మదరాసు బదుకులు - చెన్నపురి కథల సంకలనం గురించి ముందు వెనుకలు చెప్పుకోవాలంటే 2016 సంవత్సరం అటు ఇటు సంఘటనలు ప్రస్తావించాలి. 2013 మధ్య నుంచి 2016 మధ్య దాకా నేను ఆకాశవాణి ఉద్యోగరీత్యా మద్రాసులో ఉన్నాను. రేడియో తెలుగు కార్యక్రమాలకు సంబంధించి ఎంతో మందిని మా కార్యాలయంలో నగరంలో నగరం బయటా ఈ మూడేళ్ళలో కలిశాను. పత్రికలూ చానళ్ళు రేడియో వినియోగించే తెలుగు మాట్లాడగలిగేవాళ్ళు అలాకాక తమిళనాటనే ఉండి తెలుగు చదవగలిగేవారు ఈ రెండు రకాలు కాకుండా అక్కడి అప్పటం తెలుగులో కేవలం మాటాడగలిగినవారు - ఇలా విభిన్నంగా కనబడతారు. నిజానికి మూడో విభాగం తెలుగువారే సంఖ్యాపరంగా ఎక్కువగా ఉంటారు. కానీ రకరకాల కారణాలతో మద్రాసులో ఉంటూ సాగే తెలుగువారు లేదా ప్రధాన స్రవంతి తెలుగు మీడియాలో భాగం పంచుకునే తెలుగువారు. ఈ మూడువరకం తెలుగువారి గురించి తెలుసుకోవాలి అనిపించింది.
2015 డిసెంబరు చివరన స. వెం. రమేష్ మిత్రులతో కలిసి బాంగ్లాదేశ్ వెళ్ళి తిరిగి వెళుతూ మా ఇంటికి వచ్చారు. నిజానికి ఆ నెలంతా నేను మూడు పుస్తకాలు చదివిన ప్రభావంతో ఉన్నాను. ఆ పుస్తకాలు ఇవి: అ. 1952 లో మద్రాసు నుంచి ప్రచురించబడిన టంగుటూరి ప్రకాశం గారి నివేదిక - మదరాసు తెలుగు నగరం ఆ. వై. ఎస్. శాస్త్రి విద్యాన్ వి. సుబ్బరాయగుప్త గార్ల రచన - బలిదానం త్యాగమూర్తి పొట్టి శ్రీ రాములు ఇ. వై. ఎస్. శాస్త్రి బొమ్మకంటి శ్రీనీవిలాసాచార్యుల పుస్తకం - అమరజీవి సురమగాధ.
- డా. నాగసూరి వేణుగోపాల్