జానేదేవ్!
టెర్రస్ మీద రూఫ్ గార్డెన్ లో అందంగా పూలతో విరబూసిన మొక్కలని, పెద్ద పెద తొట్టెలలో చెట్లనిండా టమాటాలు, వంకాయలతో ఎంతో అందంగా కనబడుతున్న
మొక్కలని చూస్తూ నడుస్తున్నాడేగాని వాసుదేవ్ మనసుకి అవేవీ సంతోషాన్ని ఇవ్వలేదు. అదే ఒకప్పుడైతే అమ్మ ఎంతో కష్టపడి సంతోషంగా రూఫ్ గార్డెన్ పెంచుతున్నందుకు అమ్మ హాబీని అభినందించేవాడు. ఇంటికి కావలసిన కాయగూరలన్నీ చెట్లకు కాస్తున్నాయి. ఇంకా మిగిలితే ఇరుగు, పొరుగువాళ్ళకి ఇస్తుంటుంది. ముఖ్యంగా రామానుజం శాస్త్రిగారికి సంచినిండా కాయగూరలు పెట్టి, కాలేజీకి వెళుతున్నప్పుడు ఇవ్వమంటుంది.
జేబులో సెల్ రింగ్ కావడంతో తీసి చూసిన వాసుదేవ్ కనుబొమలు చిరాగ్గా ముడిపడ్డాయి.
వసూ తనని అర్థం చేసుకోదేం? ప్రతీ మనిషి తను ఏదైతే అనుకుంటాడో అదే జరిగితే ఎంతో సంతోషిస్తాడు, తనంత అదృష్టవంతుడు ఎవరూ ఉండరనుకుంటాడు. కాని జరగకపోతే ప్!...అసలు జరగకపోవడంవలనేకదా మనిషికి ఎన్నో బాధలు...కష్టాలు...
చిన్నప్పటినుంచి వసు తనతో కలిసి చదువుకుంది. తను ఏమిటో...తన నేచర్ ఏమిటో అన్నీ వసూకి తెలుసు. తెలిసి కూడా తనని వేపుకుతింటుంది ఏమిటి?
"ఏంటి దేవ్! నా గురించే ఆలోచిసున్నావా? పిచ్చిదానిని...మళ్ళీ పనిగట్టుకొని అడగడం ఎందుకులే....నా గురించే అని తెలుసు....నీకు మంచి ర్యాంక్ రానందుకు నికన్నా నేనే వర్రీ అవుతానని కూడా నీకు తెలుసు" అని వసుంధర అంటుండగానే చిరాగ్గా అన్నాడు వాసుదేవ్.
“నీ మాటలు వింటుంటే ఇప్పుడొస్తున్న దొంగబాబాలు గుర్తు కొస్తున్నారు".........
జానేదేవ్! టెర్రస్ మీద రూఫ్ గార్డెన్ లో అందంగా పూలతో విరబూసిన మొక్కలని, పెద్ద పెద తొట్టెలలో చెట్లనిండా టమాటాలు, వంకాయలతో ఎంతో అందంగా కనబడుతున్న మొక్కలని చూస్తూ నడుస్తున్నాడేగాని వాసుదేవ్ మనసుకి అవేవీ సంతోషాన్ని ఇవ్వలేదు. అదే ఒకప్పుడైతే అమ్మ ఎంతో కష్టపడి సంతోషంగా రూఫ్ గార్డెన్ పెంచుతున్నందుకు అమ్మ హాబీని అభినందించేవాడు. ఇంటికి కావలసిన కాయగూరలన్నీ చెట్లకు కాస్తున్నాయి. ఇంకా మిగిలితే ఇరుగు, పొరుగువాళ్ళకి ఇస్తుంటుంది. ముఖ్యంగా రామానుజం శాస్త్రిగారికి సంచినిండా కాయగూరలు పెట్టి, కాలేజీకి వెళుతున్నప్పుడు ఇవ్వమంటుంది. జేబులో సెల్ రింగ్ కావడంతో తీసి చూసిన వాసుదేవ్ కనుబొమలు చిరాగ్గా ముడిపడ్డాయి. వసూ తనని అర్థం చేసుకోదేం? ప్రతీ మనిషి తను ఏదైతే అనుకుంటాడో అదే జరిగితే ఎంతో సంతోషిస్తాడు, తనంత అదృష్టవంతుడు ఎవరూ ఉండరనుకుంటాడు. కాని జరగకపోతే ప్!...అసలు జరగకపోవడంవలనేకదా మనిషికి ఎన్నో బాధలు...కష్టాలు... చిన్నప్పటినుంచి వసు తనతో కలిసి చదువుకుంది. తను ఏమిటో...తన నేచర్ ఏమిటో అన్నీ వసూకి తెలుసు. తెలిసి కూడా తనని వేపుకుతింటుంది ఏమిటి? "ఏంటి దేవ్! నా గురించే ఆలోచిసున్నావా? పిచ్చిదానిని...మళ్ళీ పనిగట్టుకొని అడగడం ఎందుకులే....నా గురించే అని తెలుసు....నీకు మంచి ర్యాంక్ రానందుకు నికన్నా నేనే వర్రీ అవుతానని కూడా నీకు తెలుసు" అని వసుంధర అంటుండగానే చిరాగ్గా అన్నాడు వాసుదేవ్. “నీ మాటలు వింటుంటే ఇప్పుడొస్తున్న దొంగబాబాలు గుర్తు కొస్తున్నారు".........© 2017,www.logili.com All Rights Reserved.