తెలంగాణ కథా ప్రపంచం
బి.వి.ఎన్. స్వామి మంచి కథకుడు. వివరం, కథా తెలంగాణ, అందుబాటు, పటువ మొదలగు కథా విమర్శ గ్రంథాలను ప్రచురించాడు. ఆయన Ph.d పరిశోధన కథల మీద జరిగింది. ఉత్తర తెలంగాణ కథా సాహిత్యం-పరిశీలన (1970 నుండి 2000 వరకు) అనే విషయంపై సిద్ధాంత వ్యాసం రాసాడు. బి.వి.ఎన్. స్వామికి కథలు రాయడమన్నా, కథా విమర్శన్నా చాలా ఇష్టమైన పని. ఇప్పుడు మరో కథా విమర్శా పుస్తకాన్ని ప్రచురిస్తున్నాడు. 107 పేజీలతో ఉన్న ఈ పుస్తకంలో తెలంగాణ తెలుగు కథా ప్రపంచాన్ని సంపూర్ణంగా వివేకించి చూపాడు. ఇదిచాలా కష్టమైన పనే. కాని స్వామికి ఇష్టమైన పని. "కాలిబాటలు" అనే ఈ పుస్తకంలో స్వామి, తెలంగాణ కథా సాహిత్యాన్నంతా పరామర్శించి మన ముందుంచాడు. కథ ఆవిర్భావం మొదలుకొని ఇప్పటి ప్రపంచీకరణ వరకు వచ్చిన కథలను పేర్కొనటం, విశ్లేషించడం సామాన్యమైన విషయం కాదు. ఎంతోకృషితో చేసిన సేకరణ, అధ్యయన ఫలితంగానే ఈ పుస్తకం వచ్చింది. తెలంగాణ కథను విస్తృతంగా పరిచయం చేసాడు. ఆయా రచయితలను, కథలను కూలంకషంగా చదవటమే కాక మరో ముప్పై వరకు కథలకు చెందిన పుస్తకాలను చదివి ఈ పుస్తకాన్ని రూపొందించాడు.
మొదటి అధ్యాయం "వికాసం నుండి విస్తృతి.” 1910 నుండి 1990 దశకం వరకు గల కథల చరిత్రను స్థూలంగా ఇందులో చర్చించాడు. ఆరంభంలో వచ్చిన తెలంగాణ కథను కొంత విస్తృతంగా వివరించి ఆ తరువాత అస్తిత్వవాదాల గురించి తెలిపేటపుడు మిగతా కథాసాహిత్యాన్ని విపులంగా విశ్లేషించాడు. 1970లోనే విప్లవకథతో తెలంగాణ కథ ఆరంభమైందన్న వాదనలో సత్యం లేదని, 1910 దశకం నుండే మాడపాటి హన్మంతరావు కథలతో తెలంగాణ కథాసాహిత్యం ఆరంభమైందని వివరించాడు. అంతేకాదు 1898 నుంచే కథలు రాసిన తెలంగాణ ఆడపడుచు..................
తెలంగాణ కథా ప్రపంచం బి.వి.ఎన్. స్వామి మంచి కథకుడు. వివరం, కథా తెలంగాణ, అందుబాటు, పటువ మొదలగు కథా విమర్శ గ్రంథాలను ప్రచురించాడు. ఆయన Ph.d పరిశోధన కథల మీద జరిగింది. ఉత్తర తెలంగాణ కథా సాహిత్యం-పరిశీలన (1970 నుండి 2000 వరకు) అనే విషయంపై సిద్ధాంత వ్యాసం రాసాడు. బి.వి.ఎన్. స్వామికి కథలు రాయడమన్నా, కథా విమర్శన్నా చాలా ఇష్టమైన పని. ఇప్పుడు మరో కథా విమర్శా పుస్తకాన్ని ప్రచురిస్తున్నాడు. 107 పేజీలతో ఉన్న ఈ పుస్తకంలో తెలంగాణ తెలుగు కథా ప్రపంచాన్ని సంపూర్ణంగా వివేకించి చూపాడు. ఇదిచాలా కష్టమైన పనే. కాని స్వామికి ఇష్టమైన పని. "కాలిబాటలు" అనే ఈ పుస్తకంలో స్వామి, తెలంగాణ కథా సాహిత్యాన్నంతా పరామర్శించి మన ముందుంచాడు. కథ ఆవిర్భావం మొదలుకొని ఇప్పటి ప్రపంచీకరణ వరకు వచ్చిన కథలను పేర్కొనటం, విశ్లేషించడం సామాన్యమైన విషయం కాదు. ఎంతోకృషితో చేసిన సేకరణ, అధ్యయన ఫలితంగానే ఈ పుస్తకం వచ్చింది. తెలంగాణ కథను విస్తృతంగా పరిచయం చేసాడు. ఆయా రచయితలను, కథలను కూలంకషంగా చదవటమే కాక మరో ముప్పై వరకు కథలకు చెందిన పుస్తకాలను చదివి ఈ పుస్తకాన్ని రూపొందించాడు. మొదటి అధ్యాయం "వికాసం నుండి విస్తృతి.” 1910 నుండి 1990 దశకం వరకు గల కథల చరిత్రను స్థూలంగా ఇందులో చర్చించాడు. ఆరంభంలో వచ్చిన తెలంగాణ కథను కొంత విస్తృతంగా వివరించి ఆ తరువాత అస్తిత్వవాదాల గురించి తెలిపేటపుడు మిగతా కథాసాహిత్యాన్ని విపులంగా విశ్లేషించాడు. 1970లోనే విప్లవకథతో తెలంగాణ కథ ఆరంభమైందన్న వాదనలో సత్యం లేదని, 1910 దశకం నుండే మాడపాటి హన్మంతరావు కథలతో తెలంగాణ కథాసాహిత్యం ఆరంభమైందని వివరించాడు. అంతేకాదు 1898 నుంచే కథలు రాసిన తెలంగాణ ఆడపడుచు..................© 2017,www.logili.com All Rights Reserved.