కథ, కవిత, విమర్శ రంగాలలో పేరొందిన అగ్రశ్రేణి రచయిత పాపినేని శివశంకర్. మార్క్స్ చెప్పిన మానవ శ్రమ పరాయికరణ దగ్గర నుండి ఇవ్వాళ మనిషి సమస్త అస్తిత్వాల్నీ రూపుమాపి దేశాల్ని సైతం మాయం చేస్తున్న ప్రపంచీకరణ వికృత శిశు ప్రసవం దాకా అనేక సామాజికాంశాలు పాపినేని కథలకు వస్తువులు. పాపినేని కథలు చదవటమంటే మన లోపలి పొరల్ని తవ్వి శిధించుకుని ఉదాత్తమైన సంస్కారాన్నీ, ఆచరణాత్మక జ్ఞానాన్నీ పెంపొందించుకోవడమే. అంతేనా జీవితాన్ని క్షాళన చేసుకుని ఆత్మోన్నతని సాధించుకోవడానికీ దోహదపడతాయి పాపినేని కథలు.
కథని తాత్త్విక స్థాయికి తీసుకెళ్ళటానికి ఇష్టంగా భావించే శివశంకర్ కథల్లో జీవన తాత్త్వికతని వ్యాఖ్యానించే బరువైన, సంక్లిష్టమైన అంశాలు సైతం సరళమై పాఠకుల మనస్సులోకి తేటగా సూటిగా చొచ్చుకుపోతాయి. అడుగడుగునా ఆలోచనల్ని ప్రేరేపిస్తాయి. బుర్రకి మంచి పదును పెడతాయి. ఎద లోతుల్లో బలమైన ముద్ర వేయగల్గుతాయి. పదికాలాలు గుర్తుండిపోతాయి.
వస్తు శిల్పాలలో గొప్ప వైవిధ్యంతో కూడిన అపురూపమైన, విశిష్టమైన ఈ కథలు కేవలం రచయితగా పాపినేని హృదయ స్పందనలు కావు. అస్తిత్వపు పెనుగులాటలో ఉక్కిరిబిక్కిరై సమస్త బంధాల నుంచీ బయటపడటానికి సంఘర్షించే వ్యక్తుల, సామూహిక శక్తుల ఆర్తికీ ఆవేదనకీ ప్రతిరూపాలు. పరాయీకరణకి బలైన సామాజిక జీవులు పెడుతున్న కేకలకు ప్రతిధ్వనులు.
కథ, కవిత, విమర్శ రంగాలలో పేరొందిన అగ్రశ్రేణి రచయిత పాపినేని శివశంకర్. మార్క్స్ చెప్పిన మానవ శ్రమ పరాయికరణ దగ్గర నుండి ఇవ్వాళ మనిషి సమస్త అస్తిత్వాల్నీ రూపుమాపి దేశాల్ని సైతం మాయం చేస్తున్న ప్రపంచీకరణ వికృత శిశు ప్రసవం దాకా అనేక సామాజికాంశాలు పాపినేని కథలకు వస్తువులు. పాపినేని కథలు చదవటమంటే మన లోపలి పొరల్ని తవ్వి శిధించుకుని ఉదాత్తమైన సంస్కారాన్నీ, ఆచరణాత్మక జ్ఞానాన్నీ పెంపొందించుకోవడమే. అంతేనా జీవితాన్ని క్షాళన చేసుకుని ఆత్మోన్నతని సాధించుకోవడానికీ దోహదపడతాయి పాపినేని కథలు. కథని తాత్త్విక స్థాయికి తీసుకెళ్ళటానికి ఇష్టంగా భావించే శివశంకర్ కథల్లో జీవన తాత్త్వికతని వ్యాఖ్యానించే బరువైన, సంక్లిష్టమైన అంశాలు సైతం సరళమై పాఠకుల మనస్సులోకి తేటగా సూటిగా చొచ్చుకుపోతాయి. అడుగడుగునా ఆలోచనల్ని ప్రేరేపిస్తాయి. బుర్రకి మంచి పదును పెడతాయి. ఎద లోతుల్లో బలమైన ముద్ర వేయగల్గుతాయి. పదికాలాలు గుర్తుండిపోతాయి. వస్తు శిల్పాలలో గొప్ప వైవిధ్యంతో కూడిన అపురూపమైన, విశిష్టమైన ఈ కథలు కేవలం రచయితగా పాపినేని హృదయ స్పందనలు కావు. అస్తిత్వపు పెనుగులాటలో ఉక్కిరిబిక్కిరై సమస్త బంధాల నుంచీ బయటపడటానికి సంఘర్షించే వ్యక్తుల, సామూహిక శక్తుల ఆర్తికీ ఆవేదనకీ ప్రతిరూపాలు. పరాయీకరణకి బలైన సామాజిక జీవులు పెడుతున్న కేకలకు ప్రతిధ్వనులు.© 2017,www.logili.com All Rights Reserved.