నా మాట
నేను చిన్నప్పటినుండే పిల్లల కథలు, రాజుల కథలు చదివేదాన్ని. ప్రతి ఎండాకాలంలో | మా ఊరిలో నేను, మా అక్క పిల్లలు అందరం కలసి చదువుకునే వాళ్ళం. అప్పట్లో ఫోన్స్ లేవు
మా ఊరిలో ఒక టీచర్ ఉండేవారు. వారి ఇంట్లో చిన్న లైబ్రరీ ఉండేది. దానిలో అన్నీ చిన్నపిల్లల కథల పుస్తకాలు మంచిగా బైండ్ చేసి ఉండేవి. అన్నీ రంగు రంగుల బొమ్మలతో మమ్మల్ని ఆకర్షించేవి. రోజూ వెళ్ళి కొన్ని కథల పుస్తకాలు తెచ్చుకుని మరల ఇచ్చేవాళ్ళం. ఒక్కపైసా కూడా తీసుకోకుండా విసుక్కోకుండా మాకు పుస్తకాలు ఇచ్చేవారు. అలాగ కథల పైన ఆసక్తి కలిగింది. మధ్యాహ్నం కథలు చదివి రాత్రి ఇంట్లో అందరం డాబాపైన పడుకునేవాళ్ళం. అన్నయ్య, అక్క పిల్లలకి ఆ కథలు చెప్పేదాన్ని. |
అలా నాకు కథలు చదివే అలవాటు పెరిగింది.
నేను ఇంటర్లో వున్నప్పుడు మాత్రం ఒక నోట్ బుక్ లో ఒకటి, రెండు కథలు రాశాను. కాని ఎవరికీ చూపించేదాన్ని కాదు. మొహమాటం, ఏమనుకుంటారో అని భయం. తరువాత డిగ్రీ, ఆ తరువాత పెళ్లి,
పిల్లలు బాధ్యతలు పెరిగిపోయాయి. మధ్య మధ్య ఏదైనా చూసినపుడు, సంఘటన జరిగినప్పుడు కథలాగ ఊహించుకునేదాన్ని కాని రాసే ప్రయత్నం చేయలేదు. ఆ తరువాత జాబ్స్ తో బిజీ అయ్యి టైం వుండేది కాదు. స్కూల్లో టీచరుగా, లైబ్రేరియన్ గా వర్క్ చేశాను. లైబ్రరీలో కూర్చోని చాలా పుస్తకాలు
చదివాను. ఒకసారి అన్ని కథల పుస్తకాలు చూసేసరికి నా సంతోషానికి అవధులు | - ఉండేది కాదు. అలాగని అన్నీ చదివే టైం వుండేది కాదు. కొన్ని కొన్ని మాత్రమే చదివాను.
అప్పుడే నా జీవితంలో బాధాకరమైన విషయం జరిగింది. మా అమ్మగారు చనిపోయారు. అమ్మ గురించి ఏదైనా రాయాలి అనుకునేదాన్ని,...............
నా మాట నేను చిన్నప్పటినుండే పిల్లల కథలు, రాజుల కథలు చదివేదాన్ని. ప్రతి ఎండాకాలంలో | మా ఊరిలో నేను, మా అక్క పిల్లలు అందరం కలసి చదువుకునే వాళ్ళం. అప్పట్లో ఫోన్స్ లేవు మా ఊరిలో ఒక టీచర్ ఉండేవారు. వారి ఇంట్లో చిన్న లైబ్రరీ ఉండేది. దానిలో అన్నీ చిన్నపిల్లల కథల పుస్తకాలు మంచిగా బైండ్ చేసి ఉండేవి. అన్నీ రంగు రంగుల బొమ్మలతో మమ్మల్ని ఆకర్షించేవి. రోజూ వెళ్ళి కొన్ని కథల పుస్తకాలు తెచ్చుకుని మరల ఇచ్చేవాళ్ళం. ఒక్కపైసా కూడా తీసుకోకుండా విసుక్కోకుండా మాకు పుస్తకాలు ఇచ్చేవారు. అలాగ కథల పైన ఆసక్తి కలిగింది. మధ్యాహ్నం కథలు చదివి రాత్రి ఇంట్లో అందరం డాబాపైన పడుకునేవాళ్ళం. అన్నయ్య, అక్క పిల్లలకి ఆ కథలు చెప్పేదాన్ని. | అలా నాకు కథలు చదివే అలవాటు పెరిగింది. నేను ఇంటర్లో వున్నప్పుడు మాత్రం ఒక నోట్ బుక్ లో ఒకటి, రెండు కథలు రాశాను. కాని ఎవరికీ చూపించేదాన్ని కాదు. మొహమాటం, ఏమనుకుంటారో అని భయం. తరువాత డిగ్రీ, ఆ తరువాత పెళ్లి, పిల్లలు బాధ్యతలు పెరిగిపోయాయి. మధ్య మధ్య ఏదైనా చూసినపుడు, సంఘటన జరిగినప్పుడు కథలాగ ఊహించుకునేదాన్ని కాని రాసే ప్రయత్నం చేయలేదు. ఆ తరువాత జాబ్స్ తో బిజీ అయ్యి టైం వుండేది కాదు. స్కూల్లో టీచరుగా, లైబ్రేరియన్ గా వర్క్ చేశాను. లైబ్రరీలో కూర్చోని చాలా పుస్తకాలు చదివాను. ఒకసారి అన్ని కథల పుస్తకాలు చూసేసరికి నా సంతోషానికి అవధులు | - ఉండేది కాదు. అలాగని అన్నీ చదివే టైం వుండేది కాదు. కొన్ని కొన్ని మాత్రమే చదివాను. అప్పుడే నా జీవితంలో బాధాకరమైన విషయం జరిగింది. మా అమ్మగారు చనిపోయారు. అమ్మ గురించి ఏదైనా రాయాలి అనుకునేదాన్ని,...............© 2017,www.logili.com All Rights Reserved.