* చావంటే ఏమిటి ?
* చనిపోయాక ఏమవుతాం ?
* దానం ఎవరికీ ఎలా చెయ్యాలి?
* కుటుంబ నియంత్రణ పాపమా?
* పర్యావరణాన్నేందుకు పరిరక్షించుకోవాలి?
ఇలాంటి ప్రశ్నలు మీ మెదడులో ఉంటె - వాటికీ జవాబులు యీ పుస్తకంలో ఉన్నాయి.
వేదాలు..... ఉపనిషత్తులు, భగవద్గీత - అనగానే అవి చాలా ప్రత్యేకమైన గ్రంధాలూ మనకర్ధం కావు. పండితులో, ఏ ముసలివాల్లో చదువుకోవలసినవి తప్ప మనకోసం కాదు. అనుకుంటూ వాటి జోలికి వెళ్ళడానికి భయపడే వారెక్కువమందే. దైనందిక జీవితానికేమీ ప్రయోజనముండదని భావించేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. తెలుసుకోకుండా పెంచుకున్న అభిప్రాయమూ, భయము ఇది. తిండి, గుడ్డ, గుడు సమకూరినంత మాత్రాన మనిషికి సంతృప్తి కలగదు. మెదడులో ఎన్నో ప్రశ్నలు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? చనిపోయాక ఏమవుతాం? ఈ జీవితానికి అర్దమేమిటి? ప్రయోజనమేమిటి? - యిలాంటి ప్రశ్నలెన్నో మొదులుతుంటాయి చాలామంది మెదడులో. శరీరానికి విశ్రాంతి లాగే మనసుకి వికాసము అవసరమే. మనలో కలిగే అనేక సందేహాలకు సమాధానాలు చెప్పడమే కాక... ఈ ఆధునిక కాలంలో కూడా మనిషి ఎలా జీవించాలో చెబుతాయి ఉపనిషత్తులు. మనిషిని - కృతజ్ఞుడిగా ఉండమంటాయి. ప్రకృతిని పరిరక్షించి లాభం పొందమంటాయి. గురుశిష్యులు వారిమధ్య సంబంధాలు, విద్యావిధానం ఎలా ఉండాలో మార్గదర్శక సూత్రాలను ఆచరణాత్మకంగా చూపిస్తాయి. ప్రార్ధన వల్ల ఒనగూరే విశిష్ట ప్రయోజనాలను విశదం చేస్తాయి. అందుకే యివి సర్వజనులకు నిస్సందేహంగా పటనీయాలు.
విస్తారమైన గ్రంధాలను చూసి అవి తమకందవనుకునే వారికోసమే ఈ చిన్న పుస్తకంలో ప్రధానమైన ఉపనిషత్తులు పరిచయం చేయడం జరిగింది.
* చావంటే ఏమిటి ? * చనిపోయాక ఏమవుతాం ? * దానం ఎవరికీ ఎలా చెయ్యాలి? * కుటుంబ నియంత్రణ పాపమా? * పర్యావరణాన్నేందుకు పరిరక్షించుకోవాలి? ఇలాంటి ప్రశ్నలు మీ మెదడులో ఉంటె - వాటికీ జవాబులు యీ పుస్తకంలో ఉన్నాయి. వేదాలు..... ఉపనిషత్తులు, భగవద్గీత - అనగానే అవి చాలా ప్రత్యేకమైన గ్రంధాలూ మనకర్ధం కావు. పండితులో, ఏ ముసలివాల్లో చదువుకోవలసినవి తప్ప మనకోసం కాదు. అనుకుంటూ వాటి జోలికి వెళ్ళడానికి భయపడే వారెక్కువమందే. దైనందిక జీవితానికేమీ ప్రయోజనముండదని భావించేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. తెలుసుకోకుండా పెంచుకున్న అభిప్రాయమూ, భయము ఇది. తిండి, గుడ్డ, గుడు సమకూరినంత మాత్రాన మనిషికి సంతృప్తి కలగదు. మెదడులో ఎన్నో ప్రశ్నలు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? చనిపోయాక ఏమవుతాం? ఈ జీవితానికి అర్దమేమిటి? ప్రయోజనమేమిటి? - యిలాంటి ప్రశ్నలెన్నో మొదులుతుంటాయి చాలామంది మెదడులో. శరీరానికి విశ్రాంతి లాగే మనసుకి వికాసము అవసరమే. మనలో కలిగే అనేక సందేహాలకు సమాధానాలు చెప్పడమే కాక... ఈ ఆధునిక కాలంలో కూడా మనిషి ఎలా జీవించాలో చెబుతాయి ఉపనిషత్తులు. మనిషిని - కృతజ్ఞుడిగా ఉండమంటాయి. ప్రకృతిని పరిరక్షించి లాభం పొందమంటాయి. గురుశిష్యులు వారిమధ్య సంబంధాలు, విద్యావిధానం ఎలా ఉండాలో మార్గదర్శక సూత్రాలను ఆచరణాత్మకంగా చూపిస్తాయి. ప్రార్ధన వల్ల ఒనగూరే విశిష్ట ప్రయోజనాలను విశదం చేస్తాయి. అందుకే యివి సర్వజనులకు నిస్సందేహంగా పటనీయాలు. విస్తారమైన గ్రంధాలను చూసి అవి తమకందవనుకునే వారికోసమే ఈ చిన్న పుస్తకంలో ప్రధానమైన ఉపనిషత్తులు పరిచయం చేయడం జరిగింది.© 2017,www.logili.com All Rights Reserved.