"మంత్రాలకు చింతకాయలు రాలవు" అంటే ఏమిటో మనందరికీ తెలుసు. ఈ చట్టమూ అటువంటిదే. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల పై ఆకృత్యాల నిరోధానికి రూపొందించబడినట్లుగా చెప్పుకునే ఈ చట్టం ఆచరణలో ఘోరంగా విఫలమయింది. ఎందుకని? సమస్య మూలాలలోకి పోకుండా, ఒక చట్టం చేస్తే సరిపోతుందా? దొంగకే తాళం చేతులు ఇచ్చినట్లుగా, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలపై ఆకృత్యాలకు పాల్పడుతున్నది పాలకవర్గాలే. ఆ పాలక వర్గాలే ఈ చట్టాన్ని రూపొందించాయంటే అర్థం ఏమిటి? అందుకే మంత్రాలకు చింతకాయలు రాలవన్న ఈ సామెతతో ఈ చట్టాన్ని పోల్చటం జరిగింది.
ఈ చట్ట సవరణలో భాగంగా నిబంధనలు మార్చబడ్డాయి. అగ్రవర్గాల దాడులకు గురికాబడ్డ బాధితులకు భారీగా ఆర్ధిక ప్రయోజనాలను సమకూర్చే లక్ష్యంతో ఈ నిబంధనలు రూపొందించబడ్డాయని పాలకులు చెబుతున్నమాట. ఈ కొత్త నిబంధనలు 14-4-2016 నుండి అమలులోకి వచ్చాయి. కాలం గడిస్తే కాని వీటి ప్రభావం అర్థం కాదు.
- పెండ్యాల సత్యనారాయణ
"మంత్రాలకు చింతకాయలు రాలవు" అంటే ఏమిటో మనందరికీ తెలుసు. ఈ చట్టమూ అటువంటిదే. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల పై ఆకృత్యాల నిరోధానికి రూపొందించబడినట్లుగా చెప్పుకునే ఈ చట్టం ఆచరణలో ఘోరంగా విఫలమయింది. ఎందుకని? సమస్య మూలాలలోకి పోకుండా, ఒక చట్టం చేస్తే సరిపోతుందా? దొంగకే తాళం చేతులు ఇచ్చినట్లుగా, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలపై ఆకృత్యాలకు పాల్పడుతున్నది పాలకవర్గాలే. ఆ పాలక వర్గాలే ఈ చట్టాన్ని రూపొందించాయంటే అర్థం ఏమిటి? అందుకే మంత్రాలకు చింతకాయలు రాలవన్న ఈ సామెతతో ఈ చట్టాన్ని పోల్చటం జరిగింది. ఈ చట్ట సవరణలో భాగంగా నిబంధనలు మార్చబడ్డాయి. అగ్రవర్గాల దాడులకు గురికాబడ్డ బాధితులకు భారీగా ఆర్ధిక ప్రయోజనాలను సమకూర్చే లక్ష్యంతో ఈ నిబంధనలు రూపొందించబడ్డాయని పాలకులు చెబుతున్నమాట. ఈ కొత్త నిబంధనలు 14-4-2016 నుండి అమలులోకి వచ్చాయి. కాలం గడిస్తే కాని వీటి ప్రభావం అర్థం కాదు. - పెండ్యాల సత్యనారాయణ
© 2017,www.logili.com All Rights Reserved.