కంపెనీల మెట్లు ఎక్కిదిగడం మొదలుకొని, గంజాయి వ్యాపారం చేద్దామని ఆంధ్రా బోర్డర్కు వెళ్ళి రావడం వరకు ఎన్నో జ్ఞాపకాల అలలు గుండెల్లో మెదులుతున్నాయి. ఆ మధ్య ఢిల్లీలో జరిగిన ప్రపంచ సినిమా ప్రదర్శనల్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ నన్ను చుట్టుముట్టారు. అందరి నుండి తలెత్తిన ప్రశ్న ఒక్కటే. 'ఇంతలా ఎలా సక్సస్ అయ్యారు?' అని. అప్పుడు సమయాభావం వలన టూకీగా చెప్పాను. ఇప్పుడు వివరంగా చెబుతాను. ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని అమెరికాకు వెళ్ళిపోవాలనుకున్న నా కలలు కాస్తా చెదిరిపోయిన క్షణాలవి. పటాసుల వ్యాపారం, చీరల వ్యాపారం, రియల్ ఎస్టేట్ బిజినెస్ అని విసుగు చెందిన రోజులవి. అలా ఎటువైపు వెళుతున్నానో, ఎక్కడ ఆగుతానో తెలియని నేను ఈ ప్రపంచంలో నాదైన స్థానాన్ని ఎలా కనుగొన్నాను అనేది నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. గుర్తున్నంతవరకు చెబుతాను. ఫిలిం స్టూడెంట్స్కు నా జీవిత సంఘటనలు ఉపయోగపడచ్చు. నా జీవితం నుండి వారికి అడగని ప్రశ్నలకు కూడా సమాధానాలు దొరకవచ్చు. నాకు ఊహ తెలిసి కళతో నా ప్రస్థానం మూడో తరగతి చదివేటప్పుడే మొదలైంది. అది కూడా స్కూలు మారువేషాల పోటీలో....................© 2017,www.logili.com All Rights Reserved.