ఊరూరూ తిరిగి కలకత్తాకు |
గురు దత్ తల్లి వాసంతి పడుకోణె పూర్వీకులు మంగళూరు ప్రాంతానికి చెందిన సారస్వత్ బ్రాహ్మణ కుటుంబీకులు. పన్నెండేళ్ల వయసులో ఆమె వివాహం అదే కులానికి చెందిన శివశంకర్ రావ్ పడుకోణెతో జరిగింది. వీరి మాతృభాష కొంకణి. శివశంకర్ బి.ఎ. పాసయ్యాక మొదట మంగళూరు ప్రాంతంలోని పానంబూర్ స్కూలు హెడ్ మాస్టరుగా, తర్వాత బెంగళూరులో రెండేళ్లు బ్యాంకులో పని చేశారు. అక్కడే 1925 జూలై 9న గురు దత్ పుట్టాడు. అప్పుడు వాసంతి వయసు పదహారు. గురువారంనాడు జన్మించాడని బిడ్డ పేరు వసంత్ గురు దత్ పడుకోణెగా నిర్ణయించారు. కాని చిన్నప్పుడు ఏదో జబ్బు చేసిన తరువాత వసంత్ పేరుతో కాక గురు దత్గానే పిలవాలని ఓ జ్యోతిష్యుడు చెప్పడంతో 'వసంత్' పేరును కుటుంబం మరచిపోయింది.
భార్యాభర్తల మధ్య సయోధ్య లేకుండానే వాసంతి-శివశంకర్ దాంపత్య జీవితం గడిచిందని గురు దత్ కుటుంబీకులు చాలా సందర్భాలలో చెప్పారు. గురు దత్ చిన్నతనంలో వాసంతి కొన్నాళ్లు తన అన్న రమానాథ్ దగ్గర అహ్మదాబాద్ లో గడిపారు. మతి చలించిన రమానాథ్ మామగారు కూడా వీరి ఇంట్లో ఉండేవారు. ఆయన రాత్రిళ్లు అరిచే అరుపులు గురు దత్ని బాల్యంలో విపరీతమైన భయానికి గురిచేశాయి. ఆ భయం చిన్న గురు దత్ చాలా రోజులు ఉండింది.
చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ, ఉద్యోగ రీత్యా ఒక చోట నుండి మరో చోటుకి మారుతూ శివశంకర్ కొన్నాళ్లకు కలకత్తాలో బర్మా షెల్ కంపెనీలో క్లర్కుగా చేరారు. ఈ ఉద్యోగం ఆయన 30 ఏళ్లపాటు చేశారు. వాసంతి-శివ శంకర్ దంపతులకు 1929లో పుట్టిన మగబిడ్డ శశిధర్ ఏడు నెలల వయసులోనే మరణించాడు. ఇది గురు దత్పై చాలా ప్రభావం చూపింది. చాలా రోజులు...........
ఊరూరూ తిరిగి కలకత్తాకు | గురు దత్ తల్లి వాసంతి పడుకోణె పూర్వీకులు మంగళూరు ప్రాంతానికి చెందిన సారస్వత్ బ్రాహ్మణ కుటుంబీకులు. పన్నెండేళ్ల వయసులో ఆమె వివాహం అదే కులానికి చెందిన శివశంకర్ రావ్ పడుకోణెతో జరిగింది. వీరి మాతృభాష కొంకణి. శివశంకర్ బి.ఎ. పాసయ్యాక మొదట మంగళూరు ప్రాంతంలోని పానంబూర్ స్కూలు హెడ్ మాస్టరుగా, తర్వాత బెంగళూరులో రెండేళ్లు బ్యాంకులో పని చేశారు. అక్కడే 1925 జూలై 9న గురు దత్ పుట్టాడు. అప్పుడు వాసంతి వయసు పదహారు. గురువారంనాడు జన్మించాడని బిడ్డ పేరు వసంత్ గురు దత్ పడుకోణెగా నిర్ణయించారు. కాని చిన్నప్పుడు ఏదో జబ్బు చేసిన తరువాత వసంత్ పేరుతో కాక గురు దత్గానే పిలవాలని ఓ జ్యోతిష్యుడు చెప్పడంతో 'వసంత్' పేరును కుటుంబం మరచిపోయింది. భార్యాభర్తల మధ్య సయోధ్య లేకుండానే వాసంతి-శివశంకర్ దాంపత్య జీవితం గడిచిందని గురు దత్ కుటుంబీకులు చాలా సందర్భాలలో చెప్పారు. గురు దత్ చిన్నతనంలో వాసంతి కొన్నాళ్లు తన అన్న రమానాథ్ దగ్గర అహ్మదాబాద్ లో గడిపారు. మతి చలించిన రమానాథ్ మామగారు కూడా వీరి ఇంట్లో ఉండేవారు. ఆయన రాత్రిళ్లు అరిచే అరుపులు గురు దత్ని బాల్యంలో విపరీతమైన భయానికి గురిచేశాయి. ఆ భయం చిన్న గురు దత్ చాలా రోజులు ఉండింది. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ, ఉద్యోగ రీత్యా ఒక చోట నుండి మరో చోటుకి మారుతూ శివశంకర్ కొన్నాళ్లకు కలకత్తాలో బర్మా షెల్ కంపెనీలో క్లర్కుగా చేరారు. ఈ ఉద్యోగం ఆయన 30 ఏళ్లపాటు చేశారు. వాసంతి-శివ శంకర్ దంపతులకు 1929లో పుట్టిన మగబిడ్డ శశిధర్ ఏడు నెలల వయసులోనే మరణించాడు. ఇది గురు దత్పై చాలా ప్రభావం చూపింది. చాలా రోజులు...........© 2017,www.logili.com All Rights Reserved.