శ్వేతవస్త్రము
"చితిని వెలిగించు బాదల్” గంభీరంగా పలికింది. పద్మావతిదేవి కంఠం,
బాదల్ చేయి సన్నగా కంపించింది. నయనాలు అశ్రుపూరితాలు అయినాయి. జలజల వర్షించాయి.
"ఏడవడం వీరలక్షణమా బాదల్?” ప్రశ్నించింది. పద్మావతిదేవి.
“నా ప్రాణం ఉన్నంతవరకూ తమరిని కాపాడుతానని ప్రభువుకి మాట ఇచ్చానమ్మా. అది నిలుపుకోలేకపోతున్నందుకు.....” వెక్కిళ్ళు మాటలను మింగేశాయి.
“ఇప్పుడు నువ్వు నన్ను కాపాడటం లేదని ఎవరన్నారు బాదల్? హైందవ ధర్మ అనుష్ఠిత అయిన స్త్రీ పరపురుషుడి దృష్టి కూడా తనమీద ప్రసరించడానికి అంగీకరించదు. ఒకవేళ అటువంటి తరుణము గనుక వస్తే ఆమె ఆశ్రయించవలసింది అగ్నినే. అందుచేత నీవు మాట తప్పడం లేదు బాదల్. నన్ను సురక్షితమైన ప్రాంతానికి చేరుస్తున్నావు". నిశ్చలంగా నిబ్బరంగా పలికింది. పద్మావతిదేవి.
చెంపలు ఒత్తుకున్నాడు బాదల్. చితిని వెలిగించాడు. ఒక్కసారిగా కొన్ని వందల చితులు వెలిగాయి. చిత్తోడ్ కోటలో అమావాస్య చీకట్లు పరుగుతీశాయి. గోముఖకుండు తీర్థం ఆవరణ జాజ్వల్యమానంగా ప్రకాశిస్తోంది. సుమారు మూడువేలమంది స్త్రీలు, పిల్లలు అగ్నిని ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరి కన్నుల్లోను కించిత్ బాధ కూడాలేదు.
గర్వంగా ఉన్నాయి వదనాలు. హైందవ ధర్మానికి ఛత్రంవంటివారు రాజపుత్రులు, బాదల్ దీర్ఘంగా శ్వాసించాడు. ఛాతీ బిగుసుకుంది. గాయాలోంచి రక్తం జివ్వున బయటకు వచ్చింది. పూచిన మోదుగుచెట్టులా ఉన్నాడు. ఒక హసంతో కరవాలం, మరో హస్తంతో కాగడా ధరించాడు.
చితిమంటల వెలుగులో పద్మావతిదేవి అందం మరింతగా ప్రకాశించసాగింది. ఎర్రని చీరలో ఉన్న ఆమె అగ్నిలోంచి వెలికితీసిన సువర్ణంలాగా ఉంది.. |.....
శ్వేతవస్త్రము "చితిని వెలిగించు బాదల్” గంభీరంగా పలికింది. పద్మావతిదేవి కంఠం, బాదల్ చేయి సన్నగా కంపించింది. నయనాలు అశ్రుపూరితాలు అయినాయి. జలజల వర్షించాయి. "ఏడవడం వీరలక్షణమా బాదల్?” ప్రశ్నించింది. పద్మావతిదేవి. “నా ప్రాణం ఉన్నంతవరకూ తమరిని కాపాడుతానని ప్రభువుకి మాట ఇచ్చానమ్మా. అది నిలుపుకోలేకపోతున్నందుకు.....” వెక్కిళ్ళు మాటలను మింగేశాయి. “ఇప్పుడు నువ్వు నన్ను కాపాడటం లేదని ఎవరన్నారు బాదల్? హైందవ ధర్మ అనుష్ఠిత అయిన స్త్రీ పరపురుషుడి దృష్టి కూడా తనమీద ప్రసరించడానికి అంగీకరించదు. ఒకవేళ అటువంటి తరుణము గనుక వస్తే ఆమె ఆశ్రయించవలసింది అగ్నినే. అందుచేత నీవు మాట తప్పడం లేదు బాదల్. నన్ను సురక్షితమైన ప్రాంతానికి చేరుస్తున్నావు". నిశ్చలంగా నిబ్బరంగా పలికింది. పద్మావతిదేవి. చెంపలు ఒత్తుకున్నాడు బాదల్. చితిని వెలిగించాడు. ఒక్కసారిగా కొన్ని వందల చితులు వెలిగాయి. చిత్తోడ్ కోటలో అమావాస్య చీకట్లు పరుగుతీశాయి. గోముఖకుండు తీర్థం ఆవరణ జాజ్వల్యమానంగా ప్రకాశిస్తోంది. సుమారు మూడువేలమంది స్త్రీలు, పిల్లలు అగ్నిని ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరి కన్నుల్లోను కించిత్ బాధ కూడాలేదు. గర్వంగా ఉన్నాయి వదనాలు. హైందవ ధర్మానికి ఛత్రంవంటివారు రాజపుత్రులు, బాదల్ దీర్ఘంగా శ్వాసించాడు. ఛాతీ బిగుసుకుంది. గాయాలోంచి రక్తం జివ్వున బయటకు వచ్చింది. పూచిన మోదుగుచెట్టులా ఉన్నాడు. ఒక హసంతో కరవాలం, మరో హస్తంతో కాగడా ధరించాడు. చితిమంటల వెలుగులో పద్మావతిదేవి అందం మరింతగా ప్రకాశించసాగింది. ఎర్రని చీరలో ఉన్న ఆమె అగ్నిలోంచి వెలికితీసిన సువర్ణంలాగా ఉంది.. |.....© 2017,www.logili.com All Rights Reserved.