మూడు రోడ్ల కూడలిలో ఆ చింతచెట్టు నిలబడి ఉంది. ముందుగా సిమెంటు రోడ్డు. ఆ రోడ్డు దక్షిణ దిశగా పన్నెండు మైళ్ళు వెళ్ళగానే కుమరి ఓడరేవుతో కలిసి పోతుంది. ఉత్తరపు దిశలో తిరువనంతపురం ఏమిటి, బొంబాయి ఏమిటి, హిమాలయాల దాకా కూడా విస్తరించి ఉంది. దాని తరువాత కూడా కొనసాగుతూ ఉందని చెప్పవచ్చు. మనిషి అడుగుజాడలు పడ్డ ప్రతీ చోటూ దారే కదా!
పశ్చిమ దిశనుంచి చింతచెట్టుకి వెనకవైపుగా వచ్చి, చెట్టు చుట్టూ తిరిగి రెండు శాఖలుగా విడిపోయి సిమెంటు రోడ్డుతో కలిసిపోయే దారి ఎక్కడి నుంచి బయలు దేరిందో ఎవరికి తెలుసు? ఇంకా చెప్పాలంటే అన్నిదార్లు కూడా సముద్రపు తీరంలో పుట్టి, మరో సముద్రపు తీరంలో వెళ్ళి కలుస్తాయి. మధ్యలో ఆరంభం ఏది? అంతం
ఏది ?
చింతచెట్టు కిందికి వచ్చి చేరని దారులే లేవు.
చాలా వయసైపోయిన చెట్టు. ముసలితనం వచ్చేసింది. కాస్త దూరంగా నిలబడి చూస్తూ ఉంటే జుట్టంతా పత్తి పువ్వులాగా తెల్లబడిపోయి, వెన్నెముక వంగిపోయిన గూని ముసలిది. నిష్కామస్థితిలో తనలోనే దాగున్న ఆనందాన్ని వెతికి పట్టుకుని అనుభవిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎన్నో సంవత్సరాల ముందు మొలకెత్తి నిన్నటిదాకా ఆత్మగౌరవంతో బతికిన ఆ చెట్టును ఇంకా కొన్ని రోజులు అలాగే వదిలేసి ఉంటే, దాని ప్రాణం అలాగే పోయి వుండేది. మనిషి తొందరపాటు, గుండెల మీద బాదుకొని వెల్లకిలా పడిపోయే అహం దాన్ని అలాగే వదిలి పెట్టనివ్వలేదు. చెట్టును నాశనం చేసేశారు. ఉన్న ఫళాన మోడుబారి పోయింది ఆ చింతచెట్టు.
చింతచెట్టు బ్రతికిన కథ, నశించి పోయిన కథ ఈనాటికీ మా మనసులో ముద్రించుకు పోయింది. ఎప్పటికీ మాసిపోదు. అలాగే ఉండిపోతుంది. మరిచిపోలేని కొన్ని విషయాలు ఉండనే ఉంటాయి కదా. ఈ చింతచెట్టు కథ కూడా ఆలాంటి విషయాల్లో ఒకటి.............
మూడు రోడ్ల కూడలిలో ఆ చింతచెట్టు నిలబడి ఉంది. ముందుగా సిమెంటు రోడ్డు. ఆ రోడ్డు దక్షిణ దిశగా పన్నెండు మైళ్ళు వెళ్ళగానే కుమరి ఓడరేవుతో కలిసి పోతుంది. ఉత్తరపు దిశలో తిరువనంతపురం ఏమిటి, బొంబాయి ఏమిటి, హిమాలయాల దాకా కూడా విస్తరించి ఉంది. దాని తరువాత కూడా కొనసాగుతూ ఉందని చెప్పవచ్చు. మనిషి అడుగుజాడలు పడ్డ ప్రతీ చోటూ దారే కదా! పశ్చిమ దిశనుంచి చింతచెట్టుకి వెనకవైపుగా వచ్చి, చెట్టు చుట్టూ తిరిగి రెండు శాఖలుగా విడిపోయి సిమెంటు రోడ్డుతో కలిసిపోయే దారి ఎక్కడి నుంచి బయలు దేరిందో ఎవరికి తెలుసు? ఇంకా చెప్పాలంటే అన్నిదార్లు కూడా సముద్రపు తీరంలో పుట్టి, మరో సముద్రపు తీరంలో వెళ్ళి కలుస్తాయి. మధ్యలో ఆరంభం ఏది? అంతం ఏది ? చింతచెట్టు కిందికి వచ్చి చేరని దారులే లేవు. చాలా వయసైపోయిన చెట్టు. ముసలితనం వచ్చేసింది. కాస్త దూరంగా నిలబడి చూస్తూ ఉంటే జుట్టంతా పత్తి పువ్వులాగా తెల్లబడిపోయి, వెన్నెముక వంగిపోయిన గూని ముసలిది. నిష్కామస్థితిలో తనలోనే దాగున్న ఆనందాన్ని వెతికి పట్టుకుని అనుభవిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎన్నో సంవత్సరాల ముందు మొలకెత్తి నిన్నటిదాకా ఆత్మగౌరవంతో బతికిన ఆ చెట్టును ఇంకా కొన్ని రోజులు అలాగే వదిలేసి ఉంటే, దాని ప్రాణం అలాగే పోయి వుండేది. మనిషి తొందరపాటు, గుండెల మీద బాదుకొని వెల్లకిలా పడిపోయే అహం దాన్ని అలాగే వదిలి పెట్టనివ్వలేదు. చెట్టును నాశనం చేసేశారు. ఉన్న ఫళాన మోడుబారి పోయింది ఆ చింతచెట్టు. చింతచెట్టు బ్రతికిన కథ, నశించి పోయిన కథ ఈనాటికీ మా మనసులో ముద్రించుకు పోయింది. ఎప్పటికీ మాసిపోదు. అలాగే ఉండిపోతుంది. మరిచిపోలేని కొన్ని విషయాలు ఉండనే ఉంటాయి కదా. ఈ చింతచెట్టు కథ కూడా ఆలాంటి విషయాల్లో ఒకటి.............© 2017,www.logili.com All Rights Reserved.