అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి మానవుడు-యూరీ గగారిన్.
ఆకాశాన్ని దాటేంత ఎత్తుకి యూరీ ఎగరడానికి కారణం కాస్త పొట్టివాడు కావడం; బాల్యంలో భరించలేని బాధలు పడడం!
***
యూరీ గగారిన్ పుట్టింది రష్యాలోని స్మోలెన్స్డ్ ప్రాంతంలో 1934లో. తండ్రి కార్పెంటర్. తల్లి రోజు కూలీ. చెప్పలేనంత పేదరికం. మరోవైపు రెండో ప్రపంచయుద్ధం వచ్చింది. రష్యాపై జర్మన్ సైన్యం దాడి చేసింది. ఆ సైనిక రాక్షసుల పదఘట్టనల కింద రష్యా నలిగిపోయింది. నాజీ సైన్యం ఊళ్లకు ఊళ్లను కాల్చేసింది. లక్షల ఇళ్లను కూల్చేసి హిట్లర్ సేన బీభత్సం సృష్టించింది.
ఓ రోజు స్కూల్లో ఉన్నాడు గగారిన్. శత్రుసైన్యం ఒక్కసారిగా దండెత్తింది. పిల్లలంతా భయంతో చెల్లా చెదురైపోయారు. భుజాలకు తుపాకులు ఉన్న సైనికులు మధ్య నుంచి బితుకు బితుకు మంటూ యూరీ ఇంటికొచ్చాడు. కానీ అక్కడ ఇల్లు లేదు. కూలిపోయింది. అమ్మ, నాన్న అక్క అన్న చెల్లి ఎవ్వరూ లేరు.
ఏడ్చేశాడు ఏడేళ్ల గగారిన్.
అంతలో చీకటి పడింది. ఎక్కడ్నుంచో, నాన్న వచ్చాడు రహస్యంగా. మెల్లగా పొదల్లోకి లాక్కెళ్లాడు గగారిన్ని. అక్కణ్ణుంచి ఓ సొరంగంలోకి తీసుకెళ్లాడు. అక్కడే ఇంట్లో వాళ్లంతా ఉన్నారు. ఒక్క పెట్టున కౌగిలించుకొని ఏడ్చేశాడు యూరీ.
ఆ సొరంగమే ఇప్పుడు వాళ్ల ఇల్లు. దాదాపు రెండేళ్లు అక్కడే కాపురం. బయట నిత్యం సైనికుల కవాతు. ఇంట్లో పగలు కూడా చీకటిగా ఉండేది. తీవ్రమైన మానసిక ఒత్తిడి. ఎప్పుడు ఏం అవుతుందో తెలీని పరిస్థితి. ఆ ఇరుకైన వాతావరణంలో, తిండి దొరకని పరిస్థితిలో యూరీ బాల్యం గడిచింది.
***
యుద్ధం ముగిసింది. జనజీవన స్రవంతి ప్రారంభమైంది. ఆనాటి రష్యాలోని స్కూళ్లలో టీచర్లు ఎక్కువగా దేశభక్తి గురించి బోధించేవారు. శత్రుదేశాల దాడిలో తమ దేశం ఏం కోల్పోయిందో వివరించేవారు. దేశం గర్వించేలా ప్రతిపౌరుడూ ఎదగాలని ప్రేరేపించేవారు.
అప్పుడనుకొన్నాడు యూరీ గగారిన్ - వైమానికదళంలో చేరాలని. ఇరవై ఏళ్ళ............
© 2017,www.logili.com All Rights Reserved.