భారతదేశంలో కళాకారులకు కొదువలేదు. భారతీయుల ఆలోచనల్లో అసలు జీవితమే ఒక నాటకరంగం. ప్రతి వ్యక్తి రకరకాల పాత్రలు పోషిస్తుంటాడు. వాటిలోని అంతఃసూత్రం కోసం పరితపిస్తూ ఉంటాడు.
మనిషి సంఘజీవి అని తలపోసి అతని భిన్నత్వంలోని ఏకత్వాన్ని మైత్రి ద్వారా పరిపుష్టం గావించాలని తపన పడే కళాకారుడే నిజమైన కళాకారుడని అతడే విశ్వమానవునిగా వేలుగొందగలడని డక్కి బజాయించి చెప్పిన కళాకారుడు శ్రీ కర్నాటి. కళలను ప్రజల ఉమ్మడి ఆస్తిగా పరిగణించి సాంస్కృతిక వారసత్వన్ని అభివృద్ధి పరచి మెరుగులు దిద్ది ముందు తరాలకు అందించాలనే తపనతో కళోద్దరణను చేపట్టిన ప్రజాకళాకారుడు శ్రీ కర్నాటి.
దైనందిన జీవితంలో మనం చేసే ప్రతి పనిలోనూ కళ అంతో, ఇంతో తళుక్కుమంటుంది. అది మనిషికి అతనిలోని మనసుకు మేలుకొలుపులు పాడుతుంది. జీవితాన్ని కళలతో రంగరించుకోగలిగితే మనిషిలో చైతన్యంవస్తుంది. మంచితనం మారుమ్రోగుతుంది మానవత్వం వెల్లివిరుస్తుంది. మనలోని అతి సున్నితమైన స్పందనలకు ప్రతిస్పందన కలిగితే చాలు. లోకం శాంతిమయంగా కాంతిమయంగావిరాజిల్లుతుంది. ఈ కళావైభవం గ్రంథంలో.......
. బ్రహ్మం గారి తత్వాలు
. జానపద కళలు
. బొమ్మలాటవారు
. సాంస్కృతిక ప్రచార సాధనంగా యక్షగానం
. కూచిపూడి భాగవతులు
. పగటి వేషాలతో పేరెన్నికగన్నవారు
. ప్రముఖ నాటక రచయితలు
. కళాసేవలో గజపతులు
. నటరత్నాలు
. నాటక రంగంలో నటిమణుల పాత్ర
. ప్రజా నాట్య మండలి
. శ్రవణానందలహరి........ఇంకా ఎన్నో కళా రూపాలను గురించిన విషయాలను ఈ గ్రంథం లో వివరించడం జరిగింది.
-రావేల సాంబశివరావు.
భారతదేశంలో కళాకారులకు కొదువలేదు. భారతీయుల ఆలోచనల్లో అసలు జీవితమే ఒక నాటకరంగం. ప్రతి వ్యక్తి రకరకాల పాత్రలు పోషిస్తుంటాడు. వాటిలోని అంతఃసూత్రం కోసం పరితపిస్తూ ఉంటాడు. మనిషి సంఘజీవి అని తలపోసి అతని భిన్నత్వంలోని ఏకత్వాన్ని మైత్రి ద్వారా పరిపుష్టం గావించాలని తపన పడే కళాకారుడే నిజమైన కళాకారుడని అతడే విశ్వమానవునిగా వేలుగొందగలడని డక్కి బజాయించి చెప్పిన కళాకారుడు శ్రీ కర్నాటి. కళలను ప్రజల ఉమ్మడి ఆస్తిగా పరిగణించి సాంస్కృతిక వారసత్వన్ని అభివృద్ధి పరచి మెరుగులు దిద్ది ముందు తరాలకు అందించాలనే తపనతో కళోద్దరణను చేపట్టిన ప్రజాకళాకారుడు శ్రీ కర్నాటి. దైనందిన జీవితంలో మనం చేసే ప్రతి పనిలోనూ కళ అంతో, ఇంతో తళుక్కుమంటుంది. అది మనిషికి అతనిలోని మనసుకు మేలుకొలుపులు పాడుతుంది. జీవితాన్ని కళలతో రంగరించుకోగలిగితే మనిషిలో చైతన్యంవస్తుంది. మంచితనం మారుమ్రోగుతుంది మానవత్వం వెల్లివిరుస్తుంది. మనలోని అతి సున్నితమైన స్పందనలకు ప్రతిస్పందన కలిగితే చాలు. లోకం శాంతిమయంగా కాంతిమయంగావిరాజిల్లుతుంది. ఈ కళావైభవం గ్రంథంలో....... . బ్రహ్మం గారి తత్వాలు . జానపద కళలు . బొమ్మలాటవారు . సాంస్కృతిక ప్రచార సాధనంగా యక్షగానం . కూచిపూడి భాగవతులు . పగటి వేషాలతో పేరెన్నికగన్నవారు . ప్రముఖ నాటక రచయితలు . కళాసేవలో గజపతులు . నటరత్నాలు . నాటక రంగంలో నటిమణుల పాత్ర . ప్రజా నాట్య మండలి . శ్రవణానందలహరి........ఇంకా ఎన్నో కళా రూపాలను గురించిన విషయాలను ఈ గ్రంథం లో వివరించడం జరిగింది. -రావేల సాంబశివరావు.© 2017,www.logili.com All Rights Reserved.