నా మాట .....
ప్రతి ఓటమీ గెలుపునకు పునాది కావాలి!
అవును! మనిషి ఓటమిలోంచి గెలుపుని సాధించాలి. ఇదే వ్యక్తిత్వ వికాస ప్రయోజనం. వ్యక్తిత్వ వికాసానికి ప్రస్తుత ప్రపంచంలో గిరికీ చాలా పెరిగింది. కారణం ఉన్నత లక్ష్యాలు అందుకోవటానికి సాధారణ వ్యక్తిత్వ శక్తి సరిపోదు.
సాధారణ వ్యక్తిలో నిద్రాణంగా ఉండే శక్తుల్ని జాగృతం చేయాలంటే వ్యక్తిత్వం వికసించాలి. అలా వికసించాలంటే, వ్యక్తికి తనలో గల అసాధారణ శక్తుల పరిచయం, ప్రోత్సాహం, మార్గదర్శకం చేయాలి.
పాశ్చాత్య దేశాలు పారిశ్రామికంగా, వైజ్ఞానికంగా, సామాజికంగా మనకంటే ఎంతో ముందున్నాయి. అలా ఉండటం వెనుక ఎన్నో శతాబ్దాల చారిత్రక నేపథ్యం ఉంది.
ప్రతి మహావృక్షం, బాల్యంలో చిన్న మొక్కే! ఇంకా చెప్పాలంటే కేవలం చిన్న విత్తనం.
విత్తనం మెల్లగా, అనుకూల వాతావరణంలో కళ్లు తెరిస్తే, మొక్క అవుతుంది. అటు తర్వాత అది కాలంతోపాటు ఎదిగి మహావృక్షమౌతుంది.
భారతదేశంలో జనం భాస్కరుని తేజంలో వెలిగిపోయిన అతి ప్రాచీన కాలంలో, మిగతా దేశాలన్నీ బాగా వెనుకబడి ఉండేవి. మహాభారత కాలంలో చెప్పబడిన దేశాలన్నీ భారతదేశం ఏలుబడిలోనే ఉండేవి.
నా మాట ..... ప్రతి ఓటమీ గెలుపునకు పునాది కావాలి! అవును! మనిషి ఓటమిలోంచి గెలుపుని సాధించాలి. ఇదే వ్యక్తిత్వ వికాస ప్రయోజనం. వ్యక్తిత్వ వికాసానికి ప్రస్తుత ప్రపంచంలో గిరికీ చాలా పెరిగింది. కారణం ఉన్నత లక్ష్యాలు అందుకోవటానికి సాధారణ వ్యక్తిత్వ శక్తి సరిపోదు. సాధారణ వ్యక్తిలో నిద్రాణంగా ఉండే శక్తుల్ని జాగృతం చేయాలంటే వ్యక్తిత్వం వికసించాలి. అలా వికసించాలంటే, వ్యక్తికి తనలో గల అసాధారణ శక్తుల పరిచయం, ప్రోత్సాహం, మార్గదర్శకం చేయాలి. పాశ్చాత్య దేశాలు పారిశ్రామికంగా, వైజ్ఞానికంగా, సామాజికంగా మనకంటే ఎంతో ముందున్నాయి. అలా ఉండటం వెనుక ఎన్నో శతాబ్దాల చారిత్రక నేపథ్యం ఉంది. ప్రతి మహావృక్షం, బాల్యంలో చిన్న మొక్కే! ఇంకా చెప్పాలంటే కేవలం చిన్న విత్తనం. విత్తనం మెల్లగా, అనుకూల వాతావరణంలో కళ్లు తెరిస్తే, మొక్క అవుతుంది. అటు తర్వాత అది కాలంతోపాటు ఎదిగి మహావృక్షమౌతుంది. భారతదేశంలో జనం భాస్కరుని తేజంలో వెలిగిపోయిన అతి ప్రాచీన కాలంలో, మిగతా దేశాలన్నీ బాగా వెనుకబడి ఉండేవి. మహాభారత కాలంలో చెప్పబడిన దేశాలన్నీ భారతదేశం ఏలుబడిలోనే ఉండేవి.© 2017,www.logili.com All Rights Reserved.