ఆశించిన దానికన్నా ముందే కోరుకున్నవన్నీ పొందండి
కొందరు వ్యక్తులు తమ లక్ష్యాలన్నిటిని సాధించుకుంటుంటే, మరికొందరు మెరుగైన జీవితంకోసం కేవలం కలలు కంటూ వుండిపోతారెందుకు? బెస్ట్ సెల్లింగ్ రచయిత బ్రాయన్ ట్రేసీ మీ స్వప్నాలకు సాకారం చేసుకునేటందుకు దారిచూపిస్తాడు. కొన్ని లక్షలమంది ఈ మార్గాన్ని అనుసరిస్తూ పోయి అఖండ విజయాన్ని అందుకున్నారు. ఈ పుస్తకంలో బ్రాయన్ ట్రేసీ మీ కలలను సాకారం చేసుకునేటందుకు ఆవశ్యకం అయిన సిద్ధాంతాలను చెప్పాడు.
* లక్ష్యాలను ఏర్పరుచుకోవటం ఎలా? వాటిని సాధించటం ఎలా? దీనికోసం బ్రాయన్ ట్రేసీ సరళమైన, శక్తివంతమైన, లభాకారి అయిన పద్ధతులను చెప్తాడు. వీటిని ఉపయోగించి పదిలక్షలకు పైగా జనం అసాధారణ ఫలితాలను సాధించారు.
* ట్రేసీ చెప్పిన 21 సిద్ధాంతాలను అనుసరించి మీరు మీ లక్ష్యాలను - అవి ఎంత గొప్పవి అయినప్పటికీ - సాధించుకొగలుగుతారు. అంతేకాక, మీలోని వ్యక్తిగతమైన శక్తులని ఎలా గుర్తించాలో కూడా నేర్చుకుంటారు, మీ జీవితంలో అన్నిటికన్నా విలువైనది ఏమిటి, భవిష్యత్తులో సాధించదల్చుకున్న లక్ష్యాలు ఏవి అనేదానిమీద దృష్టిపెట్టగలుగుతారు. మీ ఆత్మవిశ్వాసానికి ఎలా పెంచుకోవాలి, ఎదుర్కొనే ప్రతి సమస్యనీ, అడ్డంకీనీ ఎలా పరిష్కరించాలి, కష్టాలని ఎలా అధిగమించాలి, సవాళ్ళకీ ఎటువంటి ప్రతిక్రియని ప్రదర్శించాలి, ఏది ఏమైనా ప్రతి లక్ష్యాన్నీ ఎలా సాధించుకోవాలి, అనేదాన్ని ట్రేసీ చూపిస్తాడు. అన్నిటికన్నా ముఖ్యంగా, నిరూపించబడిన ఒక విజయ వ్యవస్థని నేర్చుకుని, దాన్ని మీరు ఇక జీవితాంతం ఉపయోగించుకొగలుగుతారు.
బ్రాయన్ ట్రేసీ ప్రపంచంలోని అగ్రగామి మేనేజ్ మెంట్ కన్సల్టెంట్లు, శిక్షకులు, వక్తలలో ఒకడు. ఈ పుస్తకంలో చెప్పబడిన పద్ధతులనే వుపయోగించి ఆయన శూన్యం నుంచి శిఖరాగ్రం చేరుకున్నాడు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఆయన 2,50,000మందికి పైగా వున్న జనాన్ని సంబోధిస్తుంటాడు. సలహాదారు, శిక్షకుడిగా ఐబిఎమ్, ఫోర్ట్స్, జెరాక్స్, ఎచ్పీ లాంటి 1000 పైచిలుకు కార్పోరేషన్లలో ట్రేసీ పనిచేశాడు. ఆయన యింతవరకు 35 పుస్తకాలు రాశాడు, 300కు పైగా ఆడియో, వీడియో శిక్షణ కార్యక్రమాలు తయారుచేశాడు.
ఆశించిన దానికన్నా ముందే కోరుకున్నవన్నీ పొందండి కొందరు వ్యక్తులు తమ లక్ష్యాలన్నిటిని సాధించుకుంటుంటే, మరికొందరు మెరుగైన జీవితంకోసం కేవలం కలలు కంటూ వుండిపోతారెందుకు? బెస్ట్ సెల్లింగ్ రచయిత బ్రాయన్ ట్రేసీ మీ స్వప్నాలకు సాకారం చేసుకునేటందుకు దారిచూపిస్తాడు. కొన్ని లక్షలమంది ఈ మార్గాన్ని అనుసరిస్తూ పోయి అఖండ విజయాన్ని అందుకున్నారు. ఈ పుస్తకంలో బ్రాయన్ ట్రేసీ మీ కలలను సాకారం చేసుకునేటందుకు ఆవశ్యకం అయిన సిద్ధాంతాలను చెప్పాడు. * లక్ష్యాలను ఏర్పరుచుకోవటం ఎలా? వాటిని సాధించటం ఎలా? దీనికోసం బ్రాయన్ ట్రేసీ సరళమైన, శక్తివంతమైన, లభాకారి అయిన పద్ధతులను చెప్తాడు. వీటిని ఉపయోగించి పదిలక్షలకు పైగా జనం అసాధారణ ఫలితాలను సాధించారు. * ట్రేసీ చెప్పిన 21 సిద్ధాంతాలను అనుసరించి మీరు మీ లక్ష్యాలను - అవి ఎంత గొప్పవి అయినప్పటికీ - సాధించుకొగలుగుతారు. అంతేకాక, మీలోని వ్యక్తిగతమైన శక్తులని ఎలా గుర్తించాలో కూడా నేర్చుకుంటారు, మీ జీవితంలో అన్నిటికన్నా విలువైనది ఏమిటి, భవిష్యత్తులో సాధించదల్చుకున్న లక్ష్యాలు ఏవి అనేదానిమీద దృష్టిపెట్టగలుగుతారు. మీ ఆత్మవిశ్వాసానికి ఎలా పెంచుకోవాలి, ఎదుర్కొనే ప్రతి సమస్యనీ, అడ్డంకీనీ ఎలా పరిష్కరించాలి, కష్టాలని ఎలా అధిగమించాలి, సవాళ్ళకీ ఎటువంటి ప్రతిక్రియని ప్రదర్శించాలి, ఏది ఏమైనా ప్రతి లక్ష్యాన్నీ ఎలా సాధించుకోవాలి, అనేదాన్ని ట్రేసీ చూపిస్తాడు. అన్నిటికన్నా ముఖ్యంగా, నిరూపించబడిన ఒక విజయ వ్యవస్థని నేర్చుకుని, దాన్ని మీరు ఇక జీవితాంతం ఉపయోగించుకొగలుగుతారు. బ్రాయన్ ట్రేసీ ప్రపంచంలోని అగ్రగామి మేనేజ్ మెంట్ కన్సల్టెంట్లు, శిక్షకులు, వక్తలలో ఒకడు. ఈ పుస్తకంలో చెప్పబడిన పద్ధతులనే వుపయోగించి ఆయన శూన్యం నుంచి శిఖరాగ్రం చేరుకున్నాడు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఆయన 2,50,000మందికి పైగా వున్న జనాన్ని సంబోధిస్తుంటాడు. సలహాదారు, శిక్షకుడిగా ఐబిఎమ్, ఫోర్ట్స్, జెరాక్స్, ఎచ్పీ లాంటి 1000 పైచిలుకు కార్పోరేషన్లలో ట్రేసీ పనిచేశాడు. ఆయన యింతవరకు 35 పుస్తకాలు రాశాడు, 300కు పైగా ఆడియో, వీడియో శిక్షణ కార్యక్రమాలు తయారుచేశాడు.© 2017,www.logili.com All Rights Reserved.