భారతీయులకు వేదము పరమప్రమాణము. అది అఖిలాభ్యుదయనిశ్రేయస సాదనముగ నవతరించిఅపౌరుషేయ వాజ్మయము. ఋగ్యజుస్సామాథర్వనామకములగు నాలు వేదములలో యజుర్వేదము ధర్మ (కర్మ) స్ప్రతిపాదకమగుటచేప్రశస్తము కాగా, అందలి కర్మ బ్రహ్మోభయాత్మక మయిన రుద్రాధ్యాయము - ప్రశస్తతరమైనది.రుద్రాధ్యాయమునకశతరుద్రీయ'మనునది శాస్త్రీయమైన సంజ్ఞ. 'నమక మనునది - నమశ్శబ్దప్రాచుర్యమును బట్టి లోకప్రసిద్ధమైన నామాన్తరము.
దీనికి - 'శతరుద్రీయం జుహోతి' 'చరమాయామిష్టకాయాం జుహోతి' 'అజ క్షీరేణ జుహోతి' ఇత్యవచనముననుసరించి మహాగ్నిచయనములో శ్రోతవినియోగము కనిపించుచున్నది. ఇంతేకాక, ఆపస్తంబ-బోధాయన శాతాతప-యాజ్ఞవల్క్య అత్రి ప్రభృతులగు మంత్రద్రష్టలైన మహర్షులు-స్మార్తపాకయజ్ఞములలోను, వివిధ శాస్త్రిక-పౌష్టిక ప్రాయశ్చిత్తాది కర్మలలోను జప-హోమ-అర్చన- అభిషేకాజ్ఞముగ ఈ రుద్రాధ్యాయమునకు వినియోగమును చెప్పియున్నారు. ఆ యా విశేషముల నెఱుగగోరువారు, శాస్త్రకమలాకరశాస్త్రరత్నాకర- కర్మవిపాక-మహార్ణవాది గ్రంథములలో జూడవచ్చును.
ఇంతేకాక శిష్టులు కొందరు నిత్యదేవతార్చనములో దీని నుపయోగించుచుండగా, ప్రత్యేకముగనిత్యపారాయణ మొనర్చు నైష్ఠికులు నెందరో యున్నారు. ఇట్లే రుద్రాధ్యాయము ఆంధ్రప్రదేశముననే కాక భారతవర్షములోని అన్ని ప్రాంతములలోను అత్యధికమైన వ్యాప్తి గలిగియున్నది.
ఇది యిట్లుండగా, రుద్రాధ్యాయమును ఉపనిషత్తుగా, ఉపనిషత్సారముగా శివపురాణాదులుపేర్కొనుచున్నవి. వేదవ్యాఖ్యాతలగు భట్టభాస్కరాదులు దీనిని ఉపనిషత్తుగా వ్యవహరించినారు. అభియుక్తవ్యవహారమును బట్టి మాత్పనిషదర ప్రతిపాదకమగుటచే గూడ దీనికి ఉపనిషత్త్వము-అవ్యాహతమను విషయమీ రుద్రభాష్యములో సప్రమాణోపపత్తికముగ ప్రతిపాదింపబడినది. ఉప-ని-ఉపసర్ల పూర్వకమైన, విశరణగతి-అవసానారకమగు షద్ ధాతువునుండి నిష్పన్నమైనది - ఉపనిషచ్ఛబ్దము.
భారతీయులకు వేదము పరమప్రమాణము. అది అఖిలాభ్యుదయనిశ్రేయస సాదనముగ నవతరించిఅపౌరుషేయ వాజ్మయము. ఋగ్యజుస్సామాథర్వనామకములగు నాలు వేదములలో యజుర్వేదము ధర్మ (కర్మ) స్ప్రతిపాదకమగుటచేప్రశస్తము కాగా, అందలి కర్మ బ్రహ్మోభయాత్మక మయిన రుద్రాధ్యాయము - ప్రశస్తతరమైనది.రుద్రాధ్యాయమునకశతరుద్రీయ'మనునది శాస్త్రీయమైన సంజ్ఞ. 'నమక మనునది - నమశ్శబ్దప్రాచుర్యమును బట్టి లోకప్రసిద్ధమైన నామాన్తరము. దీనికి - 'శతరుద్రీయం జుహోతి' 'చరమాయామిష్టకాయాం జుహోతి' 'అజ క్షీరేణ జుహోతి' ఇత్యవచనముననుసరించి మహాగ్నిచయనములో శ్రోతవినియోగము కనిపించుచున్నది. ఇంతేకాక, ఆపస్తంబ-బోధాయన శాతాతప-యాజ్ఞవల్క్య అత్రి ప్రభృతులగు మంత్రద్రష్టలైన మహర్షులు-స్మార్తపాకయజ్ఞములలోను, వివిధ శాస్త్రిక-పౌష్టిక ప్రాయశ్చిత్తాది కర్మలలోను జప-హోమ-అర్చన- అభిషేకాజ్ఞముగ ఈ రుద్రాధ్యాయమునకు వినియోగమును చెప్పియున్నారు. ఆ యా విశేషముల నెఱుగగోరువారు, శాస్త్రకమలాకరశాస్త్రరత్నాకర- కర్మవిపాక-మహార్ణవాది గ్రంథములలో జూడవచ్చును. ఇంతేకాక శిష్టులు కొందరు నిత్యదేవతార్చనములో దీని నుపయోగించుచుండగా, ప్రత్యేకముగనిత్యపారాయణ మొనర్చు నైష్ఠికులు నెందరో యున్నారు. ఇట్లే రుద్రాధ్యాయము ఆంధ్రప్రదేశముననే కాక భారతవర్షములోని అన్ని ప్రాంతములలోను అత్యధికమైన వ్యాప్తి గలిగియున్నది. ఇది యిట్లుండగా, రుద్రాధ్యాయమును ఉపనిషత్తుగా, ఉపనిషత్సారముగా శివపురాణాదులుపేర్కొనుచున్నవి. వేదవ్యాఖ్యాతలగు భట్టభాస్కరాదులు దీనిని ఉపనిషత్తుగా వ్యవహరించినారు. అభియుక్తవ్యవహారమును బట్టి మాత్పనిషదర ప్రతిపాదకమగుటచే గూడ దీనికి ఉపనిషత్త్వము-అవ్యాహతమను విషయమీ రుద్రభాష్యములో సప్రమాణోపపత్తికముగ ప్రతిపాదింపబడినది. ఉప-ని-ఉపసర్ల పూర్వకమైన, విశరణగతి-అవసానారకమగు షద్ ధాతువునుండి నిష్పన్నమైనది - ఉపనిషచ్ఛబ్దము.© 2017,www.logili.com All Rights Reserved.