Title | Price | |
Ampashayya | Rs.325 | In Stock |
పెద్ద పెద్ద కొండలు, గుహలు, చెట్లు, లోయలు, అంతా పెద్ద అడవి. తను ఇదివరకు ఎప్పుడూ వచ్చినట్టులేదు. ఎట్లా వచ్చాడు తనిక్కడికి? వాటన్నిటి మధ్యపడి నడుస్తున్నాడు. దూరంగా పర్వతాల వరుసలు. శిఖరాలు. ఆ శిఖరాలను ఎక్కాలి. దారి లేదు, డొంకా లేదు. నడుస్తున్నాడు. అసలు నడవటంలేదు. గాలిలో తేలిపోతున్నాడు. పెద్ద పెద్ద గుట్టలు. ఒక గుట్టుమీదికి ఎక్కేశాడు. గుట్టమీది నుండి కిందికి చూశాడు. అమ్మో! యెక్కడో లో పెద్దపెద్ద కొండచిలువలు. అవి కొండచిలువలేనా? వంకర్లు తిరుగుతూ... నోరు తెరుచుకొని... తనని మింగేస్తాయా? అమ్మ బాబోయ్! అసలవి కొండచిలువలు కాదు. నది. అవిగో నీళ్ళు... పారుతున్నాయి. మెలికలు తిరుగుతున్నాయి. ఈ గుట్టమీది నుండి ఆ నదిలో దూకితే.... దూకితే యింకేముంది చచ్చిపోతాను. అరే! ఇదేమిటి ? తను నదిలో పడిపోయాడు. నీళ్ళలో మునిగిపోతున్నాడు. దూకేశానన్నమాట. అంత మీది నుండి దూకినా చచ్చిపోలేదు? బతికే వున్నానన్నమాట. లేదు.... లేదు. చచ్చిపోయాడు. చచ్చిపోయాడు తను చచ్చిపోయాడు. ఎలా? ఎలా? ఎలా? కొట్టుకు పోతున్నాడు. నదిలో కొట్టుకుపోతున్నాడు. నీళ్ళు మింగేస్తున్నాడు. మునిగిపోతున్నాడు. బయటకీడ్చేవాళ్ళు లేరు, గట్టిగా అరుద్దామంటే గొంతు పెగలదు. గొంతు పెగలదు. రక్షించండి. రక్షించండి. అరుస్తున్నాడు. కొట్టుకుపోతూనే వున్నాడు. చచ్చిపోతాడు. చచ్చిపోతాడు. తప్పదు-- తప్పదు -- తప్పదు -- అదిగో యెవరో చేయి అందిస్తున్నారు. ఎవరిది? ఎక్కడో చూశాడు? ఎక్కడో చూశాడు. తనకేసి ప్రేమగా జాలిగా చూసే ఆ చూపులు ఎక్కడో చూశాడు. జ్ఞాపకం రావడం లేదు. ఆ కరుణామూర్తిని ఆ దయామయిని... తనకేసి అలా చూస్తుందేమిటి? అంత జాలిగా, అంత ప్రేమగా. అంత అప్యాయంగా. ఎవరున్నారు తనకేసి అంత ప్రేమగా అంత దయగా చూచేవాళ్ళీ ప్రపంచంలో ఎవరు? ఎవరు? ఎవరు? అమ్మ. ఆమె అమ్మ. అమ్మ నదిలో నీళ్ళలో తనతోపాటే అమ్మ. ఈ సారి తను నదిలో కొట్టుకుపోవడం లేదు. కాని అమ్మ.... నదిమధ్యలో... అమ్మ తనతో మాట్లాడం తనమీద కోపం వచ్చిందా? తనతో మాట్లాడదేం? అలా జాలిగా చూస్తుందేకాని..................
పెద్ద పెద్ద కొండలు, గుహలు, చెట్లు, లోయలు, అంతా పెద్ద అడవి. తను ఇదివరకు ఎప్పుడూ వచ్చినట్టులేదు. ఎట్లా వచ్చాడు తనిక్కడికి? వాటన్నిటి మధ్యపడి నడుస్తున్నాడు. దూరంగా పర్వతాల వరుసలు. శిఖరాలు. ఆ శిఖరాలను ఎక్కాలి. దారి లేదు, డొంకా లేదు. నడుస్తున్నాడు. అసలు నడవటంలేదు. గాలిలో తేలిపోతున్నాడు. పెద్ద పెద్ద గుట్టలు. ఒక గుట్టుమీదికి ఎక్కేశాడు. గుట్టమీది నుండి కిందికి చూశాడు. అమ్మో! యెక్కడో లో పెద్దపెద్ద కొండచిలువలు. అవి కొండచిలువలేనా? వంకర్లు తిరుగుతూ... నోరు తెరుచుకొని... తనని మింగేస్తాయా? అమ్మ బాబోయ్! అసలవి కొండచిలువలు కాదు. నది. అవిగో నీళ్ళు... పారుతున్నాయి. మెలికలు తిరుగుతున్నాయి. ఈ గుట్టమీది నుండి ఆ నదిలో దూకితే.... దూకితే యింకేముంది చచ్చిపోతాను. అరే! ఇదేమిటి ? తను నదిలో పడిపోయాడు. నీళ్ళలో మునిగిపోతున్నాడు. దూకేశానన్నమాట. అంత మీది నుండి దూకినా చచ్చిపోలేదు? బతికే వున్నానన్నమాట. లేదు.... లేదు. చచ్చిపోయాడు. చచ్చిపోయాడు తను చచ్చిపోయాడు. ఎలా? ఎలా? ఎలా? కొట్టుకు పోతున్నాడు. నదిలో కొట్టుకుపోతున్నాడు. నీళ్ళు మింగేస్తున్నాడు. మునిగిపోతున్నాడు. బయటకీడ్చేవాళ్ళు లేరు, గట్టిగా అరుద్దామంటే గొంతు పెగలదు. గొంతు పెగలదు. రక్షించండి. రక్షించండి. అరుస్తున్నాడు. కొట్టుకుపోతూనే వున్నాడు. చచ్చిపోతాడు. చచ్చిపోతాడు. తప్పదు-- తప్పదు -- తప్పదు -- అదిగో యెవరో చేయి అందిస్తున్నారు. ఎవరిది? ఎక్కడో చూశాడు? ఎక్కడో చూశాడు. తనకేసి ప్రేమగా జాలిగా చూసే ఆ చూపులు ఎక్కడో చూశాడు. జ్ఞాపకం రావడం లేదు. ఆ కరుణామూర్తిని ఆ దయామయిని... తనకేసి అలా చూస్తుందేమిటి? అంత జాలిగా, అంత ప్రేమగా. అంత అప్యాయంగా. ఎవరున్నారు తనకేసి అంత ప్రేమగా అంత దయగా చూచేవాళ్ళీ ప్రపంచంలో ఎవరు? ఎవరు? ఎవరు? అమ్మ. ఆమె అమ్మ. అమ్మ నదిలో నీళ్ళలో తనతోపాటే అమ్మ. ఈ సారి తను నదిలో కొట్టుకుపోవడం లేదు. కాని అమ్మ.... నదిమధ్యలో... అమ్మ తనతో మాట్లాడం తనమీద కోపం వచ్చిందా? తనతో మాట్లాడదేం? అలా జాలిగా చూస్తుందేకాని..................© 2017,www.logili.com All Rights Reserved.