చిత్రకళ కేవలం కొందరికి మాత్రమే పరిమితమైన అభిరుచి కాదు. అది మానవ జీవితాన్ని వికసింపజేయడంలో, అభివృద్ధి పరచడంలో విశేషమైన పాత్ర నిర్వహించాడని కొన్ని వ్యాసాల్లో సోదాహరణంగా నిరూపించారు. తద్వారా ఒక తరం నుంచి మరో తరానికి పరివ్యాప్తమయ్యే సృజనాత్మక స్వభావం చిత్రకళాప్రక్రియలోనే దాగి ఉందని బోధపరిచారు. ఇది కొన్నిసార్లు ఉద్యమరూపంగా తలెత్తడంలోనూ మానవజీవనకాంక్షల ప్రతిఫలనం కనిపిస్తుంది. ఈ క్రమాన తెలుగు చిత్రకళారాగంలోని వైశిష్ట్యాన్ని చూపారు. ఆంధ్ర చిత్రకళా వైభవాన్ని చాటారు. చిత్రకళకీ, సాహిత్యానికీ, తెలుగు సమాజానికీ గల అంతర్గత సంబంధాన్ని దర్శింపజేశారు.
ఈ విధంగా ప్రతి వ్యాసంలో ఓ కొత్త కోణాన్ని చూపారు. కనుకనే తెలుగు చిత్రకళని అధ్యయనం చేసేవారికి సిలబస్ గా ఉపకరిస్తాయి వెంకటరమణ రచనలు. అంతేగాక, చిత్రకళ మీద ఆసక్తినీ, అనురక్తినీ ఇనుమడింపజేస్తాయి. అందువల్లనే చిత్రకళా విమర్శకునిగా తన నిరంతర ప్రయాణం ముందుకు సాగాలన్నది ఆకాంక్ష.
చిత్రకళ కేవలం కొందరికి మాత్రమే పరిమితమైన అభిరుచి కాదు. అది మానవ జీవితాన్ని వికసింపజేయడంలో, అభివృద్ధి పరచడంలో విశేషమైన పాత్ర నిర్వహించాడని కొన్ని వ్యాసాల్లో సోదాహరణంగా నిరూపించారు. తద్వారా ఒక తరం నుంచి మరో తరానికి పరివ్యాప్తమయ్యే సృజనాత్మక స్వభావం చిత్రకళాప్రక్రియలోనే దాగి ఉందని బోధపరిచారు. ఇది కొన్నిసార్లు ఉద్యమరూపంగా తలెత్తడంలోనూ మానవజీవనకాంక్షల ప్రతిఫలనం కనిపిస్తుంది. ఈ క్రమాన తెలుగు చిత్రకళారాగంలోని వైశిష్ట్యాన్ని చూపారు. ఆంధ్ర చిత్రకళా వైభవాన్ని చాటారు. చిత్రకళకీ, సాహిత్యానికీ, తెలుగు సమాజానికీ గల అంతర్గత సంబంధాన్ని దర్శింపజేశారు. ఈ విధంగా ప్రతి వ్యాసంలో ఓ కొత్త కోణాన్ని చూపారు. కనుకనే తెలుగు చిత్రకళని అధ్యయనం చేసేవారికి సిలబస్ గా ఉపకరిస్తాయి వెంకటరమణ రచనలు. అంతేగాక, చిత్రకళ మీద ఆసక్తినీ, అనురక్తినీ ఇనుమడింపజేస్తాయి. అందువల్లనే చిత్రకళా విమర్శకునిగా తన నిరంతర ప్రయాణం ముందుకు సాగాలన్నది ఆకాంక్ష.© 2017,www.logili.com All Rights Reserved.