మానవుడి నాటి ఆటవిక దశ నుంచి నేటి అత్యాధునిక దశ వరకు రెండు సార్వకాలికమయిన లక్షణాలున్నాయి. అవి ఒకటి 'భయం', రెండు 'ఆశ' ఈ రెండు మానసిక అవస్థల నుంచి మతం పుట్టుకొచ్చింది. ప్రకృతి వైపరీత్యాల తాకిడి నుంచి రక్షించుకోవడానికి(భయం), తాను చేస్తున్న పనిలో విజయానికి (ఆశ) ఆదిమానవుడి మేధ తాపత్రయ పడింది. వైపరీత్యాల కారణాలని పరిశీలించి రక్షణకై శోధించిన మానవ సామర్ధ్యం మతాన్ని రూపొందించింది. అంటే భూమిపై మానవుడి సుఖ జీవనానికి ఉద్దేశించిన అద్భుత సృష్టే మతం. ఆ విధంగా బీజ రూపంలో ఏర్పడిన మత భావనలు హేతువు, ఆధునికత సంతరించుకుంటూ జీవించాయి. ఆధునిక మతంలో చాలా భాగం అతి ప్రాచీనమయినదనీ దానిలో శీలా యుగపు భావ బీజాలు వేళ్ళూని వృద్ధి చెందాయనే మాట ఎంతో సత్యం.
భారతీయ సంస్కృతీ - జీవన విధానాలలో మతం - కులం గాడంగా పెనవేసుకుపోయాయి. మానవునికి శాంతి సుఖాల్ని ప్రసాదించడానికి ఏర్పడిన వ్యవస్థ మతం మరణహోమానికి కారణం అయింది. వేయిపడగల విషసర్పమయిన కులం సామాజిక జీవితాన్ని కలుషితం చేస్తోంది. దీనిని గ్రహించి సమాజం పట్ల ఆర్తితో, మానవుని భవిష్యత్తుపై ఆశతో హనుమంతరావు కులంపై వ్యక్తికరించిన అభిప్రాయాలు అనుబంధంలో చేర్చడం జరిగింది.
- ఆచార్య బి. యస్. యల్. హనుమంతరావు
మానవుడి నాటి ఆటవిక దశ నుంచి నేటి అత్యాధునిక దశ వరకు రెండు సార్వకాలికమయిన లక్షణాలున్నాయి. అవి ఒకటి 'భయం', రెండు 'ఆశ' ఈ రెండు మానసిక అవస్థల నుంచి మతం పుట్టుకొచ్చింది. ప్రకృతి వైపరీత్యాల తాకిడి నుంచి రక్షించుకోవడానికి(భయం), తాను చేస్తున్న పనిలో విజయానికి (ఆశ) ఆదిమానవుడి మేధ తాపత్రయ పడింది. వైపరీత్యాల కారణాలని పరిశీలించి రక్షణకై శోధించిన మానవ సామర్ధ్యం మతాన్ని రూపొందించింది. అంటే భూమిపై మానవుడి సుఖ జీవనానికి ఉద్దేశించిన అద్భుత సృష్టే మతం. ఆ విధంగా బీజ రూపంలో ఏర్పడిన మత భావనలు హేతువు, ఆధునికత సంతరించుకుంటూ జీవించాయి. ఆధునిక మతంలో చాలా భాగం అతి ప్రాచీనమయినదనీ దానిలో శీలా యుగపు భావ బీజాలు వేళ్ళూని వృద్ధి చెందాయనే మాట ఎంతో సత్యం. భారతీయ సంస్కృతీ - జీవన విధానాలలో మతం - కులం గాడంగా పెనవేసుకుపోయాయి. మానవునికి శాంతి సుఖాల్ని ప్రసాదించడానికి ఏర్పడిన వ్యవస్థ మతం మరణహోమానికి కారణం అయింది. వేయిపడగల విషసర్పమయిన కులం సామాజిక జీవితాన్ని కలుషితం చేస్తోంది. దీనిని గ్రహించి సమాజం పట్ల ఆర్తితో, మానవుని భవిష్యత్తుపై ఆశతో హనుమంతరావు కులంపై వ్యక్తికరించిన అభిప్రాయాలు అనుబంధంలో చేర్చడం జరిగింది. - ఆచార్య బి. యస్. యల్. హనుమంతరావు© 2017,www.logili.com All Rights Reserved.