నేను కాలాన్ని... భూత, వర్తమాన, భవిష్యత్తులలో ఆగకుండా సాగిపోయే శకటాన్ని
నేను దారాన్ని - జీవ పరిణామానికి ఆధారాన్ని
నేను కాలాన్ని - మనిషి మనుగడకు మూలాన్ని
నా అంచు మీదే మనిషి లేచి నిలబడ్డాడు, అడుగులు వేశాడు, గొంతు విప్పాడు, మాటలు నేర్చాడు, అక్షరాలు కూర్చాడు, అంకెలు పేర్చాడు, లెక్కలు కట్టాడు, అజ్ఞానాన్ని పక్కకు నెట్టాడు.
మనిషి కాలగమనంలో కొట్టుకుపోవడం ఒకప్పటి మాట!
మనిషి కాలాన్ని అధిగమించి నిలబడడం ఇప్పటి మాట!!
ఇది కవితో, కథో కాదు. నాటకమో, వ్యాసమో అంతకన్నా కాదు. సంక్లిష్టమైన మానవ జీవన పరిణామాన్ని అలవోకగా ఒక సృజనాత్మకతలోకి దొర్లించే యత్నం. ఒక రూపకంగా ఆవిష్కరించే ప్రయత్నం. కాలాన్ని, ప్రకృతిని శ్లాఘిస్తూనే వాటిని తన అధీనంలోకి తీసుకున్న మానవుడి సాహసాన్ని, సంఘర్షణను, ఔన్నత్యాన్ని చిత్రించే యత్నం.
ఇది కల్పనే. అయితే దీని మూలం ఊహల్లో తేలి వచ్చింది కాదు. వాస్తవంలో స్థిరంగా , ధృడంగా ఉన్నదే. మానవ జీవన పరిణామ ప్రయోగ పదచిత్రం. ఇది వైజ్ఞానిక సృజన. సృజనాత్మక విజ్ఞానం. అలోచించ గల వారికి - ప్రత్యేకం!
కొన్నిశతాబ్డాలు కాలం వెనుక మనిషి
మరికొన్ని శతాబ్దాలు కాలం వెంట మనిషి
ఇక ముందు.... కాలాన్ని వెనకేసే మనిషి.....
- డా. దేవరాజు మహారాజు
నేను కాలాన్ని... భూత, వర్తమాన, భవిష్యత్తులలో ఆగకుండా సాగిపోయే శకటాన్ని నేను దారాన్ని - జీవ పరిణామానికి ఆధారాన్ని నేను కాలాన్ని - మనిషి మనుగడకు మూలాన్ని నా అంచు మీదే మనిషి లేచి నిలబడ్డాడు, అడుగులు వేశాడు, గొంతు విప్పాడు, మాటలు నేర్చాడు, అక్షరాలు కూర్చాడు, అంకెలు పేర్చాడు, లెక్కలు కట్టాడు, అజ్ఞానాన్ని పక్కకు నెట్టాడు. మనిషి కాలగమనంలో కొట్టుకుపోవడం ఒకప్పటి మాట! మనిషి కాలాన్ని అధిగమించి నిలబడడం ఇప్పటి మాట!! ఇది కవితో, కథో కాదు. నాటకమో, వ్యాసమో అంతకన్నా కాదు. సంక్లిష్టమైన మానవ జీవన పరిణామాన్ని అలవోకగా ఒక సృజనాత్మకతలోకి దొర్లించే యత్నం. ఒక రూపకంగా ఆవిష్కరించే ప్రయత్నం. కాలాన్ని, ప్రకృతిని శ్లాఘిస్తూనే వాటిని తన అధీనంలోకి తీసుకున్న మానవుడి సాహసాన్ని, సంఘర్షణను, ఔన్నత్యాన్ని చిత్రించే యత్నం. ఇది కల్పనే. అయితే దీని మూలం ఊహల్లో తేలి వచ్చింది కాదు. వాస్తవంలో స్థిరంగా , ధృడంగా ఉన్నదే. మానవ జీవన పరిణామ ప్రయోగ పదచిత్రం. ఇది వైజ్ఞానిక సృజన. సృజనాత్మక విజ్ఞానం. అలోచించ గల వారికి - ప్రత్యేకం! కొన్నిశతాబ్డాలు కాలం వెనుక మనిషి మరికొన్ని శతాబ్దాలు కాలం వెంట మనిషి ఇక ముందు.... కాలాన్ని వెనకేసే మనిషి..... - డా. దేవరాజు మహారాజు© 2017,www.logili.com All Rights Reserved.