ఎక్కడ కృష్ణుడు (డాక్టరు), అర్జునుడు (పేషెంటు) ఉంటారో అక్కడ ఆరోగ్య భాగ్యమస్తు!
సంఘంలో ఒక్క డాక్టరుకు మాత్రమే ప్రతి వ్యక్తినీ కలిసే అవకాశం ఉంది. రోగం లేని జీవుడు లేడు. డాక్టర్ అవసరంలేని రోగి లేదు. రోజు గడచినకొద్దీ రోగం ముదురుతుంది. ఖర్చు పెరుగుతుంది. డాక్టరు, పేషెంటు ఇరువురు మధ్య కావలసిన పరస్పర అవగాహనను, నమ్మకాన్ని, విశ్వాసాన్ని డాక్టరు (కృష్ణుడు) హాస్పిటల్ (యుద్ధ రంగం) లో పేషెంట్ (అర్జునుడు) అడుగు పెట్టగానే "గీతా సారం, నవజీవనవేదం" తో ఆహ్వానిస్తాడు. పేషెంట్ (అర్జునుడు) డాక్టరుకు (కృష్ణుడికి) సర్వస్య శరణాగతుడై రోగ లక్షణాలను (శత్రువు) పూర్తిగా వివరిస్తాడు. కృష్ణుడు తొట్రుపాటు లేకుండా అనర్థకంగా అర్జునుడికి గీతాబోధచేస్తాడు (అంటే చేయవలసిన విధులు, విధానాలు, టైము, ఖర్చు, హాస్పిటల్లో చికిత్స పూర్తి అయిన తర్వాత మనసుకు ప్రశాంతత కూర్చేది భగవద్గీత an old-fashioned way. మానవ ప్రయత్నానికి పరమాత్మ సహాయం తప్పక ఉంటుంది. వైద్య వృత్తికి కొద్దిపాటి పెట్టుబడి. వైద్య సిబ్బంది కర్తవ్య పాలనమీద మనసు కేంద్రీకరిస్తారు. వైద్య వృత్తి సేవావృత్తి. సమాజాభివృద్ధిలో డాక్టర్ భాగస్వామ్యానికి విలువ ఎక్కువ. ఈ చిరుకానుక ద్వారా వైద్య సేవాశక్తికి రెక్కలొచ్చి ఒక్కొక్క కుటుంబాన్ని కొంతలో కొంత మారుస్తూ మొత్తం సమాజాన్నే మార్చే అవకాశం ఉంది ఒకనాటికి. కాబట్టి వారే సమాజాన్ని మార్చగలరు.
ధ్యానము, ప్రాణాయామం, యోగా, అభ్యాసము వలన ఉపయోగాలను చక్కగా చెప్పింది "గీతాసారం”. ధృఢ సంకల్పం, కర్తృత్వ భావనలేని కర్తవ్య నిర్వహణ, స్వార్థంలోనే పరమార్ధంగా నేటి దైనందిన జీవితంలో కొందరు ఎలా చేస్తున్నారో ఉదాహరణలున్నాయ్ “గీతాసారం”లో. ఏకాగ్రత, బుద్ధి కుశలత, పట్టుదల, సహనం, సంయమనం, అలవరచుకొని కొంతమంది కోపాన్ని ఎలానియంత్రించుకుంటున్నారో "గీతాసారం"లో ప్రస్తావించడం అయినది. అధ్యాయాలుగా ఉన్న భగవద్గీత జ్ఞానభాండాగారం, మనకు కావలసినది ఎక్కడ ఉందో వెదికి దానిని అర్థం చేసుకొని మనకు అన్వయించుకొని ఆచరించడం సామాన్యులకు అయ్యే పనికాదు. అందువల్లనే "గీతాసారం" వివిధ విషయాలుగా వర్ణించడము అయింది. ఏ విషయం కావాలన్నా ఎవరైనా ఎప్పుడైనా చదువుకొని ఆచరణలో పెట్టడానికి రోజువారీ భాషలో "గీతాసారం" అందిస్తోంది.............
ఎక్కడ కృష్ణుడు (డాక్టరు), అర్జునుడు (పేషెంటు) ఉంటారో అక్కడ ఆరోగ్య భాగ్యమస్తు! సంఘంలో ఒక్క డాక్టరుకు మాత్రమే ప్రతి వ్యక్తినీ కలిసే అవకాశం ఉంది. రోగం లేని జీవుడు లేడు. డాక్టర్ అవసరంలేని రోగి లేదు. రోజు గడచినకొద్దీ రోగం ముదురుతుంది. ఖర్చు పెరుగుతుంది. డాక్టరు, పేషెంటు ఇరువురు మధ్య కావలసిన పరస్పర అవగాహనను, నమ్మకాన్ని, విశ్వాసాన్ని డాక్టరు (కృష్ణుడు) హాస్పిటల్ (యుద్ధ రంగం) లో పేషెంట్ (అర్జునుడు) అడుగు పెట్టగానే "గీతా సారం, నవజీవనవేదం" తో ఆహ్వానిస్తాడు. పేషెంట్ (అర్జునుడు) డాక్టరుకు (కృష్ణుడికి) సర్వస్య శరణాగతుడై రోగ లక్షణాలను (శత్రువు) పూర్తిగా వివరిస్తాడు. కృష్ణుడు తొట్రుపాటు లేకుండా అనర్థకంగా అర్జునుడికి గీతాబోధచేస్తాడు (అంటే చేయవలసిన విధులు, విధానాలు, టైము, ఖర్చు, హాస్పిటల్లో చికిత్స పూర్తి అయిన తర్వాత మనసుకు ప్రశాంతత కూర్చేది భగవద్గీత an old-fashioned way. మానవ ప్రయత్నానికి పరమాత్మ సహాయం తప్పక ఉంటుంది. వైద్య వృత్తికి కొద్దిపాటి పెట్టుబడి. వైద్య సిబ్బంది కర్తవ్య పాలనమీద మనసు కేంద్రీకరిస్తారు. వైద్య వృత్తి సేవావృత్తి. సమాజాభివృద్ధిలో డాక్టర్ భాగస్వామ్యానికి విలువ ఎక్కువ. ఈ చిరుకానుక ద్వారా వైద్య సేవాశక్తికి రెక్కలొచ్చి ఒక్కొక్క కుటుంబాన్ని కొంతలో కొంత మారుస్తూ మొత్తం సమాజాన్నే మార్చే అవకాశం ఉంది ఒకనాటికి. కాబట్టి వారే సమాజాన్ని మార్చగలరు. ధ్యానము, ప్రాణాయామం, యోగా, అభ్యాసము వలన ఉపయోగాలను చక్కగా చెప్పింది "గీతాసారం”. ధృఢ సంకల్పం, కర్తృత్వ భావనలేని కర్తవ్య నిర్వహణ, స్వార్థంలోనే పరమార్ధంగా నేటి దైనందిన జీవితంలో కొందరు ఎలా చేస్తున్నారో ఉదాహరణలున్నాయ్ “గీతాసారం”లో. ఏకాగ్రత, బుద్ధి కుశలత, పట్టుదల, సహనం, సంయమనం, అలవరచుకొని కొంతమంది కోపాన్ని ఎలానియంత్రించుకుంటున్నారో "గీతాసారం"లో ప్రస్తావించడం అయినది. అధ్యాయాలుగా ఉన్న భగవద్గీత జ్ఞానభాండాగారం, మనకు కావలసినది ఎక్కడ ఉందో వెదికి దానిని అర్థం చేసుకొని మనకు అన్వయించుకొని ఆచరించడం సామాన్యులకు అయ్యే పనికాదు. అందువల్లనే "గీతాసారం" వివిధ విషయాలుగా వర్ణించడము అయింది. ఏ విషయం కావాలన్నా ఎవరైనా ఎప్పుడైనా చదువుకొని ఆచరణలో పెట్టడానికి రోజువారీ భాషలో "గీతాసారం" అందిస్తోంది.............© 2017,www.logili.com All Rights Reserved.