చింతచెట్టు కింద నిక్కర్లేసిన పిలకాయలు గుండ్రంగా నిలబడి ఉన్నారు. మధ్యలో ఒక పిల్లవాడు మేకగా తిరుగుతూ ఉంటాడు. బయట ఒక పిల్లవాడు పులిలా ఉంటూ 'మేక ఇక్కడికి వచ్చిందా? మేక ఇక్కడికి వచ్చిందా?' అని అరుస్తూ ఉన్నాడు. 'ఇక్కడ లేదు, ఇక్కడ లేదు' అని ఆ చుట్టూ ఉన్న పిల్లలు అంటూ ఉన్నారు.
వారు ఆడే ఆట 'మేక-పులి' ఆట.
గంటసేపు ఆడినా మేక దొరకలేదు.
' ఆడింది చాల్లే' అని పులి వేషగాడు వెనక్కి తగ్గాడు.
'గెలుపు నాదే' అన్నట్లుగా బయటికి వచ్చిన మేక వేషగాడు జేబులోని మిఠాయి బయటికి తీసి "పొడుపు కథ విప్పితే నీకు మిఠాయి" అన్నాడు.
“అడుక్కో చూద్దాం!" అన్నాడు ఫోజు కొడుతూ పులి వేషగాడు.
"మూడక్షరాల ఆడ పేరు, మధ్యక్షరం తీసేస్తే ప్రాణి పేరు..."
సోక్రటీస్ ఆలోచించిన పులివేషగాడు గట్టిగా 'మేనకలో మేక' అన్నాడు.
"భలే భలే" అని అరుస్తూ మిఠాయి ఇచ్చాడు మేక వేషగాడు..
"మరి మాకు..." అని మిగిలిన పిలకాయలు అడిగారు
చింతచెట్టు కింద నిక్కర్లేసిన పిలకాయలు గుండ్రంగా నిలబడి ఉన్నారు. మధ్యలో ఒక పిల్లవాడు మేకగా తిరుగుతూ ఉంటాడు. బయట ఒక పిల్లవాడు పులిలా ఉంటూ 'మేక ఇక్కడికి వచ్చిందా? మేక ఇక్కడికి వచ్చిందా?' అని అరుస్తూ ఉన్నాడు. 'ఇక్కడ లేదు, ఇక్కడ లేదు' అని ఆ చుట్టూ ఉన్న పిల్లలు అంటూ ఉన్నారు. వారు ఆడే ఆట 'మేక-పులి' ఆట. గంటసేపు ఆడినా మేక దొరకలేదు. ' ఆడింది చాల్లే' అని పులి వేషగాడు వెనక్కి తగ్గాడు. 'గెలుపు నాదే' అన్నట్లుగా బయటికి వచ్చిన మేక వేషగాడు జేబులోని మిఠాయి బయటికి తీసి "పొడుపు కథ విప్పితే నీకు మిఠాయి" అన్నాడు. “అడుక్కో చూద్దాం!" అన్నాడు ఫోజు కొడుతూ పులి వేషగాడు. "మూడక్షరాల ఆడ పేరు, మధ్యక్షరం తీసేస్తే ప్రాణి పేరు..." సోక్రటీస్ ఆలోచించిన పులివేషగాడు గట్టిగా 'మేనకలో మేక' అన్నాడు. "భలే భలే" అని అరుస్తూ మిఠాయి ఇచ్చాడు మేక వేషగాడు.. "మరి మాకు..." అని మిగిలిన పిలకాయలు అడిగారు© 2017,www.logili.com All Rights Reserved.