తమ్ముడి కథలు
(An incomplete Intro)
ఈ హేమంతంలో మా అమ్మాయి బేబి శాంతి వివాహానికి తమ్ముడు కడప వచ్చాడు. ఆ పిమ్మట నా ఆరోగ్యం అంత బాగుండకపోవడంతో రాయచోటిలో మాతో కొన్నాళ్లు గడిపాడు. అప్పటికి తను ఉద్యోగం నుంచి రిటైరయి అన్నాళ్లు విశ్రాంతిగా మా మధ్య వుండటం అందరికీ ఆనందదాయకమైన విషయం.
ఆ సందర్భంలోనే - "మిత్రులు చాలా మంది నా పాత కథలను సంపుటీకరించి పుస్తకం వేయమంటున్నారు. పీఠిక నువ్వు రాస్తే బాగుంటుంది" అని కిందటి వారం - చాలా బిడియపడుతూనే.
అన్నాడు.
“మా సీమ" రాజగోపాలరెడ్డి గారి పత్రికలో దాదాపు పదేళ్ళకు పూర్వం అనుకొంటాను - రాయలసీమలోనూ, తెలుగు ప్రాంతమంతటా ప్రసిద్ధులైన మధురాంతకం రాజారాంగారు తమ్ముడి కథలపైన ఒక అద్భుతమైన దీర్ఘ సమీక్ష ప్రచురించి వున్నారు. "అంతకన్నా గొప్ప విశేషాలు నేనేం రాయగలను? అది చాలదా?" అని నేనన్నాను. తనికి మౌనంలోకి పోయాడు. ఏ విషయంలోనూ ఎవరినీ బలవంతం చేయటం వాడి ప్రకృతి గాదు. అసలు తను కథలూ ఇతర రచనలూ చేస్తున్న విషయమే బహుగోప్యంగా వుంచేవాడు. గొప్పలు చెప్పుకోవటం, గర్వపడటం ఏనాడూ లేదు. ఎవరైనా అడిగితే, ఆ మనిషిని నేను కాదని తప్పించుకొనేవాడు. దుస్తులూ అంతే. అతి నిరాడంబరం.
రాయచోటి గ్రంథాలయంలో లైబ్రేరియన్ బాలక్రిష్ణ తమ్ముడి కథ ఏ పత్రికలో వచ్చినా నాకు తెచ్చి చూపి, తనే అది రాసినంత గర్వపడుతూ చెప్పేవాడు. ఎప్పుడూ ఏ కోరికా కోరని తమ్ముడి సాహిత్య కృషిలో విశేషాల్ని గురించి కాకపోయినా, అతని వ్యక్తిత్వపు విశిష్టతనైనా రాయలేనా అని ఇందుకు పూనుకొన్నాను.
మా బాల్యంలో చాలా భాగం తెనాలిలో గడిచింది. అందరి పిల్లల మాదిరిగా నిర్భీతిగా అమాయకపు ఆటల్లో వున్నా - తమ్ముడి కరుణార్ద్ర హృదయపు లోతులు నేను కనిపెడుతూనే వుండేవాణ్ణి. వారాల పిల్లలంటే చాలా యిష్టం. సైక్కాలవ మురికినీట్లో ఎవరో కొట్టి తోసివేసిన యానాది పిల్లవాడికి తన చొక్కా దానం చేసి ఇంటికి చేరిన బాగా గుర్తు. ఇతర్లతో పంచుకోనిదే తనేదీ తినేవాడుగాదు. నాన్నగారితో మూక............
తమ్ముడి కథలు (An incomplete Intro) ఈ హేమంతంలో మా అమ్మాయి బేబి శాంతి వివాహానికి తమ్ముడు కడప వచ్చాడు. ఆ పిమ్మట నా ఆరోగ్యం అంత బాగుండకపోవడంతో రాయచోటిలో మాతో కొన్నాళ్లు గడిపాడు. అప్పటికి తను ఉద్యోగం నుంచి రిటైరయి అన్నాళ్లు విశ్రాంతిగా మా మధ్య వుండటం అందరికీ ఆనందదాయకమైన విషయం. ఆ సందర్భంలోనే - "మిత్రులు చాలా మంది నా పాత కథలను సంపుటీకరించి పుస్తకం వేయమంటున్నారు. పీఠిక నువ్వు రాస్తే బాగుంటుంది" అని కిందటి వారం - చాలా బిడియపడుతూనే. అన్నాడు. “మా సీమ" రాజగోపాలరెడ్డి గారి పత్రికలో దాదాపు పదేళ్ళకు పూర్వం అనుకొంటాను - రాయలసీమలోనూ, తెలుగు ప్రాంతమంతటా ప్రసిద్ధులైన మధురాంతకం రాజారాంగారు తమ్ముడి కథలపైన ఒక అద్భుతమైన దీర్ఘ సమీక్ష ప్రచురించి వున్నారు. "అంతకన్నా గొప్ప విశేషాలు నేనేం రాయగలను? అది చాలదా?" అని నేనన్నాను. తనికి మౌనంలోకి పోయాడు. ఏ విషయంలోనూ ఎవరినీ బలవంతం చేయటం వాడి ప్రకృతి గాదు. అసలు తను కథలూ ఇతర రచనలూ చేస్తున్న విషయమే బహుగోప్యంగా వుంచేవాడు. గొప్పలు చెప్పుకోవటం, గర్వపడటం ఏనాడూ లేదు. ఎవరైనా అడిగితే, ఆ మనిషిని నేను కాదని తప్పించుకొనేవాడు. దుస్తులూ అంతే. అతి నిరాడంబరం. రాయచోటి గ్రంథాలయంలో లైబ్రేరియన్ బాలక్రిష్ణ తమ్ముడి కథ ఏ పత్రికలో వచ్చినా నాకు తెచ్చి చూపి, తనే అది రాసినంత గర్వపడుతూ చెప్పేవాడు. ఎప్పుడూ ఏ కోరికా కోరని తమ్ముడి సాహిత్య కృషిలో విశేషాల్ని గురించి కాకపోయినా, అతని వ్యక్తిత్వపు విశిష్టతనైనా రాయలేనా అని ఇందుకు పూనుకొన్నాను. మా బాల్యంలో చాలా భాగం తెనాలిలో గడిచింది. అందరి పిల్లల మాదిరిగా నిర్భీతిగా అమాయకపు ఆటల్లో వున్నా - తమ్ముడి కరుణార్ద్ర హృదయపు లోతులు నేను కనిపెడుతూనే వుండేవాణ్ణి. వారాల పిల్లలంటే చాలా యిష్టం. సైక్కాలవ మురికినీట్లో ఎవరో కొట్టి తోసివేసిన యానాది పిల్లవాడికి తన చొక్కా దానం చేసి ఇంటికి చేరిన బాగా గుర్తు. ఇతర్లతో పంచుకోనిదే తనేదీ తినేవాడుగాదు. నాన్నగారితో మూక............© 2017,www.logili.com All Rights Reserved.