సంపాదకుడిగా ఒక మాట-
జార్జి మరణంతో దిగ్భ్రామకు గురైన విద్యార్థులు వామపక్ష సిద్ధాంతాల పునాదితో కొత్త విద్యార్థి సంఘాల నిర్మాణం చేశారు. ప్రతిభావంతులైన, ఉన్నత చదువులలో వున్న ఎంతో మంది విద్యార్ధులు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఎన్నో సామాజిక, ఆర్థిక సమస్యల మీద నిరసనోద్యమాలతో, ఆందోళనలతో నాటి యువతరానికి దిశా నిర్దేశం చేశారు.
జార్జి అమరుడై నేటికి 40 సంవత్సరాలు. ఈ తరం విద్యార్థులకీ యువతకీ ఆయన విలక్షణ వ్యక్తిత్వాన్ని పరిచయం చేయడమే మా ఉద్దేశం.
1971-72లో ఉస్మానియా సైన్స్ కాలేజీలో చదువుతున్నప్పుడు శ్రీ అశ్వినీ కుమార్ ఆయనతో సన్నిహితంగా మెలిగిన మిత్రులలో ఒకరిగా తన జ్ఞాపకాలను ఇక్కడ పొందుపరిచాడు.
దీన్ని సరళమైన తెలుగులోకి అనువదించిన సుధా కిరణ్కి, చిత్రకారుడు, మోహన్కి, ముద్రించిన అనుపమ ప్రింటర్స్కీ నా ధన్యవాదాలు. ఈ పుస్తకం చదివినవారిలో కొంతమందైనా జార్జి వ్యక్తిత్వానికి, ఆదర్శాలకు ప్రేరేపితులై సమకాలీన సమస్యలపై పోరాడటానికి ఉద్యుక్తులవుతారని ఆశిస్తున్నాం. అదే, మా యీ చిరు ప్రయత్నానికి ఒక పెద్ద బహుమానంగా భావిస్తాం...........
సంపాదకుడిగా ఒక మాట- జార్జి మరణంతో దిగ్భ్రామకు గురైన విద్యార్థులు వామపక్ష సిద్ధాంతాల పునాదితో కొత్త విద్యార్థి సంఘాల నిర్మాణం చేశారు. ప్రతిభావంతులైన, ఉన్నత చదువులలో వున్న ఎంతో మంది విద్యార్ధులు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఎన్నో సామాజిక, ఆర్థిక సమస్యల మీద నిరసనోద్యమాలతో, ఆందోళనలతో నాటి యువతరానికి దిశా నిర్దేశం చేశారు. జార్జి అమరుడై నేటికి 40 సంవత్సరాలు. ఈ తరం విద్యార్థులకీ యువతకీ ఆయన విలక్షణ వ్యక్తిత్వాన్ని పరిచయం చేయడమే మా ఉద్దేశం. 1971-72లో ఉస్మానియా సైన్స్ కాలేజీలో చదువుతున్నప్పుడు శ్రీ అశ్వినీ కుమార్ ఆయనతో సన్నిహితంగా మెలిగిన మిత్రులలో ఒకరిగా తన జ్ఞాపకాలను ఇక్కడ పొందుపరిచాడు. దీన్ని సరళమైన తెలుగులోకి అనువదించిన సుధా కిరణ్కి, చిత్రకారుడు, మోహన్కి, ముద్రించిన అనుపమ ప్రింటర్స్కీ నా ధన్యవాదాలు. ఈ పుస్తకం చదివినవారిలో కొంతమందైనా జార్జి వ్యక్తిత్వానికి, ఆదర్శాలకు ప్రేరేపితులై సమకాలీన సమస్యలపై పోరాడటానికి ఉద్యుక్తులవుతారని ఆశిస్తున్నాం. అదే, మా యీ చిరు ప్రయత్నానికి ఒక పెద్ద బహుమానంగా భావిస్తాం...........© 2017,www.logili.com All Rights Reserved.