ఆకురాతి శేషాచలం పత్రికా రంగానికి విశేష సేవలందించారు. స్వాతి సపరి వార పత్రిక, ఆంధ్రపత్రిక, జనత వంటి పత్రికల్లో దాదాపు 26 సంవత్సరాలు పనిచేశారు. దిన, వార, పక్ష, మాస పత్రికల్లో వివిధ హోదాల్లో విధులను నిర్వర్తించారు. జాతీయ, అంతర్జాతీయ వార్తల తెలుగు అనువాదంలో సుదీర్ఘ అనుభవం వుంది, ఇన్ ఛార్జి - ఎడిటర్ హెూదాలో స్వచ్చంద పదవీ విరమణ చేశారు. సినిమా రిపోర్టరుగా ఎనిమిదేళ్ళు పని చేశారు. వివిధ
అంశాలకు సంబంధించి వీరు వ్రాసిన వందలాది వ్యాసాలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అదే స్ఫూర్తితో తొలుత ప్రముఖ తెలుగు దర్శకునిపై పుస్తకం రూపొందించారు. మలి ప్రయత్నంగా యువరత్న బాలకృష్ణ నటించిన 100 చిత్రాల విశేషాలతో 'నందమూరి నటసింహం' పేరుతో 428 పేజీలతో సమగ్ర పుస్తకానికి రూపకల్పన చేశారు. 2017 నవంబరు 9న విశాఖపట్నంలో హీరో బాలకృష్ణ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. రచయితను అభినందించారు. సుమారు 50 నెలలు కృషిచేసి 'వెండితెర వైభవంపుస్తకాన్ని తయారుచేశారు. వేయికి పైగా ఛాయాచిత్రాలతో అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
ఆకురాతి శేషాచలం పత్రికా రంగానికి విశేష సేవలందించారు. స్వాతి సపరి వార పత్రిక, ఆంధ్రపత్రిక, జనత వంటి పత్రికల్లో దాదాపు 26 సంవత్సరాలు పనిచేశారు. దిన, వార, పక్ష, మాస పత్రికల్లో వివిధ హోదాల్లో విధులను నిర్వర్తించారు. జాతీయ, అంతర్జాతీయ వార్తల తెలుగు అనువాదంలో సుదీర్ఘ అనుభవం వుంది, ఇన్ ఛార్జి - ఎడిటర్ హెూదాలో స్వచ్చంద పదవీ విరమణ చేశారు. సినిమా రిపోర్టరుగా ఎనిమిదేళ్ళు పని చేశారు. వివిధ అంశాలకు సంబంధించి వీరు వ్రాసిన వందలాది వ్యాసాలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అదే స్ఫూర్తితో తొలుత ప్రముఖ తెలుగు దర్శకునిపై పుస్తకం రూపొందించారు. మలి ప్రయత్నంగా యువరత్న బాలకృష్ణ నటించిన 100 చిత్రాల విశేషాలతో 'నందమూరి నటసింహం' పేరుతో 428 పేజీలతో సమగ్ర పుస్తకానికి రూపకల్పన చేశారు. 2017 నవంబరు 9న విశాఖపట్నంలో హీరో బాలకృష్ణ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. రచయితను అభినందించారు. సుమారు 50 నెలలు కృషిచేసి 'వెండితెర వైభవంపుస్తకాన్ని తయారుచేశారు. వేయికి పైగా ఛాయాచిత్రాలతో అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
© 2017,www.logili.com All Rights Reserved.