ప్రస్తావన
కావలసింది అంతా ఉన్నట్లు కనిపించే విజయవీరులను చూసి ఉంటారు. అంతేకాదు వారిని మెచ్చుకోకుండా ఉండలేరు! కదా! వాళ్ళు వ్యాపార సమావేశాలలో ధైర్యంగా మాట్లాడుతూ ఉంటారు. సామాజిక సమావేశాలలో కలివిడిగా మాట్లాడుతూ ఉంటారు. వారి ఉద్యోగాలు ఉత్తమం. వారి జీవిత భాగస్వాములు అతి మనోహరులు. వారి స్నేహితులు అతిమంచివారు. వారి బ్యాంక్ ఎకౌంట్లు భారీ ఎకౌంట్లు. వారి జిప్ కోడ్లు అంతకంటే అధునాతనంగా ఉంటాయి.
ఒక్క క్షణం! వారిలో చాలామంది మీకంటే తెలివైన వారేం కాదు. మీకంటే ఎక్కువ చదువు లేదు. చూపులలో మిమ్మల్ని మించిన వారేమీ కాదు. మరేమిటి? (వారికి అది వారసత్వంగా సంక్రమించిందని కొందరి అనుమానం. పెళ్ళితో కలిసి వచ్చిందని మరికొందరి ఉవాచ. పెట్టి పుట్టారు అని మరి కొందరి వాణి. వారందరినీ మరొక్కసారి ఆలోచించుమని చెప్పండి). తోటివారితో నేర్పుగా ప్రవర్తించటమే దాని వెనుక చిదంబర రహస్యం.
ఒక్క విషయం గమనించండి. ఒంటరిగా ఎవరూ శిఖరాగ్రం చేరుకోలేరు. పెట్టి పుట్టినవారిలా కనిపించేవారు అందరూ వందలాది మనుషుల మనసులు దోచుకున్నారు. వారి గుండెలలో గూడు కట్టుకున్నారు. వారు ఎంచుకున్న నిచ్చెన సంస్థాపరం కానీ, సామాజికం కానీ - ఎక్కటానికి ఈ వందలాది మనుషులందరూ అడుగడుగునా చేయూతనిచ్చి పైకి ఎక్కించారు.
కోరికలతో నిచ్చెన అడుగున చక్కర్లు కొట్టేవారందరూ పైకిచూస్తూ అక్కడికి చేరిన పెద్దలు అందరూ గర్విష్టులనీ, పొగరుమోతులనీ గొణుగుతూ ఉంటారు. ఆ పెద్దవారి స్నేహము, ఆదరణ, వ్యాపారము దొరకకపోతే, వాళ్ళను ఒక మోస్తరు ముఠా అనీ, ఒకరికొకరు సరిపడిన వాళ్ళనీ, వంకలు పెడతారు. వారు ఇప్పటికే చాలా ఎత్తు ఎదిగారనీ, ఇంక ఎదగటం సాధ్యంకాదనీ గొణుగుతూ ఉంటారు...................
ప్రస్తావన ఎవరినుంచైనాసరే మీరు కోరింది. ఏదైనా రాబట్టటం ఎలా? (మీ ప్రయత్నం మీరు చెయ్యండి, పోయేదేమీ లేదు!) కావలసింది అంతా ఉన్నట్లు కనిపించే విజయవీరులను చూసి ఉంటారు. అంతేకాదు వారిని మెచ్చుకోకుండా ఉండలేరు! కదా! వాళ్ళు వ్యాపార సమావేశాలలో ధైర్యంగా మాట్లాడుతూ ఉంటారు. సామాజిక సమావేశాలలో కలివిడిగా మాట్లాడుతూ ఉంటారు. వారి ఉద్యోగాలు ఉత్తమం. వారి జీవిత భాగస్వాములు అతి మనోహరులు. వారి స్నేహితులు అతిమంచివారు. వారి బ్యాంక్ ఎకౌంట్లు భారీ ఎకౌంట్లు. వారి జిప్ కోడ్లు అంతకంటే అధునాతనంగా ఉంటాయి. ఒక్క క్షణం! వారిలో చాలామంది మీకంటే తెలివైన వారేం కాదు. మీకంటే ఎక్కువ చదువు లేదు. చూపులలో మిమ్మల్ని మించిన వారేమీ కాదు. మరేమిటి? (వారికి అది వారసత్వంగా సంక్రమించిందని కొందరి అనుమానం. పెళ్ళితో కలిసి వచ్చిందని మరికొందరి ఉవాచ. పెట్టి పుట్టారు అని మరి కొందరి వాణి. వారందరినీ మరొక్కసారి ఆలోచించుమని చెప్పండి). తోటివారితో నేర్పుగా ప్రవర్తించటమే దాని వెనుక చిదంబర రహస్యం. ఒక్క విషయం గమనించండి. ఒంటరిగా ఎవరూ శిఖరాగ్రం చేరుకోలేరు. పెట్టి పుట్టినవారిలా కనిపించేవారు అందరూ వందలాది మనుషుల మనసులు దోచుకున్నారు. వారి గుండెలలో గూడు కట్టుకున్నారు. వారు ఎంచుకున్న నిచ్చెన సంస్థాపరం కానీ, సామాజికం కానీ - ఎక్కటానికి ఈ వందలాది మనుషులందరూ అడుగడుగునా చేయూతనిచ్చి పైకి ఎక్కించారు. కోరికలతో నిచ్చెన అడుగున చక్కర్లు కొట్టేవారందరూ పైకిచూస్తూ అక్కడికి చేరిన పెద్దలు అందరూ గర్విష్టులనీ, పొగరుమోతులనీ గొణుగుతూ ఉంటారు. ఆ పెద్దవారి స్నేహము, ఆదరణ, వ్యాపారము దొరకకపోతే, వాళ్ళను ఒక మోస్తరు ముఠా అనీ, ఒకరికొకరు సరిపడిన వాళ్ళనీ, వంకలు పెడతారు. వారు ఇప్పటికే చాలా ఎత్తు ఎదిగారనీ, ఇంక ఎదగటం సాధ్యంకాదనీ గొణుగుతూ ఉంటారు...................© 2017,www.logili.com All Rights Reserved.