గాంధీజీ దేశాభివృద్ధిపట్ల దూరదృష్టి కల్గిన మహనీయుడు. దేశ అభివృద్ధికి ఆచరణయోగ్యమైన సలహాలు ఎన్నో ఇచ్చాడు. వ్యవసాయం దేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముకలాంటిదని, వ్యవసాయ ఉత్పత్తిరంగానికి అభివృద్ధిప్రక్రియలో ప్రాధాన్యతనివ్వాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తి ప్రక్రియలో వ్యవసాయదారుని నియంత్రణకు లొంగని, ఆకస్మిక సంఘటనలు, ఎన్నో చోటుచేసుకొంటాయి. వర్షపాతకాలం, వర్షపాత వ్యాప్తి, వాతావరణ మార్పు, పంటలకు తెగుళ్ళు ఇలా నియంత్రణకు లొంగని, సంఘటనలను రైతు ఎదుర్కోవాలి. వ్యవసాయదారుడు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయానికి ప్రత్యెక ఆదరణ అవసరమని గాంధీ సలహా.
గాంధీజీ ప్రస్తావించిన సప్తపాపాలు మానవాళికి ఒక హెచ్చరికేగాక, వ్యక్తి వికాసానికి గొప్ప దిక్సూచి. దేశాభివృద్ధికి గాంధీజీ సలహాలను గౌరవించి, ఆచరణలో పెట్టడంలో ప్రభుత్వాలు, ప్రజలు చిత్తశుద్ధితో వ్యవహరించాలి. గ్రామసీమల ప్రగతికీ అన్నదాత శ్రేయస్సుకూ, అసమానతలకు చోటులేని దేశపురోగతి సాధనకు గాంధీజీమార్గమే శరణ్యం.
- కె వెంకటరెడ్డి
గాంధీజీ దేశాభివృద్ధిపట్ల దూరదృష్టి కల్గిన మహనీయుడు. దేశ అభివృద్ధికి ఆచరణయోగ్యమైన సలహాలు ఎన్నో ఇచ్చాడు. వ్యవసాయం దేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముకలాంటిదని, వ్యవసాయ ఉత్పత్తిరంగానికి అభివృద్ధిప్రక్రియలో ప్రాధాన్యతనివ్వాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తి ప్రక్రియలో వ్యవసాయదారుని నియంత్రణకు లొంగని, ఆకస్మిక సంఘటనలు, ఎన్నో చోటుచేసుకొంటాయి. వర్షపాతకాలం, వర్షపాత వ్యాప్తి, వాతావరణ మార్పు, పంటలకు తెగుళ్ళు ఇలా నియంత్రణకు లొంగని, సంఘటనలను రైతు ఎదుర్కోవాలి. వ్యవసాయదారుడు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయానికి ప్రత్యెక ఆదరణ అవసరమని గాంధీ సలహా. గాంధీజీ ప్రస్తావించిన సప్తపాపాలు మానవాళికి ఒక హెచ్చరికేగాక, వ్యక్తి వికాసానికి గొప్ప దిక్సూచి. దేశాభివృద్ధికి గాంధీజీ సలహాలను గౌరవించి, ఆచరణలో పెట్టడంలో ప్రభుత్వాలు, ప్రజలు చిత్తశుద్ధితో వ్యవహరించాలి. గ్రామసీమల ప్రగతికీ అన్నదాత శ్రేయస్సుకూ, అసమానతలకు చోటులేని దేశపురోగతి సాధనకు గాంధీజీమార్గమే శరణ్యం. - కె వెంకటరెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.