చరిత్రలో ఒక వీర నారీమణి
ఆదిలో పరాశక్తే సృష్టికి మూలం. తరువాత సమాజంలో సంఘంలో, రాజకీయాల్లో స్త్రీకి అంతస్థానంలేదనే చెప్పవచ్చు. కానీ ఆయాకాలాలలో కొంతమంది స్త్రీలు వేదాంత, మత, సాహిత్య, కళ, సాంఘిక, రాజకీయ తదితర రంగాలలో పరిధులను ఛేదించుకొని ముందంజవేశారు. వీరికి ఏ శాస్త్రాలు, చట్టాలు పగ్గాలు వేయలేకపోయాయి.
వేదాలు స్త్రీకి దరిచేరవన్నారు. కానీ వేదాలలో కొన్ని ఋక్కులనే రచించిన లోపాముద్ర, యమి, అపాత, ఘోష మొదలైన స్త్రీలు ఉన్నారు. వీరు ఋషులతో సమానంగా ఋషికలనబడేవారు. రామాయణ, మహాభారతాలలో స్త్రీలు బ్రహ్మవిద్యేగాక అస్త్ర యుద్ధవిద్యలలో ఆరితేరారు. చంద్రగుప్త మౌర్యునికాలంలో రాజుకు అంగ రక్షకులుగా ఆయుధ పాణులైన స్త్రీలు కూడా పహరా కాసేవారని మెగస్తనీస్ పేర్కొన్నాడు. కౌటిల్యుడు స్త్రీలు విలుకత్తెలుగా ఉండేవారని చెప్పాడు. రాజుకు అంగరక్షకులుగా, వేటలో ప్రావీణ్యంగల స్త్రీలు, శారీరక దార్థ్యంలో శిక్షణ పొందే శిల్పాలు ఎన్నో మనకు హంపిలో దర్శనమిస్తాయి.
ప్రతి రాజవంశ చరిత్రలోనూ ధైర్యమూర్తులుగా రాణి వాసపు స్త్రీలు, కవయిత్రులు, సామాన్య స్త్రీలైతేనేమి ఎంతోమంది ఉన్నారు. ప్రథమంగా చారిత్రకంగా వినవచ్చేది. శాతవాహనుల పరిపాలనలోని రాజులు తల్లిపేర్లతో ప్రసిద్ధికెక్కినవారే. గౌతమీపుత్ర శాతకర్ణి, వాసిష్ఠీపుత్ర పులోమావి, గౌతమీ పుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి మొదలైనవారు. అలాగే ఇక్ష్వాకుల రాణులు శాంతిశ్రీ, రుద్రధర భట్టారిక, కొడబలి శ్రీ మొదలైనవారు ఉన్నారు. నాటిపాలకులు వైదికమతం అవలంబించినా వీరి సతీమణులు స్వతంత్రించి........................
చరిత్రలో ఒక వీర నారీమణి ఆదిలో పరాశక్తే సృష్టికి మూలం. తరువాత సమాజంలో సంఘంలో, రాజకీయాల్లో స్త్రీకి అంతస్థానంలేదనే చెప్పవచ్చు. కానీ ఆయాకాలాలలో కొంతమంది స్త్రీలు వేదాంత, మత, సాహిత్య, కళ, సాంఘిక, రాజకీయ తదితర రంగాలలో పరిధులను ఛేదించుకొని ముందంజవేశారు. వీరికి ఏ శాస్త్రాలు, చట్టాలు పగ్గాలు వేయలేకపోయాయి. వేదాలు స్త్రీకి దరిచేరవన్నారు. కానీ వేదాలలో కొన్ని ఋక్కులనే రచించిన లోపాముద్ర, యమి, అపాత, ఘోష మొదలైన స్త్రీలు ఉన్నారు. వీరు ఋషులతో సమానంగా ఋషికలనబడేవారు. రామాయణ, మహాభారతాలలో స్త్రీలు బ్రహ్మవిద్యేగాక అస్త్ర యుద్ధవిద్యలలో ఆరితేరారు. చంద్రగుప్త మౌర్యునికాలంలో రాజుకు అంగ రక్షకులుగా ఆయుధ పాణులైన స్త్రీలు కూడా పహరా కాసేవారని మెగస్తనీస్ పేర్కొన్నాడు. కౌటిల్యుడు స్త్రీలు విలుకత్తెలుగా ఉండేవారని చెప్పాడు. రాజుకు అంగరక్షకులుగా, వేటలో ప్రావీణ్యంగల స్త్రీలు, శారీరక దార్థ్యంలో శిక్షణ పొందే శిల్పాలు ఎన్నో మనకు హంపిలో దర్శనమిస్తాయి. ప్రతి రాజవంశ చరిత్రలోనూ ధైర్యమూర్తులుగా రాణి వాసపు స్త్రీలు, కవయిత్రులు, సామాన్య స్త్రీలైతేనేమి ఎంతోమంది ఉన్నారు. ప్రథమంగా చారిత్రకంగా వినవచ్చేది. శాతవాహనుల పరిపాలనలోని రాజులు తల్లిపేర్లతో ప్రసిద్ధికెక్కినవారే. గౌతమీపుత్ర శాతకర్ణి, వాసిష్ఠీపుత్ర పులోమావి, గౌతమీ పుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి మొదలైనవారు. అలాగే ఇక్ష్వాకుల రాణులు శాంతిశ్రీ, రుద్రధర భట్టారిక, కొడబలి శ్రీ మొదలైనవారు ఉన్నారు. నాటిపాలకులు వైదికమతం అవలంబించినా వీరి సతీమణులు స్వతంత్రించి........................© 2017,www.logili.com All Rights Reserved.