ధ్యానగీతం
పాట పసితనం నుండే నేర్చిన ధ్యానం
ఆనాడే లేత మెదళ్లకందిన రుచి మంత్రం
పాట స్వరాల పూలతోటల దారుల్లోకి లాగి
ఆ పై సంగీతాకాశం నుండి దిగంతాల వైపు
అపురూపంగా ఎత్తుకుని తిప్పుతుంది
పారాచూట్ ఎక్కించి విహంగ వీక్షణం చేయిస్తుంది
పాట మదిని మైమరపించి మురిపిస్తుంది
భావ జ్ఞానమందిర ప్రదక్షిణం చెయ్యమంటుంది
మెడిటేషన్ టీచర్ లా చెవిలో చికిత్స చేస్తుంది
గుండె చెదిరిన వేళల్లో మృదువుగా అతుకుతుంది
పాట ఉత్తేజాన్ని ఉచితంగా రీచార్జ్ చేసి పెడుతుంది
ఆగిన పాట మౌన సౌందర్యాన్ని దర్శించమంటుంది
ఒంటరిగా పాట వినడం ఆత్మ పరమాత్మను పలకరించడమే!
ఈ బతుకుబండి చురుకుదనపు చిదంబర రహస్యం
పాట కోసం పాటలగుడికి ద్వారపాలకులైపోవడమే!
ధ్యానగీతం పాట పసితనం నుండే నేర్చిన ధ్యానం ఆనాడే లేత మెదళ్లకందిన రుచి మంత్రం పాట స్వరాల పూలతోటల దారుల్లోకి లాగి ఆ పై సంగీతాకాశం నుండి దిగంతాల వైపు అపురూపంగా ఎత్తుకుని తిప్పుతుంది పారాచూట్ ఎక్కించి విహంగ వీక్షణం చేయిస్తుంది పాట మదిని మైమరపించి మురిపిస్తుంది భావ జ్ఞానమందిర ప్రదక్షిణం చెయ్యమంటుంది మెడిటేషన్ టీచర్ లా చెవిలో చికిత్స చేస్తుంది గుండె చెదిరిన వేళల్లో మృదువుగా అతుకుతుంది పాట ఉత్తేజాన్ని ఉచితంగా రీచార్జ్ చేసి పెడుతుంది ఆగిన పాట మౌన సౌందర్యాన్ని దర్శించమంటుంది ఒంటరిగా పాట వినడం ఆత్మ పరమాత్మను పలకరించడమే! ఈ బతుకుబండి చురుకుదనపు చిదంబర రహస్యం పాట కోసం పాటలగుడికి ద్వారపాలకులైపోవడమే!
© 2017,www.logili.com All Rights Reserved.