ఏ విద్యార్ధి కైనా ప్రాధమిక విద్యయే జీవిత గమనాన్ని నిర్దేశిస్తుంది. నా ఉదేశ్యం ప్రకారం ప్రాధమిక పాట్యాంశాలను ఔపోసనపట్టించడం మాత్రమేకాదు, అంతకు మించి అత్యున్నత విద్య ప్రమాణాలను పెంపొందించడం కూడా. విద్యా విలువలు,సామాజిక దృక్పధం, హేతువాదంను ప్రేరేపించుట, ఆలోచనా సరళిని మార్చుట మొదలగునవి అత్యున్నత విద్యా ప్రమాణాలు. ఒక విద్యార్ధి వీటన్నిటిని పొందాలంటే, ఒక బ్రహ్మ సమానుడైన గురువు ఎంతో అవసరం. అలాంటి అవకాశం నాతో పాటు మరికొంత మంది విద్యార్ధులకు దక్కింది. అలంటి విద్య ఇప్పుడు మచ్చుకైనా కానరావడం లేదు. అలాంటప్పుడు, ఓ అత్యున్నత విద్యను అందించిన ఆ మహానుభావుడిని, అయన అందించిన విలువలను, చదువులమ్మకు చేసిన సేవలను మరచిపోకూడదనే సదుద్దేశ్యంతో నేను నా అనుభవాలను ఈ లఘు పుస్తకంలో పొందుపరచుతున్నాను. ఈ పుస్తకం పాటకులకు ఒక మంచి అనుభూతిని పంచుతుందని ఆశిస్తున్నాను.
శ్రీనివాస రావు ధేనుకొండ (రచయిత)
ఏ విద్యార్ధి కైనా ప్రాధమిక విద్యయే జీవిత గమనాన్ని నిర్దేశిస్తుంది. నా ఉదేశ్యం ప్రకారం ప్రాధమిక పాట్యాంశాలను ఔపోసనపట్టించడం మాత్రమేకాదు, అంతకు మించి అత్యున్నత విద్య ప్రమాణాలను పెంపొందించడం కూడా. విద్యా విలువలు,సామాజిక దృక్పధం, హేతువాదంను ప్రేరేపించుట, ఆలోచనా సరళిని మార్చుట మొదలగునవి అత్యున్నత విద్యా ప్రమాణాలు. ఒక విద్యార్ధి వీటన్నిటిని పొందాలంటే, ఒక బ్రహ్మ సమానుడైన గురువు ఎంతో అవసరం. అలాంటి అవకాశం నాతో పాటు మరికొంత మంది విద్యార్ధులకు దక్కింది. అలంటి విద్య ఇప్పుడు మచ్చుకైనా కానరావడం లేదు. అలాంటప్పుడు, ఓ అత్యున్నత విద్యను అందించిన ఆ మహానుభావుడిని, అయన అందించిన విలువలను, చదువులమ్మకు చేసిన సేవలను మరచిపోకూడదనే సదుద్దేశ్యంతో నేను నా అనుభవాలను ఈ లఘు పుస్తకంలో పొందుపరచుతున్నాను. ఈ పుస్తకం పాటకులకు ఒక మంచి అనుభూతిని పంచుతుందని ఆశిస్తున్నాను. శ్రీనివాస రావు ధేనుకొండ (రచయిత)© 2017,www.logili.com All Rights Reserved.