ఇప్పుడు మనం చూస్తున్న న్యాయవ్యవస్థకి ఎంతో చారిత్రిక నేపథ్యం ఉంది. భారతదేశం సర్వస్వతంత్రంగా, అనేక రాజ్యాల కూటమిగా ఉన్నప్పుడు హిందూ ధర్మశాస్త్రాలకు అనుగుణంగానే న్యాయప్రక్రియ జరిగేది. ఆ రోజుల్లో 'ధర్మాదికారి' పేరుమీదనే విచారణలు జరిగేవి. ఇప్పుడు 'న్యాయమూర్తి' ఆ స్థానాన్ని స్వీకరించారు. మన దేశంమీద ముస్లిముల దండయాత్రలు, వారి పాలన వల్ల మన దేశ న్యాయవ్యవస్థమీద వారి ప్రభావం పడింది.
మత మార్పిడులతో ప్రజల్లో ముస్లిముల శాతం పెరిగింది. హిందువుల ధర్మశాస్త్రాలకనుగుణంగా విచారణలు జరిపినా, అధికంగా వారి శాసనాలే చెల్లుబాటు అయ్యేవి. ఇక బ్రిటీషువారు యావద్భారతదేశాన్ని తమ ఏలుబడిలోకి తెచ్చుకున్నాక, ఇంగ్లండు చట్టాలకు అనుగుణంగా మన దేశంలో చట్టాలు చేయబడ్డాయి. కాలానుగుణంగా వాటిలో అనేక మార్పులు, సవరణలు జరుగుతూనే ఉన్నాయి. వీటి గురించి తెలుసుకోవటం చాలా అవసరం. చట్టాలు - చరిత్ర అనే ఈ రచన ఉద్దేశం అందరికీ న్యాయ పరిచయం కలిగించటమే.
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్
ఇప్పుడు మనం చూస్తున్న న్యాయవ్యవస్థకి ఎంతో చారిత్రిక నేపథ్యం ఉంది. భారతదేశం సర్వస్వతంత్రంగా, అనేక రాజ్యాల కూటమిగా ఉన్నప్పుడు హిందూ ధర్మశాస్త్రాలకు అనుగుణంగానే న్యాయప్రక్రియ జరిగేది. ఆ రోజుల్లో 'ధర్మాదికారి' పేరుమీదనే విచారణలు జరిగేవి. ఇప్పుడు 'న్యాయమూర్తి' ఆ స్థానాన్ని స్వీకరించారు. మన దేశంమీద ముస్లిముల దండయాత్రలు, వారి పాలన వల్ల మన దేశ న్యాయవ్యవస్థమీద వారి ప్రభావం పడింది. మత మార్పిడులతో ప్రజల్లో ముస్లిముల శాతం పెరిగింది. హిందువుల ధర్మశాస్త్రాలకనుగుణంగా విచారణలు జరిపినా, అధికంగా వారి శాసనాలే చెల్లుబాటు అయ్యేవి. ఇక బ్రిటీషువారు యావద్భారతదేశాన్ని తమ ఏలుబడిలోకి తెచ్చుకున్నాక, ఇంగ్లండు చట్టాలకు అనుగుణంగా మన దేశంలో చట్టాలు చేయబడ్డాయి. కాలానుగుణంగా వాటిలో అనేక మార్పులు, సవరణలు జరుగుతూనే ఉన్నాయి. వీటి గురించి తెలుసుకోవటం చాలా అవసరం. చట్టాలు - చరిత్ర అనే ఈ రచన ఉద్దేశం అందరికీ న్యాయ పరిచయం కలిగించటమే. - కాటూరు రవీంద్ర త్రివిక్రమ్© 2017,www.logili.com All Rights Reserved.